Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu and Kashmir: మారుతున్న జమ్ముకశ్మీర్ ముఖ చిత్రం.. ఈ ఏడాదిలో 76 మంది ఉగ్రవాదుల హతం.. రికార్డ్ స్థాయిలో పర్యాటకులు

జమ్మూ కాశ్మీర్ పోలీసుల డేటా ప్రకారం గత దశాబ్దంలో ఈ సంవత్సరం అత్యంత ప్రశాంతంగా ఉంది. అప్పటి పరిస్థితులను పోలిస్తే ఇప్పుడు తక్కువ హింస నమోదైంది. జమ్మూ కాశ్మీర్ పోలీసు డిజిపి మాట్లాడుతూ ఈ ఏడాదిలో 48 ఆపరేషన్లు నిర్వహించమని పేర్కొన్నారు. ఇందులో 76 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. హతమైన వారిలో పాకిస్థాన్‌కు చెందిన 55 మంది ఉగ్రవాదులు ఉన్నారు. డీజీపీ ఆర్‌ఆర్‌ స్వైన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం మొత్తం 31 మంది ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉన్నారని, వీరిలో 4 మంది జమ్మూ డివిజన్‌కు చెందిన వారు కాగా, 27 మంది కాశ్మీర్‌కు చెందిన వారున్నారు.

Jammu and Kashmir: మారుతున్న జమ్ముకశ్మీర్ ముఖ చిత్రం.. ఈ ఏడాదిలో 76 మంది ఉగ్రవాదుల హతం.. రికార్డ్ స్థాయిలో పర్యాటకులు
Jammu And Kashmir
Follow us
Surya Kala

|

Updated on: Dec 31, 2023 | 10:19 AM

జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితులను గత దశాబ్దం కాలం నుంచి పరిగణిస్తే ఈ ఏడాది (2023)లో అతి తక్కువ హింస నమోదైంది. అదే సమయంలో ఈ ఏడాది రాష్ట్రానికి అత్యధికంగా పర్యాటకులు వచ్చి రికార్డు సృష్టించారు. గత కొన్నేళ్లుగా జమ్మూ కాశ్మీర్‌లో హింసాత్మక  సంఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్‌కు వచ్చే పర్యాటకుల గ్రాఫ్‌లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. అంతేకాదు ఈ ఏడాదిలో ఇక్కడ పర్యాటకుల సంఖ్య కొత్త రికార్డును నమోదు చేసినట్లు తెలుస్తోంది.

జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు బాంబు పేలుళ్లు, ఎన్‌కౌంటర్లు, వివిధ ఉగ్రవాద కార్యకలాపాలతో పతాక శీర్షికలలో ఉండేది. ఈ సంవత్సరం G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. అనంతరం అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య గత కొన్ని దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టింది.

జమ్మూ కాశ్మీర్ పోలీసుల డేటా ప్రకారం గత దశాబ్దంలో ఈ సంవత్సరం అత్యంత ప్రశాంతంగా ఉంది. అప్పటి పరిస్థితులను పోలిస్తే ఇప్పుడు తక్కువ హింస నమోదైంది. జమ్మూ కాశ్మీర్ పోలీసు డిజిపి మాట్లాడుతూ ఈ ఏడాదిలో 48 ఆపరేషన్లు నిర్వహించమని పేర్కొన్నారు. ఇందులో 76 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. హతమైన వారిలో పాకిస్థాన్‌కు చెందిన 55 మంది ఉగ్రవాదులు ఉన్నారు. డీజీపీ ఆర్‌ఆర్‌ స్వైన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం మొత్తం 31 మంది ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉన్నారని, వీరిలో 4 మంది జమ్మూ డివిజన్‌కు చెందిన వారు కాగా, 27 మంది కాశ్మీర్‌కు చెందిన వారున్నారు.

ఇవి కూడా చదవండి

40 మంది చొరబాటుదారులను హతమార్చిన భద్రతా బలగాలు

ఈ డేటా ప్రకారం మొత్తం సంవత్సరంలో జమ్మూ, కాశ్మీర్‌లో మొత్తం 20 చొరబాటు ప్రయత్నాలు జరిగాయి.  వీటిని భద్రతా దళాలు విఫలం చేశారు. సుమారు 40 మంది చొరబాటుదారులను చంపారు. వీరిలో ఎక్కువ మంది పాకిస్తానీ మూలాలున్నవారే..  90వ దశకంలో కాశ్మీర్‌ను విడిచిపెట్టి తుపాకీ వినియోగంలో శిక్షణ కోసం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు వెళ్లిన చొరబాటుదారులున్నారు.

ఈ డేటా ప్రకారం ఉగ్రవాద సంస్థల్లో యువత రిక్రూట్‌మెంట్ ఈ సంవత్సరం అత్యల్పంగా ఉంది, ఇందులో ఉగ్రవాదులుగా మారిన చాలా మంది యువకులు వివిధ ఎన్‌కౌంటర్లలో మరణించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్‌ఆర్ స్వైన్ ప్రకారం ఉగ్రవాద సంస్థల్లోకి యువత రిక్రూట్‌మెంట్ 80% తగ్గింది. 2020లో 130 మంది యువకులు వివిధ ఉగ్రవాద సంస్థల్లో చేరగా, ఈ ఏడాది (2023)లో మొత్తం 22 మంది యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరారు.

రాళ్ల దాడి ఘటన

డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ఆర్ స్వైన్ ప్రకారం 2022 సంవత్సరంలో ఉగ్రవాదుల చేతిలో 31 మంది పౌరులు మరణించారు, అయితే ఈ సంవత్సరం (2023) ఉగ్రవాదుల చేతిలో 14 మంది మాత్రమే మరణించారు.

RR స్వైన్ ప్రకారం 2022 సంవత్సరంలో 14 మంది పోలీసు సిబ్బంది వివిధ ఆపరేషన్లలో అమరులయ్యారు.  అయితే ఈ సంవత్సరం (2023) కేవలం 4 మంది పోలీసు సిబ్బంది మాత్రమే అమరులయ్యారు. వీరిలో ఒక DSP, ఒక ఇన్‌స్పెక్టర్, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఉన్నారు.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్‌ఆర్ స్వైన్ లా అండ్ ఆర్డర్‌పై మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్‌లో రెండు రకాల రాళ్లదాడి సంఘటనలు జరిగాయని అన్నారు. ఒకటి విచ్చలవిడిగా స్టన్ పెల్టింగ్, మరొకటి ఆర్గనైజ్డ్ స్టన్ పెల్టింగ్, విచ్చలవిడిగా రాళ్ల దాడి 60% క్షీణత కనిపించింది. అయితే పాకిస్తాన్ అనుకూల వ్యవస్థీకృత రాళ్ల దాడి సంఘటనలు ఈ సంవత్సరం “సున్నా” గా నమోదయ్యాయి. అదే సమయంలో  పాకిస్తాన్ లేదా ఏర్పాటువాదులు లేదా తీవ్రవాదులు నిర్వహించిన దాడులు కూడా “సున్నా”గా నమోదయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డగౌట్ నుంచే ఢిల్లీపై మరణ శాసనం.. బ్రహ్మ రాతనే మార్చేసిన రోహిత్
డగౌట్ నుంచే ఢిల్లీపై మరణ శాసనం.. బ్రహ్మ రాతనే మార్చేసిన రోహిత్
ఇక సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ క్లాసులు..
ఇక సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ క్లాసులు..
పేరులేని రైల్వే స్టేషన్.. కారణం తెలిస్తే షాకే..
పేరులేని రైల్వే స్టేషన్.. కారణం తెలిస్తే షాకే..
బెంగళూరు లైంగింక వేధింపుల నిందితుడు అరెస్ట్..ఎక్కడ దొరికాడంటే?
బెంగళూరు లైంగింక వేధింపుల నిందితుడు అరెస్ట్..ఎక్కడ దొరికాడంటే?
చార్ ధామ్ యాత్రలో ముందు ఏ క్షేత్రాన్ని దర్శించుకోవాలి? ప్రాముఖ్యత
చార్ ధామ్ యాత్రలో ముందు ఏ క్షేత్రాన్ని దర్శించుకోవాలి? ప్రాముఖ్యత
అమరావతి 2.0.. మరో 44 వేల ఎకరాల భూ సేకరణకు సన్నద్ధం..
అమరావతి 2.0.. మరో 44 వేల ఎకరాల భూ సేకరణకు సన్నద్ధం..
బుమ్రా, కరుణ్ నాయర్ గొడవ.. రోహిత్ ఎక్స్‌ప్రెషన్స్ నెక్ట్స్ లెవల్
బుమ్రా, కరుణ్ నాయర్ గొడవ.. రోహిత్ ఎక్స్‌ప్రెషన్స్ నెక్ట్స్ లెవల్
56 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఇదే రహస్యం
56 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఇదే రహస్యం
ఊపిరి తిత్తులకు శ్రీ రామ రక్ష ఈ హెర్బల్ టీలు.. మిల్క్ టీకి బదులు.
ఊపిరి తిత్తులకు శ్రీ రామ రక్ష ఈ హెర్బల్ టీలు.. మిల్క్ టీకి బదులు.
ఉదయమే నిద్రలేచిన ఊరు ఉలిక్కిపాటు.. భవనానికి వేలాడిన డెడ్ బాడీ!
ఉదయమే నిద్రలేచిన ఊరు ఉలిక్కిపాటు.. భవనానికి వేలాడిన డెడ్ బాడీ!