BMP Battle Tanks: సంగారెడ్డిలో బీఎంపీ యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్.. ఆసక్తిగా వీక్షించిన స్థానికులు
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పెద్ద చెరువులో గురువారం బీఎంపీ యుద్ధ ట్యాంకర్లను ట్రయల్ రన్ విజయవంతం అయింది. కంది మండలం ఎద్దుమైలారం లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో ఈ యుద్ధ ట్యాంకర్లను మల్కాపూర్ పెద్ద చెరువులో ట్రయల్ రన్ చేశారు. ఇందులో బీఎంపీ కన్వర్షన్ వెహికల్, బీఎంపీ ఓవరాయిలింగ్ వెహికల్ లు ట్రయల్ రన్ లో పరీక్షించారు. 14 టన్నులు బరువున్నప్పటికీ..
మల్కాపూర్, డిసెంబర్ 22: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పెద్ద చెరువులో గురువారం బీఎంపీ యుద్ధ ట్యాంకర్లను ట్రయల్ రన్ విజయవంతం అయింది. కంది మండలం ఎద్దుమైలారం లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో ఈ యుద్ధ ట్యాంకర్లను మల్కాపూర్ పెద్ద చెరువులో ట్రయల్ రన్ చేశారు. ఇందులో బీఎంపీ కన్వర్షన్ వెహికల్, బీఎంపీ ఓవరాయిలింగ్ వెహికల్ లు ట్రయల్ రన్ లో పరీక్షించారు. 14 టన్నులు బరువున్నప్పటికీ నీళ్లలో తేలుతూ ఓ పడవలా ప్రయాణం చేయడం ఈ వాహనాల ప్రత్యేకత.
నీళ్లలో ఏడు నుంచి 8 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లడం, అదే విధంగా రోడ్డుపై 30 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తుందని ఓడీఎఫ్ అధికారులు చెబుతున్నారు. యుద్ధ సమయంలో సైనికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంకు తరలించడానికి ఈ వాహనాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని.. ఈ వాహనాలు రష్యా టెక్నాలజీతో తయారుచేయబడ్డాయని చెప్పారు. సైనికులకు ఇప్పటివరకు 2వేల వాహనాలకు పైగా మెదక్ ఓడీఎఫ్ నుంచి పంపినట్లు వారు తెలిపారు. ఓడీఎఫ్‌లో ఒకసారి తయారైన వాహనాలను 15 నుంచి 20 సార్లు వివిధ రకాల టెస్ట్‌లు చేసిన తర్వాతే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని నిర్వారించుకుని ఆ తర్వాత భారత మిలిటరీకి పంపడం జరుగుతుందన్నారు. యుద్ధ ట్యాంకుల ట్రయల్ రన్ చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




