- Telugu News Photo Gallery Add these food items to your diabetes diet for health benefits Telugu News
Diabetes Diet : మధుమేహం బాధితులు తప్పక వీటిని తమ డైట్‌లో చేర్చుకుంటే మంచిది..!
Healthy Diet : మధుమేహం బాధితులు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతారు. ఏమాత్రం అజాగ్రత్త వహించినా సరే.. అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను వండుకోకుండా కూడా తమ రోజూ వారి భోజనంతో కలిపి తీసుకోవాలని చెబుతారు. అవి మీ ఆహారం రుచిని పెంచడంతో పాటు.. పోషక విలువలను పెంచుతాయి. వండుకునే కాకుండా నేరుగా కూడా తినగలిగిన ఆహారాలేవి.. వాటితో ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Dec 13, 2023 | 12:03 PM

Green Leafy Vegetables- విటమిన్ ఎ, సి మరియు ఇ యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే బచ్చలికూర మరియు బ్రోకలీ ఆరోగ్యానికి మంచిది.ఈ పోషకాలు మన రోగనిరోధక వ్యవస్థ యొక్క ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి.

Paneer- అధిక ప్రోటీన్ కలిగిన ఫుడ్స్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో మేలు చేస్తాయి.. ఆకలిని అదుపులో ఉంచుతాయి. పనీర్ని కూడా సలాడ్స్‌లో కలిపి తీసుకోవచ్చు. ఇది మీ సలాడ్‌కి మంచి ఫ్రెష్‌నెస్ ఇస్తుంది. అయితే మీ శరీరానికి ఏ పనీర్ సరిపోతుందో.. అనేది వైద్యులు, ఆహార నిపుణుల సలహా మేరకు మాత్రమే తీసుకోవటం ఉత్తమం.

Sprouts- మొలకలు మీ శరీరానికి మంచి ప్రోటీన్ అందిస్తాయి. వాటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కరె స్థాయిలను అదుపులో ఉంచడంలో సహకరిస్తుంది. మొలకలు, బీన్స్ కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. సలాడ్స్‌లో కలిపి తీసుకుంటే పోషక విలువలు కూడా పెరుగుతాయి. పాలతో చేసిన పదార్థాలను ఇష్టపడని వారు పనీర్‌కి బదులుగా వీటిని తీసుకోవచ్చు.

Nuts - బాదం, వాల్నట్స్, పల్లీలు, నువ్వులు, గుమ్మడిగింజలు వంటి నట్స్‌ను మీ డైట్‌లో కలిపి తీసుకోవచ్చు. ఇవి పూర్తిగా శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలతో సమృద్ధిగా నిండి ఉంటాయి. కాబట్టి వీటిని సలాడ్స్‌గా లేదా సాయంత్రం స్నాక్‌గా కూడా తీసుకోవచ్చు. పైగా మీకు కాస్త క్రంచీ ఫీలింగ్‌ని ఇస్తాయి. కాబట్టి వీటిని రెగ్యూలర్‌గా మీ డైట్‌లో చేర్చుకోవచ్చు.

Olive Oil - ఆలివ్ ఆయిల్లో మొక్కల ఆధారిత కొవ్వు ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన.. మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులతో నిండి ఉంటుంది. అయితే దీనిలో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తక్కువ ప్రాసెస్ రకం కలిగి ఉంటుంది. . దీనిలో గుండెకు మేలు చేసే కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని వంటల్లో కాకుండా సలాడ్స్‌లో కలిపి తీసుకుంటే మరింత మంచిదని నిపుణులు సూచిస్తన్నారు.





























