Tirumala: స్త్రీలు కూడా జుట్టు సమర్పించే ఏకైక దేవాలయం తిరుపతి.. దీని వెనుక పురాణం కథ ఏమిటంటే

ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏమిటంటే భక్తులు తమ కష్టాలను, కోరికలను విన్నవిస్తూ.. స్వామివారికి జుట్టు ఇస్తామని మొక్కుకుంటారు. అవి తీరిన తర్వాత తిరుపతి క్షేత్రంలో స్వామివారికి తమ జుట్టునుని  సమర్పిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇలా శ్రీవారికి వెంట్రుకలను మొక్కు తీర్చుకోవడం వెనుక ఓ కథ ఉంది. ఈ క్షేత్రంలో వెంట్రుకలను ఇవ్వడం ద్వారా, కోరికలు నెరవేరుతాయని.. అదే సమయంలో లక్ష్మీ దేవి కూడా సంతోషిస్తుందని.. సుఖ సంపదలను ప్రసాదిస్తుందని విశ్వాసం. 

Tirumala: స్త్రీలు కూడా జుట్టు సమర్పించే ఏకైక దేవాలయం తిరుపతి.. దీని వెనుక పురాణం కథ ఏమిటంటే
Tirumala Tirupati
Follow us
Surya Kala

|

Updated on: Dec 27, 2023 | 8:28 AM

భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి తిరుమల తిరుపతి క్షేత్రం. కలియుగ దైవంగా భావించి పూజించే వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం దేశం నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. స్వామి క్షేత్రం నిత్యకల్యాణం పచ్చతోరణం అన్న చందంగా కనులవిందు చేస్తుంది. తిరుపతి వెంకన్న ఆలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే  భక్తులు స్వామివారిపై తమ భక్తిని చాటుకుంటూ కోట్ల విలువైన కానుకలు సమర్పిస్తారు. స్థలం, డబ్బు, బంగారం సహా విలువైన వస్తువులు స్వామివారికి కానుకలుగా సమర్పిస్తారు.

ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏమిటంటే భక్తులు తమ కష్టాలను, కోరికలను విన్నవిస్తూ.. స్వామివారికి జుట్టు ఇస్తామని మొక్కుకుంటారు. అవి తీరిన తర్వాత తిరుపతి క్షేత్రంలో స్వామివారికి తమ జుట్టునుని  సమర్పిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇలా శ్రీవారికి వెంట్రుకలను మొక్కు తీర్చుకోవడం వెనుక ఓ కథ ఉంది. ఈ క్షేత్రంలో వెంట్రుకలను ఇవ్వడం ద్వారా, కోరికలు నెరవేరుతాయని.. అదే సమయంలో లక్ష్మీ దేవి కూడా సంతోషిస్తుందని.. సుఖ సంపదలను ప్రసాదిస్తుందని విశ్వాసం.

తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జుట్టు మొక్కు చెల్లించడం వెనుక ఒక పురాణం ఉంది.  లక్ష్మీదేవిని వెదుకుతూ అలసిన శ్రీనివాసుడు పర్వతం మీద విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడు వేంకటేశ్వరుడి మీద చీమల పుట్ట ఏర్పడింది. అయితే వేంకటేశ్వరు వద్దకు ప్రతిరోజూ ఒక ఆవు వచ్చి పాలు ఇచ్చి వెళ్లిపోతుండేది. ఒకరోజు ఆవు చీమల పుట్టలో పాలు ధారలుగా ఇవ్వడం చూసిన పశువుల కాపరి కోపంతో ఆవుపై దాడి చేశాడు. ఆవుని కొట్టగా ఆ దెబ్బ పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామికి తగిలి గాయపడ్డాడు. దీని  కారణంగా శ్రీనివాసుడి తలపై గాయం ఏర్పడింది. తలపై గాయం ఉన్న ప్రదేశంలో వెంట్రుకలు కూడా పడిపోయాయి.

ఇవి కూడా చదవండి

అప్పుడు తన కొడుకు గాయాన్ని చూసిన నీలాంబరి తన జుట్టును కత్తిరించి.. వేంకటేశ్వరుని తలపై ఉన్న గాయం వద్ద పెట్టింది. అప్పుడు వెంకటేశ్వరుడి గాయం నయమైంది. వేంకటేశ్వరుడు గాయం మానడంతో ప్రసన్నుడయ్యాడు. అప్పుడు స్త్రీకి జుట్టు చాలా ముఖ్యమైనది. జుట్టు మాత్రమే స్త్రీకి  అందాన్ని పెంచుతుంది, నువ్వు నా కోసం మీ జుట్టును త్యాగం చేశావు కనుక ఈ రోజు నుండి మీలాగే నా కోసం జుట్టుని సమర్పించే భక్తులు కోరిక నెరవేరుతుంది. అప్పట్నుంచి తిరుపతి దేవస్థానంలో కేశఖండన ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు