వామ్మో ఇదో కొత్త స్కామ్‌.. ఎయిర్‌పోర్ట్‌ పేరుతో భారీ మోసం..అధికారులే అవాక్కయ్యేలా..! ప్రజలారా జాగ్రత్త..

ప్రస్తుతం చాంగి ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు వదిలివేసిన లగేజీని తీసివేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా పేర్కొంది. ఆరు నెలలకు పైగా క్లెయిమ్ చేయని సామాను ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. చాంగి ఎయిర్‌పోర్ట్ దానిని విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద సంస్థకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఇదే అదునుగా సింగపూర్ చాంగి విమానాశ్రయం పేరుతో కొత్త స్కామ్‌కు తెరలేపారు కొందరు మోసగాళ్లు.

వామ్మో ఇదో కొత్త స్కామ్‌.. ఎయిర్‌పోర్ట్‌ పేరుతో భారీ మోసం..అధికారులే అవాక్కయ్యేలా..! ప్రజలారా జాగ్రత్త..
Changi Airport
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 19, 2023 | 7:20 PM

వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచంలో మోసగాళ్లు కూడా అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. అమాయకులను నిలువునా ముంచేస్తున్న కేటుగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల ఆటలు కట్టించేందుకు ప్రభుత్వ రక్షణ వ్యవస్థలు పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నప్పటికీ నమ్మిన వారిని ఈజీగా లూటీ చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. అలాంటిదే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సింగపూర్ చాంగీ విమానాశ్రయం పేరుతో పెద్ద కుంభకోణం జరిగింది. ఇక్కడ విశేషమేమిటంటే డిసెంబర్ 18 సాయంత్రం వరకు ఫేక్ ఫేస్‌బుక్ పోస్ట్ యాక్టివ్‌గా ఉంది.

ఎయిర్‌పోర్ట్‌లో పొరపాటున ప్రజలు వదిలిపెట్టే లగేజీని సాధారణంగా ఒక గదిలో ఉంచడం విమానాశ్రయ అధికారుల సాధారణ పద్ధతి. ఈ క్రమంలోనే చాంగి విమానాశ్రయం పేరుతో ప్రచురించబడిన ఫేస్‌బుక్ పోస్ట్‌లో 2023 కోసం చాంగి విమానాశ్రయం అమ్మకాలు ఇప్పుడు ప్రారంభమయ్యాయని పేర్కొంది. పోస్ట్‌ ప్రకారం.. ప్రస్తుతం చాంగి ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు వదిలివేసిన లగేజీని తీసివేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా పేర్కొంది. ఆరు నెలలకు పైగా క్లెయిమ్ చేయని సామాను ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. చాంగి ఎయిర్‌పోర్ట్ దానిని విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద సంస్థకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఇదే అదునుగా సింగపూర్ చాంగి విమానాశ్రయం పేరుతో కొత్త స్కామ్‌కు తెరలేపారు కొందరు మోసగాళ్లు. ఈ క్రమంలోనే విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులను పోలీసులు అప్రమత్తం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

సింగపూర్‌ చాంగి విమానాశ్రయంలో ప్రయాణికులు వదిలిపెట్టిన లగేజీలను కేవలం $4కే కొనుగోలు చేయవచ్చునని కొందరు సైబర్‌ నేరగాళ్లు సోషల్ మీడియాలో ఫేక్‌ ప్రచారం మొదలు పెట్టారు. అలా $4కి కొనుగోలు చేసిన సామానులో అనేక డాలర్ల విలువైన వస్తువులు లభించాయంటూ ఫేక్ కామెంట్స్ ప్రచారం చేశారు. దీన్ని నమ్మిన కొందరు అమాయక జనాలు..ఆ లింక్‌పై క్లిక్ చేయగానే..మరొక పేజీలోకి వెళతారు. అక్కడ వారి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వివరాలతో సహా ప్రతిదీ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే వారి బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇలాంటి సరికొత్త సైబర్‌ మోసానికి తెరలేసింది క్రైం ముఠా. ఇలాంటి తప్పుడు, ఫేక్ న్యూస్‌లను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని చాంగి ఎయిర్‌పోర్ట్ అధికారులు, సింగపూర్ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..