Sunday Astro Tips: ఆర్ధిక ఇబ్బందులా .. ఆదివారం ఈ నివారణ చర్యలు చేసి చూడండి.. లక్ష్మీదేవి అనుగ్రహం సొంతం చేసుకోండి..

రావి చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుందని.. కనుక రావి చెట్టుని పూజించడం వల్ల లక్ష్మీదేవి సంతుష్టురాలై ఇల్లు సిరి సంపదలతో నింపుతుందని విశ్వాసం. ముఖ్యంగా ఆదివారం సాయంత్రం రావి చెట్టు క్రింద నాలుగు వైపులా దీపం వెలిగిస్తే.. ఇంటికి సంపద , శ్రేయస్సు వస్తుంది. లక్ష్మీ దేవి  ఆశీర్వాదం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు కూడా తిరిగి వచ్చి అప్పుల బాధ నుంచి విముక్తుడవుతాడు. ముఖ్యంగా స్త్రీలకు ఈ దీపం వెలిగించడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.

Sunday Astro Tips: ఆర్ధిక ఇబ్బందులా .. ఆదివారం ఈ నివారణ చర్యలు చేసి చూడండి.. లక్ష్మీదేవి అనుగ్రహం సొంతం చేసుకోండి..
Sun Astro Tips
Follow us
Surya Kala

|

Updated on: Dec 31, 2023 | 7:35 AM

ఆదివారం నాడు ఉదయించే, అస్తమించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించిన వారి అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసి డబ్బు సంపాదిస్తారు. ఆదివారం ఉదయం స్నానం చేసిన వెంటనే సూర్య భగవానుడికి అర్ఘ్యన్ని సమర్పించండి. అర్ఘ్యం సమర్పించే నీటిలో కొంచెం పసుపు, ,కుంకుమ, నువ్వులను వేయండి. ఓం సూర్య దేవాయ నమః అని పఠిస్తూ సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ దేవి  అనుగ్రహాన్ని పొందుతారని విశ్వాసం.

రావి చెట్టు దగ్గర దీపం..

రావి చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుందని.. కనుక రావి చెట్టుని పూజించడం వల్ల లక్ష్మీదేవి సంతుష్టురాలై ఇల్లు సిరి సంపదలతో నింపుతుందని విశ్వాసం. ముఖ్యంగా ఆదివారం సాయంత్రం రావి చెట్టు క్రింద నాలుగు వైపులా దీపం వెలిగిస్తే.. ఇంటికి సంపద , శ్రేయస్సు వస్తుంది. లక్ష్మీ దేవి  ఆశీర్వాదం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు కూడా తిరిగి వచ్చి అప్పుల బాధ నుంచి విముక్తుడవుతాడు. ముఖ్యంగా స్త్రీలకు ఈ దీపం వెలిగించడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. అంతేకాదు ఇంటిలోని స్త్రీలు ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. దీంతో లక్ష్మీదేవి ఇంటిలోకి అడుగు పెడుతుందని విశ్వాసం

ఇంటి సభ్యులందరూ కలిసి పూజ

ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. అంతేకాదు ఈ రోజుని గణపతిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇంటిలోని వారందరూ కలిసి ఇంటి పూజ గదిలో దీపం వెలిగించి పూజలు చేస్తే విశేష ఫలం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల గణపతి ప్రసన్నుడవుతాడు. అంతేకాదు లక్ష్మీ దేవి తన భక్తుల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

‘చేపలకు ఆహారాన్ని అందించండి

సముద్ర మథనం సమయంలో నీటి నుండి లక్ష్మీదేవి ఉద్భవించినందున లక్ష్మీదేవి నీటిలో నివసిస్తుందని విశ్వాసం. అందుచేత ఆదివారం రోజున నదిలో లేదా చెరువులో నివసించే చేపలకు ఆహారాన్ని అందించండి. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి నెలకొని ఇల్లు ధనధాన్యాలతో ఎటువంటి కొరత లేకుండా ఉంటుంది.

సూర్య భగవానుని ఆరాధన

ఆదివారం సూర్యభగవానుని రోజు కనుక ఈ రోజున సూర్య భగవానుని ప్రధానంగా పూజించాలి. సూర్యోదయ సమయంలో సూర్యుడికి నమస్కరిస్తూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, సిరి సంపదలు ఉంటాయి. ఆదివారం నాడు మాతా గాయత్రిని పూజించడం వల్ల ఆర్ధిక ఇబ్బందులు తీరతాయి.

కొత్త చీపురు కొనండి.

ఆదివారం కొత్త చీపురు కొనండి. కొత్త చీపురుతో ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఐశ్వర్యాన్ని నింపుతుంది. అదే సమయంలో ఇంటి నుండి చీపురును తీసివేయవలసి వస్తే, ఆదివారం నాడు పొరపాటున కూడా పడవేయకండి. ఇలా చేయడం వలన ఆ ఇంట్లో డబ్బులకు ఇబ్బందులు.. కష్టాలు ఏర్పడే అవకాశం ఉంది.

గోమాతకు పూజ

33 కోట్ల మంది దేవతలు గోమాతలో నివసిస్తారని హిందువుల విశ్వాసం. ఆవుకు ఆహారాన్ని అందించండి. ఇలా చేయడం ద్వారా దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. ముఖ్యంగా ఆదివారం నాడు ఆవుకి నెయ్యి కలిపిన ఆహారాన్ని బెల్లం కలిపి తినిపించండి. ఇలా చేయడం వల్ల ఇల్లు ధనం, ధాన్యాలతో నిండిపోతుంది.

ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు ఉంటే ఆదివారం నాడు ఈ నివారణలను ప్రయత్నించండి. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు