Maheshwara Maha Pyramid: కైలాసపురిలో పత్రీజీ ధ్యాన మహా యాగం ప్రారంభం.. అందరూ ఆహ్వానితులే ..
Hyderabad: బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ పుట్టినరోజు నవంబర్ 2 న ప్రారంభమైన పత్రీజీ మహారాజ్ చైతన్య దివ్య జ్యోతి రధ యాత్ర తెలుగు రాష్ట్రాల్లో 40 రోజల పాటు వేల కిలోమీటర్లు సాగి గురువారం వరంగల్ నుంచి కందుకూరు మీదుగా సాయంత్రం మేళ తాళాల మధ్య మహేశ్వర మహా పిరమిడ్ సరస్వతి ప్రాంగణంలోని పత్రీజీ శక్తి స్థల్ కు చేరుకుంది. పిరమిడ్ ప్రధాన ద్వారం వద్ద ధ్యానులు పెద్దెత్తున స్వాగతం పలికి పత్రీజీపై తమకున్న అభిమానాన్ని చాటారు.
హైదరాబాద్, డిసెంబర్ 21; పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ ఆశయాలు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని పలువురు వక్తలు అన్నారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ధ్యాన మందిరం మహేశ్వర పిరమిడ్ ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం కడ్తాల్ మండలం అన్మాస్ పల్లి గ్రామ సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ వద్ద పిరమిడ్ స్పిరిచ్యువల్ సోసైటీ మూమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 11 రోజుల (21 నుంచి 31వరకు) పాటు కొనసాగే పత్రీజీ ధ్యాన మహాయాగం వేడుకలను వేద మంత్రాల మధ్య పత్రీజీ కుమార్తెలు పరిణతి, పరిమళ పత్రీ, ది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి శాకాహార జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
ఈ సందర్బంగా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పత్రీజీ అందించిన ధ్యానం, జ్ఞానం, క్రమశిక్షణతో ప్రతీ ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. ప్రపంచ పటంలో కడ్తాల్ కు ఒక గుర్తింపు వచ్చేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. పత్రీజీ భౌతికంగా మాత్రమే దూరం అయ్యారని ఆత్మ రూపంలో అందరికీ మార్గదర్శకం చేస్తున్నారని అన్నారు. 40 రోజుల పాటు సాగిన పత్రీజీ చైతన్య యాత్ర నేడు విశ్వవ్యాప్తం అయ్యిందని అన్నారు. యాగ ఏర్పాట్లకు మూడు నెలలుగా ధ్యానులందరూ కలసికట్టుగా పని చేయడం అభినందనీయం అన్నారు. ప్రతీ రోజు ఉదయం 5 నుంచి 8 వరకు జరిగే ప్రాతః కాల ధ్యానంలో పాల్గొనాలని సూచించారు. పత్రీజీ వ్యక్తి కాదు మహా చైతన్య శక్తి అని ఆయన జీవితాన్ని ప్రతీ ధ్యాని ఆదర్శంగా తీసుకుని ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలని అన్నారు. యాగనికి ఎన్ని వేల మంది హాజరైనా భోజన, ఆశ్రయం, ఇతర వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో కడ్తాల్ మహేశ్వా మహా పిరమిడ్, పత్రీజీ శక్తి స్థల్ ను తప్పక సందర్శించాలని అన్నారు. ఈ యాగానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు, పలువురు కళాకారులు ధ్యానులు, అధ్యాత్మిక వేత్తలు హాజరయ్యారని తెలిపారు. మహిళా ధ్యాన మహాచక్రం కడ్తాల మండల కేంద్ర సమీపంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిని అనుసరించి అన్మాస్ పల్లి గ్రామానికి వెళ్లే సమీపంలో ఉందన్నారు.
పత్రీజీ శక్తి స్థల్ కు చేరుకున్న చైతన్య దివ్య జ్యోతి రధ యాత్ర…
బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ పుట్టినరోజు నవంబర్ 2 న ప్రారంభమైన పత్రీజీ మహారాజ్ చైతన్య దివ్య జ్యోతి రధ యాత్ర తెలుగు రాష్ట్రాల్లో 40 రోజల పాటు వేల కిలోమీటర్లు సాగి గురువారం వరంగల్ నుంచి కందుకూరు మీదుగా సాయంత్రం మేళ తాళాల మధ్య మహేశ్వర మహా పిరమిడ్ సరస్వతి ప్రాంగణంలోని పత్రీజీ శక్తి స్థల్ కు చేరుకుంది. పిరమిడ్ ప్రధాన ద్వారం వద్ద ధ్యానులు పెద్దెత్తున స్వాగతం పలికి పత్రీజీపై తమకున్న అభిమానాన్ని చాటారు. విద్వాన్ ఏ. చిన్నయ్య, గణేష్ శర్మ, విద్వాన్ నాగేంద్ర ప్రసాద్ సంగీత కళాకారుల బృందంతో రాత్రి సామూహిక ధ్యాన కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్.పి.టి.సి దశరథ్ నాయక్, అనుమాస్ పల్లి సర్పంచ్ శంకర్, సాంబశివరావు, పిఎంసీ దాట్ల హన్మంతరాజు, మేనేజంగ్ ట్రస్టి బాలకృష్ణ, దామోదర్ రెడ్డి, మాధవి, మారం శివ ప్రసాద్, రాయ జగపతి రాజు, జక్కా రాఘవ రావు, జున్నుతుల కిషన్ రెడ్డి, పిఎంసి డైరెక్టర్ నవకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..