AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gemini Horoscope 2024: కొత్త ఏడాదిలో మిథునం వారికి మిశ్రమ ఫలితాలు.. ఈ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాల్సిందే..

2024 సంవత్సరంలో  మిథునరాశి వారికి ఎలా ఉండనున్నాదో ఈ రోజు తెల్సుకుందాం.. ఈ రాశి వారికీ భారీ సంఖ్యలో స్నేహితులు, సన్నిహితులు ఉంటారని జ్యోతిష్యులు చెప్పారు. అంతేకాదు వీరు తమ  ఉదార ​​స్వభావం, సౌమ్యతతో 2024 సంవత్సరంలో చాలా ఉపయోగాలను పొందనున్నారు. అయితే ఈ ఏడాది ఈ రాశికి చెందిన వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరం ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ ప్రణాళికలను పదే పదే మార్చుకుంటారు. దీంతో అనేక ఇబ్బందులను పడతారు. ఉద్యోగస్తులు కొత్త పని కోసం వెతుకుతారు. జనవరి మొదటి వారంలో సూర్యుడు వృశ్చికరాశిలో సంచరించే సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితం సమస్యలతో నిండి ఉంటుంది.

Gemini Horoscope 2024: కొత్త ఏడాదిలో మిథునం వారికి మిశ్రమ ఫలితాలు.. ఈ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాల్సిందే..
Gemini Horoscope 2024
Surya Kala
|

Updated on: Dec 24, 2023 | 8:33 AM

Share

కొత్త సంవత్సరంలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి తమకి కొత్త ఏడాదిలో తమ విద్య, ఉద్యోగం, ప్రేమ, వైవాహిక జీవితం, సంపద ఇలా ప్రతి ఒక్కటికీ ఎలా ఉందనున్నదో తెలుసుకోవాలని భావిస్తారు. ఈ నేపథ్యంలో 2024 సంవత్సరంలో  మిథునరాశి వారికి ఎలా ఉండనున్నాదో ఈ రోజు తెల్సుకుందాం.. ఈ రాశి వారికీ భారీ సంఖ్యలో స్నేహితులు, సన్నిహితులు ఉంటారని జ్యోతిష్యులు చెప్పాలు. అంతేకాదు వీరు తమ  ఉదార ​​స్వభావం, సౌమ్యతతో 2024 సంవత్సరంలో చాలా ఉపయోగాలను పొందనున్నారు. అయితే ఈ ఏడాది ఈ రాశికి చెందిన వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది.

ఈ సంవత్సరం ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ ప్రణాళికలను పదే పదే మార్చుకుంటారు. దీంతో అనేక ఇబ్బందులను పడతారు. ఉద్యోగస్తులు కొత్త పని కోసం వెతుకుతారు. జనవరి మొదటి వారంలో సూర్యుడు వృశ్చికరాశిలో సంచరించే సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితం సమస్యలతో నిండి ఉంటుంది. మిథున రాశి వారు ఈ సమయంలో మానసికంగా ఆందోళన చెందుతారు. వ్యాపారంలో అడుగు పెట్టాలని  ఆలోచిస్తున్నట్లయితే 2024 సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఆ ఆలోచనకు రూపం ఇవ్వొద్దు.

ప్రేమ/వివాహం

ఈ సంవత్సరం ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ ప్రేమ, వివాహ విషయాలలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరం మీ సన్నిహితులతో ప్రేమలో పడే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మీ కుటుంబంలో కొత్త వ్యక్తి రాకకు శుభ సంకేతం ఉందని.. ఇంట్లో ఎవరికైనా వివాహం జరిగే అవకాశం లేదా బిడ్డ పుట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. కుటుంబ సభ్యులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరికి సౌకర్యాన్ని అందించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. తోబుట్టువులతో కొంచెం మృదువుగా ప్రవర్తించవలసి ఉంటుంది.. లేకపోతే మీ గురించి చెడుగా మాట్లాడుకునే అవకాశం ఉంది. ప్రయత్నాలను పాడుచేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యం

మిథునరాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం పరంగా చాలా బాగుంటుంది. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లయితే దాని నుండి బయటపడతారట. ఓ వైపు మెడిసిన్స్ తీసుకుంటూనే.. తగిన పూజాది కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది.

కెరీర్

ఈ సంవత్సరం ఆఫీసులో శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్థులు శుభవార్త వింటారు. జీతంలో పెరుగుదల లేదా ప్రమోషన్ ఉండవచ్చు. ఈ సమయంలో ఉద్యోగం కోసం వెతికితే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్న వారికి సంవత్సరం ద్వితీయార్ధం చాలా మెరుగ్గా ఉంటుంది. కష్టపడి పనిచేస్తే,  కోరుకున్న ప్రదేశానికి బదిలీ పొందవచ్చు. వ్యాపారవేత్తలు కూడా తమ మూలధనాన్ని కొన్ని మంచి ప్రదేశాల్లో  పెట్టుబడి పెట్టవచ్చు. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

సంవత్సరం మొదటి అర్ధ భాగం చాలా అనుకూలంగా ఉంటుంది.  ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్నా మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఖర్చు కూడా గణనీయంగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు,  స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయవచ్చు లేదా కుటుంబ సభ్యుల కోసం ఖర్చు చేయవచ్చు. సంవత్సరం ద్వితీయార్థం అంత లాభదాయకం కాదు కనుక ఏదైనా పెద్ద డీల్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.  ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

విద్య

ఈ సంవత్సరం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగ స్థానానికి అధిపతి అయిన బృహస్పతి అధిష్టానంలో ఉన్నాడు కనుక ఈ సంవత్సరం వృత్తిపరమైన విద్యను అభ్యసించే వారికి మంచిదని  చెబుతున్నారు. చదువులో ఎటువంటి నిర్లక్ష్యంగా ఉండకూడదు. పోటీలకు సిద్ధమయ్యే విద్యార్థులకు సంవత్సరం ప్రథమార్థం బాగుంటుంది. విదేశాలల్లో చదువుతున్న వారికి ద్వితీయార్థం బాగుంటుంది. ఈ రాశికి చెందిన విద్యార్థులందరూ తమ చదువులపై పూర్తి శ్రద్ధ పెట్టాలన్నది సలహా ఇస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు