Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aquarius Horoscope 2024: కొత్త ఏడాదిలో కుంభ రాశిపై శని ప్రభావం.. ఈ రాశికి చెందిన వారి కెరీర్ ఎలా ఉండనున్నదంటే..

కుంభ రాశిలో పదకొండవ రాశి. రాశికి అధిపతి అయిన శనీశ్వరుడు ఈ రాశిలో సుమారు ఒకటిన్నర సంవత్సరాలు  ఉంటాడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరిగినా అధైర్య పడకుండా ముందుకు సాగితే విజయ శిఖరానికి చేరుకుంటారు. భవిష్యత్ విజయానికి ఇదే శిక్షణ అని భావించి పని, ఉద్యోగం, పరిశ్రమలో కష్టపడి ముందుకు కొనసాగాలి.

Aquarius Horoscope 2024: కొత్త ఏడాదిలో  కుంభ రాశిపై శని ప్రభావం.. ఈ రాశికి చెందిన వారి కెరీర్ ఎలా ఉండనున్నదంటే..
Aquarius Horoscope 2024
Follow us
Surya Kala

|

Updated on: Dec 22, 2023 | 11:14 AM

కొత్త ఏడాది లో కుంభ రాశికి చెందిన వ్యక్తులు తమ భవిష్యత్ ను తెలుసుకోవాలని భావిస్తారు. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఏలి నాటి శని నడుస్తోన్నందున ఐచ్ఛిక పనులు పూర్తి కావడానికి సమయం పడుతుంది. మానసికంగా ఇబ్బంది పడతారు. పని చేయడానికి నూటికి నూరు శాతం పనిచేసినా ఫలితం మాత్రం అంతంతమాత్రంగానే ఉంటుంది. నిరుత్సాహపడతారు. చేపట్టిన పనిలో ఆలస్యం జరిగిందని కుంగిపోకుండా, కుంచించుకుపోకుండా ముందుకు సాగితే విజయ శిఖరానికి చేరుకుంటారు. అయితే ఏ కారణం చేతనైనా లక్ష్యాన్ని మార్చుకుని మరో దారిలో ప్రయత్నం చేయడం మంచిది కాదు. జ్యోతిష్యం ప్రకారం కుంభ రాశి వారికి శనీశ్వరుడు అధిపతి. దీంతో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో, ఎక్కువ తెలివితేటలను కలిగి ఉంటారు. అయితే కొంత కఠిన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కుంభ రాశికి చెందిన వ్యక్తుల కెరీర్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం..

కుంభ రాశి ఫలం 2024

కుంభ రాశిలో పదకొండవ రాశి. రాశికి అధిపతి అయిన శనీశ్వరుడు ఈ రాశిలో సుమారు ఒకటిన్నర సంవత్సరాలు  ఉంటాడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరిగినా అధైర్య పడకుండా ముందుకు సాగితే విజయ శిఖరానికి చేరుకుంటారు. భవిష్యత్ విజయానికి ఇదే శిక్షణ అని భావించి పని, ఉద్యోగం, పరిశ్రమలో కష్టపడి ముందుకు కొనసాగాలి.

ఆర్ధిక లాభాలు

ఈ రాశికి చెందిన వ్యక్తులకు ధనస్థానంలో రాహువు ఉండటం వల్ల సంవత్సరం ప్రారంభంలో సామర్థ్యానికి అనుగుణంగా సంపద కలుగుతుంది. అలాగే స్వయంపాలిత స్థానమైన ఏకాదశ కుజుడు స్థానమైనందున ఏడాది మద్యలో కుటుంబం సభ్యులు సహకారం లభిస్తుంది. సకాలంలో ధన సహాయం అందుతుంది.

ఇవి కూడా చదవండి

ప్రేమ, వివాహం

ఈ రాశికి చెందిన వ్యక్తుల జాతకంలో గురుబలం లేదు కనుక పెళ్లి గురించి పెద్దగా కలలు కనకూడదు. ప్రేమ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేరు. గందరగోళానికి గురవుతారు. ఎవరితో నైనా ప్రేమలో పడినా అది కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది.

కెరీర్

కుజుడు వృత్తి స్థానంలో ఉన్నందున అది అతని స్వక్షేత్రము. వ్యవసాయ దారులు, భూమి మీద వ్యాపారం చేస్తే మంచి లాభం పొందుతారు. ఇంజినీరింగ్ వృతి వంటి ఉద్యోగస్తులు ఏడాది మధ్య వరకూ అంతంతమాత్రంగా సాగుతుంది.

ఆరోగ్య స్థితి:

ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆరోగ్యం ఈ సంవత్సరంలో క్షీణించవచ్చు. అష్టమంలో కేతువు ఉండటం వల్ల మనసు తరచు కుంచించుకుపోతుంది. అంతేకాదు మానసికంగా ఇబ్బంది పడతారు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండడం మేలు.

విదేశీ ప్రయాణం:

సంవత్సరం ప్రారంభంలో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పరిశోధన రంగంలో ఉన్నవారికి విదేశాలకు వెళ్లే  అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైద్యులు కూడా ప్రత్యేక నైపుణ్యంతో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.

నివారణ చర్యలు

ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితం సుఖ సంతోషాలతో సాగాలంటే.. శనీశ్వరుడు దృష్టి శుభంగా సాగాలన్నా.. భగవంతుడి దయ అవసరం. కనుక ప్రతిరోజూ హనుమాన్ చాలీసాను పఠించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు