Divorce Party: పెళ్లిని మించి గ్రాండ్ గా విడాకుల పార్టీ.. మళ్లీ సింగిల్‌ అవుతున్న మహిళకు ప్రశంసల వెల్లువ..

గతంలో ఒక తమిళ నటి కూడా విడాకుల ఫోటోషూట్ చేసింది. ఇది కూడా చాలా చర్చనీయాంశమైంది. తమిళ సీరియల్ నటి తన విడాకుల ఫోటోషూట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మీరు సంతోషంగా ఉండటానికి అర్హులు విడాకుల తర్వాత ఇంత ఆనందం ఉంటుందని నాకు తెలిస్తే, నేను చాలా కాలం క్రితమే విడాకులు తీసుకుని ఉండేవాడిని అంటూ వ్యాఖ్యానించారు.

Divorce Party: పెళ్లిని మించి గ్రాండ్ గా విడాకుల పార్టీ.. మళ్లీ సింగిల్‌ అవుతున్న మహిళకు ప్రశంసల వెల్లువ..
Divorce Party
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 13, 2023 | 1:22 PM

ప్రజలు ఎంతో ఆడంబరంగా, అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటారు. జీవితంలో అత్యంత ప్రధాన్యత కలిగిన రోజుగా పెళ్లికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. వారు తమ వివాహాన్ని చిరస్మరణీయంగా గుర్తిండిపోయేలా జరుపుకోవాలని కోరుకుంటారు. వివాహం తర్వాత విందులు, పార్టీల సంగతి ఇక చెప్పక్కర్లేదు. స్నేహితులు, బంధువులను పెద్ద సంఖ్యలో ఆహ్వానిస్తారు. ఎన్నో రకాల వంటకాలతో అందిరికీ విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇలా పెళ్లి వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుగుతుంది. అయితే, ఇక్కడ ఓ మహిళ పెళ్లి కోసం కాకుండా విడాకుల కోసం పార్టీ ఏర్పాటు చేసి వార్తల్లో నిలిచింది. ఈ పార్టీకి ఆ మహిళ తన స్నేహితులను, సన్నిహితులను ఆహ్వానించింది. ఈ విచిత్ర సంఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనాలో ఒక మహిళ తన వివాహాన్ని రద్దు చేసుకున్న సందర్భంగా పార్టీని ఏర్పాటు చేసింది. ఇక ఆమెను మళ్లీ ఒంటరిగా మారినందుకు అందరూ ఆమెను అభినందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

చైనాకు చెందిన సాంగ్ అనే 34 ఏళ్ల మహిళ విడాకులు తీసుకున్న తర్వాత కావాల్సిన వారందరికీ మంచి పార్టీని ఏర్పాటు చేసింది. దానికి ఆమె స్నేహితులు, బంధువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ పార్టీని గుర్తుండిపోయేలా చేయడానికి ఫోటోగ్రాఫర్లను కూడా పిలిపించింది. పార్టీ నిర్వహించిన ప్రదేశాన్ని ఎరుపు రంగులో అలంకరించారు. పార్టీకి హాజరైన ప్రజలు మహిళ మళ్లీ ఒంటరిగా ఉండబోతున్నందుకు అభినందనలు తెలిపారు.

ఈ చైనీస్ మహిళకు ఈ నాన్సెన్స్ మ్యారేజ్ ఇక్కడితో ముగిసిందని, మరోసారి ఒంటరిగా ఉన్నందుకు అభినందనలు చెబుతున్నారు పార్టీకి వచ్చిన వారంతా.. చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వీడియోను షేర్ చేస్తూ, విడాకుల తర్వాత ఇంత ఆనందం ఉంటుందని నాకు తెలిస్తే, నేను చాలా కాలం క్రితమే విడాకులు తీసుకుని ఉండేవాడిని అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఈ మహిళ విడాకులు చైనీస్ సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశమయ్యాయి. తాను ఎందుకు విడాకులు తీసుకున్నానో కూడా ఆ మహిళ చెప్పింది? మీడియా నివేదికల ప్రకారం, మహిళ తన భర్త ఫోన్‌లో ఏవో మెసేజ్‌లు చూసిందట. దాంతో అతడు ఆమెను మోసం చేస్తున్నాడని ఆమె అనుమానించింది. దీంతో ఆ మహిళ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది.

ఇవి కూడా చదవండి

భారతదేశంలోని ఒక తమిళ నటి కూడా విడాకుల ఫోటోషూట్ చేసింది. ఇది కూడా చాలా చర్చనీయాంశమైంది. తమిళ సీరియల్ నటి షాలిని విడాకుల ఫోటోషూట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మీరు సంతోషంగా ఉండటానికి అర్హులు కాబట్టి కలిసి ఉండలేని వివాహాన్ని విడిచిపెట్టడం సరైంది అని ఆమె రాసింది. మీ స్వంత జీవితాన్ని మీరు ఎంజాయ్‌ చేయండి.. మీకు మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం అవసరమైన మార్పులు చేయండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..