UPSC Civils Interview 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూల్‌ విడుదల.. మొత్తం ఎంత మంది ఎంపికయ్యారంటే

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2023 ఇంటర్వ్యూ తేదీలు విడుదలయ్యాయి. మెయిన్స్‌కు హాజరైన అభ్యర్ధులు ఇంటర్వ్యూకి వెళ్లవల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల రోల్‌ నంబర్‌, ఇంటర్వ్యూ తేదీ, సమయం వివరాలను యూపీఎస్సీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన..

UPSC Civils Interview 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూల్‌ విడుదల.. మొత్తం ఎంత మంది ఎంపికయ్యారంటే
UPSC Civils Interview 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 20, 2023 | 12:59 PM

ఢిల్లీ, డిసెంబర్‌ 20: యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2023 ఇంటర్వ్యూ తేదీలు విడుదలయ్యాయి. మెయిన్స్‌కు హాజరైన అభ్యర్ధులు ఇంటర్వ్యూకి వెళ్లవల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల రోల్‌ నంబర్‌, ఇంటర్వ్యూ తేదీ, సమయం వివరాలను యూపీఎస్సీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఇ-సమన్‌ లెటర్లు త్వరలోనే వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు యూపీఎస్సీ తన ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 15వ తేదీ నుంచి 24వ తేదీ వ‌ర‌కు సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షల నిర్వహించగా.. ఈ పరీక్ష ఫలితాలు డిసెంబర్‌ 8న విడుదలైన విషయం తెలిసిందే. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగాలకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సివిల్స్‌ ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు, తేదీల వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

14 వేల అంగన్‌వాడీ ఖాళీల భర్తీకి చర్యలు త్వరలో నియామక ప్రక్రియ: మంత్రి సీతక్క

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ములుగులోని సఖీ కేంద్రం ఆవరణలో బాలసదనం భవన నిర్మాణానికి సోమవారం (డిసెంబర్‌ 18) ఆమె శంకుస్థాపన చేశారు. బాలసందనం భవన నిర్మాణానికి రూ.1.35 కోట్లతో మంజూరైనట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్‌ చేసి అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చాం. ములుగులోని క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం గురించి ఆటో డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆటో యూనియన్‌ సంఘాలతో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ చర్చించిన తర్వాతే హామీని ప్రకటించాం. ఆటోడ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ప్రభుత్వ అందిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.