Lung Cancer Causes: ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రావడానికి ప్రధాన కారణం ఇదేనట.. వారిలో మరీ ఎక్కువ..

ధూమపానం చేసేవారిలోనూ, పొగతాగనివారిలోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు ఒకేలా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎల్లప్పుడూ అలసటగా అనిపించడం, తరచుగా దగ్గు, నోటి నుంచి రక్తం పడటం, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని చెబుతున్నారు. కుటుంబంలో ఎవరికైనా ఇప్పటికే ఈ సమస్య ఉంటే సమయానికి వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.

Lung Cancer Causes: ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రావడానికి ప్రధాన కారణం ఇదేనట.. వారిలో మరీ ఎక్కువ..
Non Smokers Lung Cancer
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 19, 2023 | 4:57 PM

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగుల మరణాల సంఖ్య అత్యధికంగా ఉంది. గణాంకాల ప్రకారం, ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా 2.2 మిలియన్ల మంది మరణించారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ రోజురోజుకు తీవ్ర సమస్యగా మారుతోంది. అందుకే ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయం ఇంకా వెంటాడుతోంది. చాపకింద నీరులా ప్రస్తుతం కోవిడ్‌ వ్యాప్తి పెరుగుతోంది. కరోనా రోగుల్లో ఎక్కువగా ఊపిరితిత్తులు ప్రభావితమవుతాయి. ఈ వైరస్ నేరుగా ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమేమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది సిగరెట్లు, బీడీలు, ఇతర పొగాకు రకాల వల్ల వస్తుంది. వాయు కాలుష్యం, పొగాకు కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వారిలో కూడా అంటే దీని అర్థం సిగరెట్ తాగుతున్న వారి చుట్టూ నిలబడి ఉండటం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే, వాతావరణం, ఉష్ణోగ్రతలలో మార్పులు శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి.

సిగరెట్ ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. అయితే ఇటీవలి అధ్యయనాలు ధూమపానం చేయనివారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది మీరు ఎంతసేపు పొగపీల్చారు. లేదంటే పొగాకు వాడటంపై ఆధారపడి ఉంటుంది. ధూమపానం మానేసిన వ్యక్తులకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ. లండన్‌లోని ఓ యూనివర్సిటీ చేసిన ఈ అధ్యయనం ప్రకారం, ధూమపానం చేయని వారు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారినపడుతున్నారని తేల్చింది. సిగరెట్ తాగని వారికి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని ఈ అధ్యయనం వెల్లడించింది. దీనికి స్పష్టమైన, ఏకైక కారణం కాలుష్యం. ప్రపంచవ్యాప్తంగా, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న 99 శాతం మంది ప్రమాద కారక, కలుషితమైన గాలి నాణ్యత కారణంగానే ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి

స్మోకింగ్ లేదా సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే సిగరెట్ పొగకు గురికావడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నిపుణులు చెబుతున్నారు. యునైటెడ్ స్టేట్స్లో, 10-20 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఎక్కువగా ధూమపానం చేయని వ్యక్తులలోనే కనిపించాయని స్పష్టం చేశారు. అటువంటి వ్యక్తులలో అడెనోకార్సినోమా క్యాన్సర్ అధిక సంభావ్యత కలిగి ఉన్నట్టుగా గమనించారు. ఈ రకమైన క్యాన్సర్ కణాలలో మొదలై ఊపిరితిత్తులలోని చిన్న చిన్న గాలి సంచులలోకి చేరుతుంది. కొన్నిసార్లు ఇది ఊపిరితిత్తులలోని సన్నని పొలుసుల కణాలకు కూడా వ్యాపిస్తుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పొగ త్రాగకపోయినా కొన్ని పర్యావరణ పరిస్థితులు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను పెంచుతాయి. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఒక ప్రధాన కారణం. అటువంటి పరిస్థితులలో, సెకండ్‌హ్యాండ్ పొగకు గురైన వ్యక్తులు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతారు. రాడాన్, వాయు కాలుష్యం, కుటుంబ చరిత్ర కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణం కావచ్చు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి.

ధూమపానం చేసేవారిలోనూ, పొగతాగనివారిలోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు ఒకేలా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎల్లప్పుడూ అలసటగా అనిపించడం, తరచుగా దగ్గు, నోటి నుంచి రక్తం పడటం, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని చెబుతున్నారు. కుటుంబంలో ఎవరికైనా ఇప్పటికే ఈ సమస్య ఉంటే సమయానికి వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!