AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ మూడు మొక్కలు పొరపాటున కూడా ఇంటికి దక్షిణ దిశలో పెట్టకూడదు..! అలా చేస్తే భారీ మూల్యం తప్పదు..!!

ఇంట్లో మొక్కలు నాటడం చాలా మంచిది. చెట్లను నాటడం వల్ల ఇంట్లో సానుకూలతతోపాటు ప్రతికూలత తొలగిపోతుంది. మొక్కలకు సంబంధించిన కొన్ని నియమాలు వాస్తు శాస్త్రంలో పేర్కొనబడ్డాయి. నిబంధనల ప్రకారం కొన్ని మొక్కలు నాటకపోతే ఇంట్లో గొడవలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతారు. వాస్తు శాస్త్రంలో మూడు మొక్కలను దక్షిణ దిశలో నాటకూడదు. ఈ మొక్కలను దక్షిణ దిశలో నాటినట్లయితే, వారు చాలా సమస్యలను ఎదుర్కొంటారు.

ఈ మూడు మొక్కలు పొరపాటున కూడా ఇంటికి దక్షిణ దిశలో పెట్టకూడదు..! అలా చేస్తే భారీ మూల్యం తప్పదు..!!
Vastu For Money
Jyothi Gadda
|

Updated on: Dec 22, 2023 | 4:50 PM

Share

ఇల్లు, పరిసరాలను అలంకరించేందుకు వివిధ రకాల మొక్కలను నాటుతాము. అయితే మొక్కలు నాటేటప్పుడు దానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకోవాలి. అంటే మొక్కలకు సంబంధించిన వాస్తు పరిజ్ఞానం కూడా అవసరం. శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు ఇంటి ఆవరణలో నాటకూడదు.. కొన్ని మొక్కలు, వృక్షాలను ఇంటికి ఆయా దిక్కులను బట్టి నాటుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. వాటి ప్రభావం మన జీవితాలపై కూడా ఉంటుంది. అంటే, ఈ మొక్కలు మన ఇంటి వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇంట్లో ఉన్నవారు అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు వంటి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మొక్కలు నాటేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే ఈ మొక్కలను ఏ దిశలో నాటాలి అనేది ముఖ్యం. కొన్ని ముఖ్యమైన మొక్కలను వాస్తుప్రకారం తప్పుడు దిశలో నాటడం వల్ల మంచి కంటే ఎక్కువ హాని జరుగుతుంది. అలాంటి మొక్కలకు సంబంధించి వాస్తు వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..

మొక్కలకు వాస్తు చిట్కాలు:

ఇంట్లో మొక్కలు నాటడం చాలా మంచిది. చెట్లను నాటడం వల్ల ఇంట్లో సానుకూలతతోపాటు ప్రతికూలత తొలగిపోతుంది. మొక్కలకు సంబంధించిన కొన్ని నియమాలు వాస్తు శాస్త్రంలో పేర్కొనబడ్డాయి. నిబంధనల ప్రకారం కొన్ని మొక్కలు నాటకపోతే ఇంట్లో గొడవలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతారు. వాస్తు శాస్త్రంలో మూడు మొక్కలను దక్షిణ దిశలో నాటకూడదు. ఈ మొక్కలను దక్షిణ దిశలో నాటినట్లయితే, వారు చాలా సమస్యలను ఎదుర్కొంటారు.

ఇవి కూడా చదవండి

1. తులసి మొక్క :

హిందూ మతంలో తులసి మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ మొక్కను రోజూ పూజించాలని చెబుతారు. అలాగే తులసిని దక్షిణ దిశలో నాటకూడదని అంటారు.. ఇది ఆర్థిక సమస్యలకు దారి తీస్తుంది. తులసి మొక్కను ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నాటడం శుభప్రదం.

2. మనీ ప్లాంట్:

మనీ ప్లాంట్ హిందూ మతంలో కూడా శుభప్రదంగా చెప్పబడింది. చాలా ఇళ్లలో మనీ ప్లాంట్‌ ఉంటుంది. ఈ మొక్కకు సంబంధించిన వాస్తు శాస్త్ర నియమాలు పాటించకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతారు. ఈ ప్రకారం దక్షిణ దిశలో మనీ ప్లాంట్‌ను నాటకూడదు. ఇది ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది. ఈ మొక్కను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో నాటాలి.

3. అరటి మొక్క:

జ్యోతిష్య శాస్త్రంలో అరటి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. తెలిసి తెలియక కూడా ఇంటికి దక్షిణ దిక్కున ఈ మొక్కను నాటకూడదు. అరటి మొక్కను ఎప్పుడూ ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటాలి.

Note: (వాస్తు వివరాలు, రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు, వాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..