Astro Tips: ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ కలలను ఈజీగా వదులుకుంటారు..
అదే సమయంలో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు తమ కలలను సాధించుకునే సమయంలో అడ్డంకులు ఎదురైతే తమ ఆశలను, కొన్ని లక్ష్యాలను సులభంగా వదులుకునే అవకాశం ఉంది. ఈ రోజు తమ కలలను సాధించుకునే సమయంలో ప్రతి కూలత ఎదురైతే తమ కలలను సులభంగా కొన్ని రాశుల వారు వదులుకుంటారు. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
ప్రతి వ్యక్తి తమ జీవితానికి సంబంధించిన ఏదొక కల కంటూనే ఉంటారు. తమ కలలను సాధించాలని అనుసరిస్తూ చేసే ప్రయాణంలో సవాళ్లు, అడ్డంకులు అనివార్యం. అయితే కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు తమ కలలను నెరవేర్చుకునే సమయంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొంటారు. అదే సమయంలో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు తమ కలలను సాధించుకునే సమయంలో అడ్డంకులు ఎదురైతే తమ ఆశలను, కొన్ని లక్ష్యాలను సులభంగా వదులుకునే అవకాశం ఉంది. ఈ రోజు తమ కలలను సాధించుకునే సమయంలో ప్రతి కూలత ఎదురైతే తమ కలలను సులభంగా కొన్ని రాశుల వారు వదులుకుంటారు. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
మీన రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు సున్నితమైన మనస్కులు. భావోద్వేగ స్వభావం కలవారు. సృజనాత్మకతకు అవధులు లేకపోయినా.. కష్టాల్లో కూరుకుపోయే ధోరణి కలిగి ఉంటారు. దీంతో తమ కలలను సులభంగా వదులుకుంటారు. వీరు తమ ఆకాంక్షలను కొనసాగించే విధంగా కఠినమైన వాస్తవాలను అర్ధం చేసుకుని నడుచుకోవాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎక్కువగా భావోద్వేగాలను కలిగి ఉంటారు. లోతైన ఆలోచనాతీరుని కలిగి ఉంటారు. తరచుగా సౌకర్యం, భద్రతను కోరుకుంటారు. అయితే తాము చేపట్టిన పనుల్లో వైఫల్యం ఎదురవుతుందని.. లేదా తమని తిరస్కరిస్తారన్న భయం వారికి అధికంగా ఉంటుంది. తద్వారా సంభావ్య మానసిక క్షోభను నివారించడానికి తమ కలలను వదులుకుంటారు. ఈ రాశికి చెందిన వారు ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నప్పుడు ముందుకు సాగడం సవాలుగా భావిస్తారు.
తుల రాశి: సంతులనం, సామరస్య పూరితమైన ఆలోచన కు ప్రసిద్ధి ఈ రాశివారు. తమ కలలు, కోరికలను సాధించే సమయంలో అనూహ్య పరిస్థితి ఏర్పడితే ఇబ్బంది పడతారు. తాము తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నామేమో అన్న భయం లేదా తమ జీవితాల్లో సమతుల్యత దెబ్బతింటుందని భయపడి.. తమ కలలను, ఆకాంక్షలను మధ్యలోనే విడిచిపెట్టవచ్చు.
ధనుస్స రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు సాహసోపేతంగా ఉంటారు. ఉత్సాహంగా ఉంటారు. అయితే వీరి స్వభావం కొన్నిసార్లు .. వీరికి వ్యతిరేకంగా పని చేస్తుంది. తాము కన్న కలలను సాధించడానికి అవసరమైన కృషి, పట్టుదలని ఎదుర్కొనాల్సిన సమయం వచ్చినప్పుడు త్వరగా ఆసక్తిని కోల్పోతారు. చేయాల్సిన పనుల పట్ల ఉత్తేజకరమైన ప్రయత్నాన్ని చేస్తూనే.. మధ్యలోనే విడిచి పెడతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు