Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెలసరి నొప్పి తగ్గేందుకు వేసుకున్న మాత్రలు..మెదడులో రక్తం గడ్డకట్టడంతో 16ఏళ్ల బాలిక మృతి..

తీవ్రమైన కడుపు నొప్పితో అవస్థపడుతూ.. ఆమె తన స్నేహితులకు తన బాధ, లక్షణాలను వివరించింది. వారి సలహా మేరకు నవంబర్ 25 నుంచి రుతుక్రమంలో వచ్చే నొప్పులను తగ్గించే గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం ప్రారంభించింది. కానీ బహిష్టు నొప్పిని తగ్గించడానికి ఏ వైద్యుడు ఋతు మాత్ర లేదా గర్భనిరోధక మాత్రలను సూచించారు.. స్నేహితుల సూచన మేరకు సొంతంగా కొన్ని మందులు తీసుకున్నట్టుగా తెలిసింది. ఆ తరువాత, పీరియడ్స్ నొప్పి మరింత తీవ్రమైంది.

నెలసరి నొప్పి తగ్గేందుకు వేసుకున్న మాత్రలు..మెదడులో రక్తం గడ్డకట్టడంతో 16ఏళ్ల బాలిక మృతి..
16 Year Old Girl Dies
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 19, 2023 | 9:31 PM

మెదడులో రక్తం గడ్డకట్టడంతో 16 ఏళ్ల బాలిక మృతిచెందింది. నెలసరి నొప్పి తగ్గేందుకు మాత్రలు వేసుకున్న బాలిక మెదడులో రక్తం గడ్డకట్టి మరణించినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఈ విషాద సంఘటన ఇంగ్లండ్‌లో చోటు చేసుకుంది. ఇంగ్లండ్‌కు చెందిన లైలా ఖాన్ అనే 16 ఏళ్ల బాలిక రుతుసమయంలో నొప్పి తగ్గేందుకు మాత్రలు వేసుకుని మెదడులో రక్తం గడ్డకట్టడంతో విషాదకరంగా మృతి చెందింది. బహిష్టు నొప్పితో బాధపడుతున్న లైలాకు గర్భనిరోధక మాత్రలు వేసుకోవాలని ఆమె స్నేహితులు సూచించినట్లు సమాచారం. తీవ్రమైన కడుపు నొప్పితో అవస్థపడుతూ.. ఆమె తన స్నేహితులకు తన బాధ, లక్షణాలను వివరించింది. వారి సలహా మేరకు నవంబర్ 25 నుంచి రుతుక్రమంలో వచ్చే నొప్పులను తగ్గించే గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం ప్రారంభించింది. కానీ బహిష్టు నొప్పిని తగ్గించడానికి ఏ వైద్యుడు ఋతు మాత్ర లేదా గర్భనిరోధక మాత్రలను సూచించారు..

స్నేహితుల సూచన మేరకు సొంతంగా కొన్ని మందులు తీసుకున్నట్టుగా తెలిసింది. ఆ తరువాత, పీరియడ్స్ నొప్పి మరింత తీవ్రమైంది. డిసెంబరు 5 నాటికి ఆమెకు తలనొప్పి మొదలైంది. వారం చివరి నాటికి ఆమెకు వాంతులు ప్రారంభమయ్యాయి. దీన్ని అనుసరించి, లైలా తల్లి ఆన్‌లైన్‌లో వైద్యులను సంప్రదించింది. కానీ, ఎలాంటి సాయం అందలేదు.. దాంతో ఆ మరుసటి రోజు ఉదయం క్లినిక్‌కి వెళ్లింది. అయితే సోమవారం సాయంత్రం నొప్పితో కొట్టుమిట్టాడుతున్న లైలాఖాన్ ఇంట్లోని బాత్‌రూమ్‌లో స్పృహతప్పి పడిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ CT స్కాన్ చేయగా, మెదడులో రక్తం గడ్డకట్టినట్లు తేలింది. దాంతో ఆమెను మరో పెద్దాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు అత్యవసర శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 13వ తేదీ బుధవారం లైలా మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు.

స్వీయ మందుల వల్ల ప్రమాదాలు

ఇవి కూడా చదవండి

లైలా కుటుంబం ఇప్పుడు గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం వల్ల కలిగే ఈ అరుదైన సమస్య గురించి అవగాహన కల్పించడం ప్రారంభించింది. లైలా కజిన్, అలీసియా బిన్స్ మాట్లాడుతూ.. లైలా బాధాకరమైన రుతు నొప్పితో బాధపడుతోంది. స్నేహితులు చెప్పిన మాట మేరకు మాత్రలు వేసుకోవాలని నిర్ణయించుకుంది. మొదట్లో ఆమె మైగ్రేన్‌తో అవస్థపడింది. ఈ మాత్ర తీసుకున్న 10 రోజులలో వాంతులు చేసుకోవడం మొదలైందని చెప్పారు. ఆదివారం రాత్రి ఆమె తీవ్ర అనారోగ్యంతో అవస్థపడింది. ఆమెకు ప్రతి 30 నిమిషాలకు వాంతులు కావటం జరిగిందని చెప్పింది. లైలా మరణం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అంత దుంఖంలోనూ లైలా అవయవాలను దానం చేయడం ద్వారా, వారు క్రిస్మస్‌కు ముందు మరో ఐదుగురి ప్రాణాలను రక్షించడానికి నిస్వార్థంగా ముందుకు వచ్చారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..