Winter Skin Care: చర్మం పొడిబారి గరుకుగా మారిందా? రోజూ గ్లాసుడు ఈ జ్యూస్ తాగారంటే..
చలికాలం వచ్చిందంటే గొంతు సమస్యలు పెరిగి, జలుబు, దగ్గు వస్తాయి. ఇక చర్మ సమస్యలు కూడా పెరుగుతాయి. పొడి చర్మం, నిర్జీవ చర్మం శీతాకాలంలో అతిపెద్ద సమస్యల్లో ఒకటి. హెవీ మాయిశ్చరైజర్లు కూడా చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచలేవు. తరచూ క్రీమ్‌లను అప్లై చేయడం వల్ల చర్మం ముదురు రంగులో కనిపిస్తుంది. చలికాలంలో చర్మం తాజాగా ఉండాలంటే డైట్‌పై దృష్టి పెట్టాలి. సమతుల్య ఆహారం చర్మం తగినంత పోషకాలను పొందడానికి సహాయపడుతుంది. ఇది చర్మానికి సహజమైన కాంతిని..
Updated on: Dec 19, 2023 | 12:07 PM

చలికాలం వచ్చిందంటే గొంతు సమస్యలు పెరిగి, జలుబు, దగ్గు వస్తాయి. ఇక చర్మ సమస్యలు కూడా పెరుగుతాయి. పొడి చర్మం, నిర్జీవ చర్మం శీతాకాలంలో అతిపెద్ద సమస్యల్లో ఒకటి. హెవీ మాయిశ్చరైజర్లు కూడా చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచలేవు. తరచూ క్రీమ్‌లను అప్లై చేయడం వల్ల చర్మం ముదురు రంగులో కనిపిస్తుంది. చలికాలంలో చర్మం తాజాగా ఉండాలంటే డైట్‌పై దృష్టి పెట్టాలి. సమతుల్య ఆహారం చర్మం తగినంత పోషకాలను పొందడానికి సహాయపడుతుంది.

ఇది చర్మానికి సహజమైన కాంతిని ఇస్తుంది. అందుకు చలికాలంలో నీరు ఎక్కువగా తాగాలి. శరీరంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలను నీరు బయటకు పంపుతుంది. ఇది మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే తగినంత నీరు తాగడం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. శీతాకాలపు ఆహారంలో క్యారెట్‌లను చేర్చుకోవాలి. క్యారెట్‌లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, బీటా కెరోటిన్ ఇతర పోషకాలు ఉంటాయి. ఫ్రెష్ క్యారెట్ జ్యూస్ ప్రతి రోజూ తాగితే పర్ఫెక్ట్ స్కిన్ పొందుతారు.

నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చలికాలంలో ఈ పండు తింటే చర్మ సమస్యలు దిరచేరవు.

చలికాలంలో పాలకూర తినడం మర్చిపోకూడదు. పాలకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ఉంటాయి. ఈ హెర్బ్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మంపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి

దానిమ్మ విత్తనాలు తినడం వల్ల చర్మంపై యాంటీ మైక్రోబియల్ ప్రభావం ఉంటుంది. ఇది మొటిమల సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. అలాగే దానిమ్మ రసం తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు వెళ్లి చర్మం తాజాగా మారుతుంది.





























