AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కారుతో యువతి ప్రమాదకర స్టంట్స్‌.. బోల్తాకొట్టడంతో కారు కిందపడి నలిగిపోయిన ఐదుగురు

కొంతమంది బైక్‌లు, కార్లను వేగంగా నడుపుతూ ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తుంటారు. ఆ తర్వాత వాటిని రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం, అవి వైరల్‌ అవడం జరుగుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్‌ మీడియాలో మనకు దర్శనమిస్తునే ఉంటాయి. అలాంటి మరో షాకింగ్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో అమెరికాకు చెందిన ఓ యువతి కారును స్పీడ్‌గా నడిపి..

Viral Video: కారుతో యువతి ప్రమాదకర స్టంట్స్‌.. బోల్తాకొట్టడంతో కారు కిందపడి నలిగిపోయిన ఐదుగురు
Dangerous Stunt With Car
Srilakshmi C
|

Updated on: Dec 20, 2023 | 7:42 AM

Share

అమెరికా, డిసెంబర్‌ 20: కొంతమంది బైక్‌లు, కార్లను వేగంగా నడుపుతూ ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తుంటారు. ఆ తర్వాత వాటిని రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం, అవి వైరల్‌ అవడం జరుగుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్‌ మీడియాలో మనకు దర్శనమిస్తునే ఉంటాయి. అలాంటి మరో షాకింగ్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో అమెరికాకు చెందిన ఓ యువతి కారును స్పీడ్‌గా నడిపి తనతోపాటు తన స్నేహితుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టింది. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

కొలరాడో స్ప్రింగ్స్‌లోని ఓ మాల్‌ ఎదుట ఉన్న పార్కింగ్‌ ప్రాంతంలో శనివారం రాత్రి ఓ యువతి ఎస్‌యూవీ కారును ప్రమాదకరంగా నడపడంతో అది బోల్తా పడింది. ఆమె స్నేహితులు ఐదుగురు ఆ కారు డోర్లపై వేలాడుతూ ఉండగా, ఆమె కారును వేగంగా వెనక్కి తిప్పింది. ఈ క్రమంలో అది పల్టీకొట్టింది. దీంతో కారు డోర్లపై నిల్చుని వేలాడుతున్న వారు కారు కింద పడి నలిగిపోయారు. ఈ స్టంట్‌ను వీడియో తీస్తున్న వారితోపాటు చుట్టుపక్కల వారు పరుగు పరుగున వచ్చి కారు కింద పడిపోయిన వారిని రక్షించే ప్రయత్నం చేశారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ ప్రమాదంలో డ్రైవింగ్‌ చేసిన యువతికి స్వల్ప గాయాలయ్యాయి. కారు కింద పడ్డవాళ్లకి తీవ్రగాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే మాల్‌ దగ్గర ఉన్నవారు స్పందించి సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై కొలరాడో స్పింగ్స్‌ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ప్రమాదానికి కారణమైన సదరు యువతిని అరెస్టు చేశామని తెలిపారు. కారును నిర్లక్ష్యపూరితంగా డ్రైవ్‌ చేసి ప్రమాదానికి కారణం అయినందుకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో అరెస్టైన యువతి బాండ్‌ మీద బయటికి వచ్చింది. పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ
గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ
ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే..
ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే..
ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే
ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే
ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..
ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..
నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?
నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?
బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి
బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి
నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!
నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!
సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత
సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత
ఆ స్టార్ హీరో ఒక్కరినే నాగార్జున 'అన్న' అని పిలుస్తారు..
ఆ స్టార్ హీరో ఒక్కరినే నాగార్జున 'అన్న' అని పిలుస్తారు..