AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pisces Horoscope 2024: మీన రాశిలో రాహువు సంచారం.. శారీరక, మానసిక ఇబ్బందులు.. నివారణ చర్యలు ఏమిటంటే..

మీన రాశిలో రాహువు సంచరిస్తుండడం వల్ల శరీరకంగా, మానసికంగా అనారోగ్యం బారిన పడవచ్చు. ముఖ్యంగా మానసికంగా ఇబ్బంది పడవచ్చు. మీన రాశి వారు 2024 సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు. చిన్న ఆలోచనలు కూడా భారీ మూల్యాన్ని చెల్లించేవిగా మారవచ్చు. ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో 2024 సంవత్సరం మీన రాశికి చెందిన వారి ఎలా ఉండనుందో ఈ రోజు తెలుసుకుందాం..

Pisces Horoscope 2024: మీన రాశిలో రాహువు సంచారం.. శారీరక, మానసిక ఇబ్బందులు.. నివారణ చర్యలు ఏమిటంటే..
Pisces Horoscope 2024
Surya Kala
|

Updated on: Dec 27, 2023 | 7:37 AM

Share

కొత్త సంవత్సరం 2024 కి నాలుగు రోజుల్లో స్వాగతం చెప్పడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రతి ఒక్కరూ కొత్త ఏడాదికి తమకు ఎలా ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలని కోరుకుంటారు. అదే సమయంలో జీవితం ఎటువంటి వివాదాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ కొత్త ఏడాదిలో తమ కెరీర్, ఆరోగ్యం, ప్రేమ జీవితం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని భావిస్తారు. జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటిని తట్టుకుని విజయం వైపు పయనించేవాళ్లే ధీరుడు అని చెబుతారు. ఈ నేపథ్యంలో 2024 సంవత్సరం మీన రాశికి చెందిన వారి ఎలా ఉండనుందో ఈ రోజు తెలుసుకుందాం..

మీన రాశిలో రాహువు సంచరిస్తుండడం వల్ల శరీరకంగా, మానసికంగా అనారోగ్యం బారిన పడవచ్చు. ముఖ్యంగా మానసికంగా ఇబ్బంది పడవచ్చు. మీన రాశి వారు 2024 సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు. చిన్న ఆలోచనలు కూడా భారీ మూల్యాన్ని చెల్లించేవిగా మారవచ్చు. ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందే పరిస్థితి ఉంటుంది.

మీన రాశికి బృహస్పతి అధిపతి. శుక్రుడు ఎక్కువ ఫలాలను ఇచ్చే రాశి కూడా. అయితే ప్రస్తుతం రాహువు ఈ రాశిలో సంచరిస్తున్నాడు. అదే సమయంలో బృహస్పతి కూడా రెండవ నుండి మూడవ స్థానానికి వెళ్ళబోతున్నాడు. మరోవైపు శుక్రుడు. శని ద్వాదశలో ఉన్నాడు. దీంతో ఏలి నాటి శని ప్రభావానికి ఈ రాశి వారికీ గురయ్యే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా నడవాలి.

ఇవి కూడా చదవండి

ఆదాయ మార్గాలు

ఈ సంవత్సరం మీన రాశి  మిశ్రమ ఫలాలను పొందుతారు. ద్వితీయాధిపతి అయిన కుజుడు సంవత్సరారంభంలో నవమంలో ఉన్నాడు. సోదరుని నుండి మీకు సహకారం లభిస్తుంది. కుటుంబం కూడా మీతో ఉంటుంది. ఏ పనిలోనైనా ముందుకు సాగుతారు. అప్పుడు అది భిన్నంగా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరి మద్దతుని తీసుకోరు..  ముందుకు సాగడానికి ఇష్టపడరు. మానసిక ప్రశాంతత కోల్పోయి ఇబ్బంది పడతారు.

ప్రేమ- వివాహం:

మీరు పట్ల ఇతరులు చూపించేది కేరింగ్ ను ప్రేమలా భావిస్తారు. అయితే అది ప్రేమ కాదు. మోసం జరిగే అవకాశం ఉంది. ప్రేమ పేరు చెప్పి సంపదను పోగొట్టుకున్నట్టే.. మీ ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచకుండా ప్రియమైనవారితో సంఘటనలను పంచుకోండి.

కెరీర్:

ఉద్యోగ పరంగా విద్యారంగంలో ఉన్న వారికి సంవత్సరం ప్రారంభంలో మంచి గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి.  దాన్ని కొనసాగించడం అనేది ప్రవర్తనతో ఆధారపడి ఉంటుంది. ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారు మరింత పేరు ప్రఖ్యాతులు, ఆర్థిక శక్తిని పొందుతారు.

ఆరోగ్య స్థితి:

అప్పుడప్పుడూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దెబ్బలు తగులే అవకాశం ఉంది. ఇది మీకు పెద్ద తలనొప్పిగా ఉంటుంది. అయితే తమని ఎవ్వరూ ఓదార్చకూడదని భావిస్తారు. వ్యాయామం ధ్యానం ప్రతిరోజూ చేయండి.

విదేశీ ప్రయాణం:

విదేశాలకు వెళ్లే అవకాశం తక్కువ. వృత్తి రీత్యా ఇతర ప్రాంతాలను చూసే అవకాశం ఉంటుంది. అది కూడా ఏడాదిలో అర్ధభాగం గడిచిన తర్వాత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

నివారణ చర్యలు

ఈ సంవత్సరం మీరు తరచుగా దత్త దర్శనం చేసుకోండి. గురుచరిత్ర పారాయణం చేయండి. గురువారం లేదా పుష్య నక్షత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు