Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindu Funeral: అంత్యక్రియల వెనుక మర్మం ఏంటి? కుండలో నీళ్లు పోసి రంధ్రాలు పెట్టి ఎందుకు పగలగొడతారు తెలుసా?

కలియుగ ధర్మం ప్రకారం మనిషి లైఫ్ టైం 100 నుండి 120 సంవత్సరాలు. కానీ రోజు రోజుకూ మారుతున్న జీవన శైలి ఆహారపు అలవాట్లు కొత్త కొత్తగా వస్తున్న రోగాల దాటికి మనిషి జీవిత కాలం పై అంచనాలు లేకుండా పోయింది. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలి అంటే శరీరం ఆరోగ్యగం గా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం లో ప్రాణం పొతే ఆత్మ అందులో ఉండదు. ఎప్పుడు అయితే మనిషి చనిపోతాడో ఆత్మ వెళ్ళిపోతుంది.

Hindu Funeral: అంత్యక్రియల వెనుక మర్మం ఏంటి? కుండలో నీళ్లు పోసి రంధ్రాలు పెట్టి ఎందుకు పగలగొడతారు తెలుసా?
Hindu Funeral Ceremony
Follow us
Sridhar Prasad

| Edited By: Surya Kala

Updated on: Dec 22, 2023 | 1:43 PM

హిందూ సంప్రదాయంలో మాత్రమే కాదు ఏ మత సంప్రదాయంలో కూడా మనిషి చివరి జర్నీ రకరకాల పద్ధతుల్లో ఉంటాయి. అయితే హిందూ సంప్రదాయంలో మనిషి చనిపోయాక చివరి సారి చేసే కార్యక్రమాలను అంత్యక్రియలు అంటారు. అయితే ఆ చివరి తంతులో కాష్టం చుట్టూ అగ్గి పెట్టె వ్యక్తి భుజం పై ఒక కుండ పెట్టి ఆ కుండలో నీళ్లు పోసి చితి చుట్టూ మూడు సార్లు తిరగడడం తిరిగే ప్రతి సారి కుండకు ఒక్కో రంద్రం పెట్టడం చివరకు అ కుండను పగలగొట్టం అందరికి తెలిసిన విషయమే.. కానీ ఇప్పటికి అలా ఎందుకు చేస్తారు అనే విషయంలో మాత్రం దాదాపు ఎవరికీ అసలు విషయం తెలియదు. వాస్తవానికి మనిషి శరీరం ఆత్మ రెండు వేరు అనేది శాస్త్రాలు చెప్తాయి.

కలియుగ ధర్మం ప్రకారం మనిషి లైఫ్ టైం 100 నుండి 120 సంవత్సరాలు. కానీ రోజు రోజుకూ మారుతున్న జీవన శైలి ఆహారపు అలవాట్లు కొత్త కొత్తగా వస్తున్న రోగాల దాటికి మనిషి జీవిత కాలం పై అంచనాలు లేకుండా పోయింది. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలి అంటే శరీరం ఆరోగ్యగం గా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం లో ప్రాణం పొతే ఆత్మ అందులో ఉండదు. ఎప్పుడు అయితే మనిషి చనిపోతాడో ఆత్మ వెళ్ళిపోతుంది.

శరీరాన్ని దహనం చేసేదాకా ఆత్మ శరీరం లో చేరి తిరిగి లేపే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. పాడే కట్టి శరీరం అంతిమ యాత్ర చేస్తున్నప్పుడు స్మశానికి కొద్ది దూరంలోనే పాడే దింపి చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని విప్పి కింద పోస్తారు. ఎందుకు అంటే శరీరాన్ని కాల్చిన తరువాత కూడా ఇంటి మీద తన మనుషుల మీద ఉన్న ప్రేమతో తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే అలా రావాలి అంటే శవం మీద చల్లిన ప్యాలాలు బియ్యం గింజలను ఒక్కొక్కటిగా లెక్కించిన తరువాతే ఆత్మకు తన వాళ్ళను చూడటానికి అనుమతి ఉంటుంది అంటాయి పురాణాలు. అది కూడా సూర్యుడు అస్తమించక ముందే అంత లోపు లెక్కింపు అవ్వకుంటే తిరిగి మొదటి నుండి లెక్కించాలి.

ఇవి కూడా చదవండి

అయితే శరీరాన్ని చితిమీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంద్రాలు పెట్టి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే కుండ శరీరం లాంటిది. అందులో ఉన్న నీరు ఆత్మ లాంటిది కుండకు పెట్టిన రంద్రం నుండి నీరు ఎలా అయితే వెళ్లి పోతుందో శరీరం నుండి కూడా ఆత్మ అలానే వెళ్ళిపోతుంది. ఇక కుండను పగలగొడతాం అంటే శరీరాన్ని కాల్చేస్తాం. ఇంకా నీకు శరీరం లేదు వెళ్ళిపో అని ఆత్మకు మనము ఇచ్చే సంకేతం అంటారు. పెద్దలు హిందూ సాంప్రదాయం ప్రకారం చేసే ప్రతి పనిలో ఒక అర్ధం ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..