Watch Video: వామ్మో.. ఈదురుగాలికి కొట్టుకుపోయిన విమానం..! వీడియో చూస్తే అవాక్కే..

దట్టమైన గాలి తాకిడి కారణంగా విమానం ఒరిగిపోయిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. బలమైన ఈదురుగాలి ధాటికి ర‌న్‌వేపై పార్క్ చేసిన విమానం ప‌క్కకు జ‌రిగింది. అక్కడ దాదాపు 150 కిలోమీట‌ర్ల వేగంతో గాలి వీచింది. మరోవైపు, బ‌హియా బ్లాంకా సిటీలో బ‌ల‌మైన గాలికి రోల‌ర్ స్కేటింగ్ క్రీడాప్రాంగ‌ణం కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 14 మంది గాయ‌ప‌డ్డారు.

Watch Video: వామ్మో.. ఈదురుగాలికి కొట్టుకుపోయిన విమానం..! వీడియో చూస్తే అవాక్కే..
Parked Airplane Spins
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 19, 2023 | 8:29 PM

భారీవర్షాలు కురిసినప్పుడు ఈదురు గాలులు కూడా వీస్తుంటాయి. గాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు ఒరిగిపోవడం, కూలిపోవడం వంటి ఘటనలు అనేకం చూస్తుంటాం. కానీ, గాలివాన బీభత్సానికి విమానం ఒరిగిపోయిందంటే.. నమ్ముతారా..? కానీ, ఇది నిజం… దట్టమైన గాలి తాకిడి కారణంగా విమానం ఒరిగిపోయిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. బలమైన ఈదురుగాలి ధాటికి ర‌న్‌వేపై పార్క్ చేసిన ఏరోప్లేన్ ప‌క్కకు జ‌రిగింది. అక్కడ దాదాపు 150 కిలోమీట‌ర్ల వేగంతో గాలి వీచింది. అర్జెంటీనా విమానాశ్రయంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అర్జెంటీనాలో భీక‌ర గాలివాన ప్రజల్ని బెంబేలెత్తించింది. బ్యూన‌స్ ఏరిస్ స‌మీపంలోని ఏరోపార్క్ జార్జ్ న్యూబెరీ విమానాశ్రయం పార్కింగ్‌లో ఉన్న ఓ ప్రైవేటు విమానం ఆ గాలి ధాటికి ప‌క్కకు క‌దిలింది. ర‌న్‌వేపై నిలిచిన ఆ విమానం.. జోరుగా వీస్తున్న గాలి ప్రభావానికి.. స్పిన్ అయ్యింది. అదే ర‌న్‌వేపై ఉన్న బోర్డింగ్ స్టెప్స్ కూడా ప‌క్కకు ఒరిగాయి. గాలిదుమారం వ‌ల్ల భారీ న‌ష్టం జ‌రిగింది. 14 మంది ప్రాణాలు కోల్పోయారు.  అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఎక్కడికక్కడ విద్యుత్  సరఫరా నిలిచిపోయింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు, బ‌హియా బ్లాంకా సిటీలో బ‌ల‌మైన గాలికి రోల‌ర్ స్కేటింగ్ క్రీడాప్రాంగ‌ణం కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 14 మంది గాయ‌ప‌డ్డారు. బ‌హియా బ్లాంకా ప్రదేశాన్ని అర్జెంటీనా అధ్యక్షుడు జావియ‌ర్ మిలే సందర్శించారు. విమానం ఒరిగిపోయిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..