AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PSLV-C58: న్యూ ఇయర్‌ అదిరిపోవాల్సిందే.. పీఎస్‌ఎల్వీ-సీ58 కౌంట్‌డౌన్‌ స్టార్ట్ చేసిన ఇస్రో..

గగన సీమలో అద్భుత విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో ఈ ఘనత సాధించడంలో ఎన్నో కష్టాలున్నాయి. ఎందరో శాస్త్రవేత్తల త్యాగాలున్నాయి. ఇప్పటికే తన పరిశోధనతో చరిత్ర సృష్టిస్తున్న ఇస్రో గత ఏడాది 2023 లో చంద్రుడి, ఆదిత్యుడి రహస్యాలను తెలుసుకోవడంలో సక్సెస్ కాగా తాజాగా మరో ప్రయోగానికి రెడీ అవుతోంది. కొత్త సంవత్సరం 2024 జనవరి1 వ తేదీన ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. రేపు ఉదయం పీఎస్‌ఎల్వీ-సీ58 (PSLV-C58)ని ప్రయోగించనుంది.

PSLV-C58: న్యూ ఇయర్‌ అదిరిపోవాల్సిందే.. పీఎస్‌ఎల్వీ-సీ58 కౌంట్‌డౌన్‌ స్టార్ట్ చేసిన ఇస్రో..
Isro Pslv C58
Surya Kala
|

Updated on: Dec 31, 2023 | 11:20 AM

Share

సైకిల్ మీద శాటిలైట్స్ తీసుకుని వెళ్లి ప్రయోగాలను చేసే స్టేజ్ నుంచి నేడు చంద్రుడి మీద అతి సునాయాసంగా అడుగు పెట్టె స్టేజ్ కు చేరుకుంది భారత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. ప్రపంచ దేశాల అవహేనలను ఎదుర్కొంటూ.. ఆటుపోట్లను తట్టుకుని తన ప్రయోగాలతో భారత దేశాన్ని ప్రపంచం ముందు తలెత్తుకునేలా చేశారు శాస్త్రవేత్తలు. గగన సీమలో అద్భుత విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో ఈ ఘనత సాధించడంలో ఎన్నో కష్టాలున్నాయి. ఎందరో శాస్త్రవేత్తల త్యాగాలున్నాయి. ఇప్పటికే తన పరిశోధనతో చరిత్ర సృష్టిస్తున్న ఇస్రో గత ఏడాది 2023 లో చంద్రుడి, ఆదిత్యుడి రహస్యాలను తెలుసుకోవడంలో సక్సెస్ కాగా తాజాగా మరో ప్రయోగానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం 2024 కూడా ఘనంగా ప్రారంభించడానికి రెడీ అయింది.

2023 చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1 ప్రయోగాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో భారత విజయపతాకాన్ని ప్రపంచ వినువీధుల్లో రెపరెపలాడించింది. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరో ప్రయోగానికి  రెడీ అయింది. కొత్త సంవత్సరం 2024 జనవరి1 వ తేదీన ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. రేపు ఉదయం పీఎస్‌ఎల్వీ-సీ58 (PSLV-C58)ని ప్రయోగించనుంది.

పీఎస్ఎల్వీ రాకెట్ సీ58 రాకెట్ 44.4 మీటర్లు పొడవు, 260 టన్నుల బరువు కలిగి ఉంటుంది. దీని జీవితకాలం ఐదేళ్ళు. ఇది ఎక్స్‌-రే మూలాలను అన్వేషించనుంది. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్ లో తాజా ప్రయోగం 60వది. ఎక్సోపోశాట్ శాటిలైట్ భూమికి 350 నుంచి 450 కిమీ ఎత్తులోని లియో ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగాన్ని నాలుగు దశల్లో పూర్తి చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

భారత్ కు చెందిన ఎక్స్‌-రే పొలారిమీటర్‌ శాటిలైట్ (ఎక్స్‌పోశాట్‌)ను పీఎస్‌ఎల్వీ-సీ58 అంతరిక్షంలోకి తీసుకుని వెళ్లనుంది. సోమవారం ఉదయం 9.10 గంటలకు షార్‌లో కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం చెబుతూ ఏడాదిలో మొదటి ప్రయోగ వేదిక కానుంది. ఇక్కడ నుంచి గగన సీమలో వాహన నౌక దూసుకుని వెళ్లనుంది.

ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్‌ను ఇప్పటికే ఇస్రో ప్రారంభించింది. డిసెంబర్ 31న ఉదయం 8.10 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ జనవరి 1వ తేదీ ఉదయం 9.10 గంటలకు ముగియనుంది. ఎక్స్‌పోశాట్‌ కొత్త ఏడాది 2024 లో మన దేశ అంతరిక్ష ఆధారిత ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రంలో పురోగతికి నాంది పలకడానికి రెడీ అవుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..