ఎంతో రుచిగా ఉండే అయ్యప్ప స్వామి ప్రసాదం తయారీ విధానం మీ కోసం

అయ్యప్పస్వామి ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్వామివారి ప్రసాదాన్ని అరవణ పాయసం అంటారు. బియ్యం, నెయ్యి, బెల్లం కలిపి అరవణ పాయసం తయారు చేస్తారు. ఈ ప్రసాదంలో అనేక పోషక పదార్ధాలు మిలితం అయిన ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఎంతో రుచిగా ఉండే అయ్యప్ప స్వామి ప్రసాదం తయారీ విధానం మీ కోసం
Aravana Prasadam
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 19, 2023 | 2:10 PM

తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప మాలలు ధరించే భక్తుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. మాలలు ధరించడానికి వీలు కుదరని వారు సైతం కేరళలోని శబరిమల వెళ్లి ఆ హరిహర పుత్రుడ్ని దర్శించుకుని వస్తున్నారు. ఇక అయ్యప్పను దర్శించుకున్న తర్వాత అక్కడ దొరికే ప్రసాదాన్ని తీసుకునివచ్చి బంధుమిత్రులకు పంచుతారన్న విషయం తెలిసిందే. అయ్యప్ప ప్రసాదం టేస్ట్ ఎంతో విభిన్నం.. అమోఘం. తిరుపతి లడ్డూ, అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తర్వాత.. శబరిలోని  అరవణి ప్రసాదం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. బెల్లం, బియ్యం, నెయ్యి ఉపయోగించి చేసే ఈ ప్రసాదం తయారు చేస్తారు. తినడానికి టేస్టీగా ఉండటం మాత్రమే కాదు. ఈ ప్రసాదం తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని డైటీషియన్లు చెబుతున్నారు. కేరళలో పూజలు, పర్వదినం సమయాల్లో అరవణ  పాయసాన్ని తయారు చేస్తారు. అరవణ పాయసం తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం…

 కావాల్సిన పదార్ధాలు

  • ఎర్రబియ్యం           :            ఒక కప్పు 
  • నల్ల బెల్లం               :             రెండు కప్పులు
  • నెయ్యి                      :            తగినంత  
  • జీడిపప్పులు           :             2 టీ స్పూన్​ లు
  • పచ్చి కొబ్బరి ముక్కలు  :   ఒక కప్పు
  • శొంఠి పొడి              :             2 టీస్పూన్లు
  • నీళ్లు                         :             6 కప్పులు

తయారీ విధానం:

ముందుగా నల్ల బెల్లాన్ని మొత్తగా తురిమి దానిని ఒక పాత్రలో వేసుకుని కరిగించాలి. మరో పాత్రలో నెయ్యి వేసుకుని పచ్చి కొబ్బరి, జీడిపప్పులు  వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఎర్రబియ్యాన్ని అన్నంలా వండుకోవాలి. ఇలా రైస్ ఉడికించే  సమయంలోనే  కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఆపై అన్నం మెత్తగా ఉడికిన తర్వాత.. దీనిలో కరిగించుకున్న నల్ల బెల్లం పాకాన్ని వేయాలి.  తర్వాత కొంచెం  శొంఠి పొడిని కలిపి.. నెయ్యి వేసుకుని  కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడుకుతున్న సమయంలో బబుల్స్ వస్తుంటే.. స్టౌ ఆఫ్ చేసి.. దానిలో వేయించిన కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసుకోవాలి. అంతే..  కేరళ శబరిమల అరవణ పాయసం  ప్రసాదం రెడీ అవుతుంది. ఈ ప్రసాదం తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు కూడా అందుతాయి.

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ