Ulli Karam Kodi Guddu Vepudu: ఉల్లి కారం – కోడిగుడ్డు వేపుడు తయారీ విధానం.. ఇలా చేస్తే ఎందులోకైనా సూపర్ అంతే!
కోడి గుడ్డుతో ఎన్ని రకాల వంటలు చేస్తామో మనకే తెలీదు. కోడి గుడ్డతో చాలా రకాల వంటలు చేయవచ్చు. స్నాక్స్, కూరలు, ఫ్రైలు, పకోడీలు, బిర్యానీలు, ఫ్రైడ్ రైస్ లు, న్యూడిల్స్, పులావ్ లు ఇలా ఒక్కటేంటీ.. పెద్ద లిస్టే ఉంటుంది. కోడి గుడ్డుతో ఏం చేసినా రుచిగానే ఉంటాయి. వంటలు రాని వారు సైతం కోడి గుడ్డుతో వంటలను ఈజీగా చేసేయచ్చు. కోడిగుడ్డుతో చేసే వంటల్లో ఎగ్ ఉల్లి కారం కూడా ఒకటి. చాలా తక్కువ సమయంలో మలాసా దట్టించి..

కోడి గుడ్డుతో ఎన్ని రకాల వంటలు చేస్తామో మనకే తెలీదు. కోడి గుడ్డతో చాలా రకాల వంటలు చేయవచ్చు. స్నాక్స్, కూరలు, ఫ్రైలు, పకోడీలు, బిర్యానీలు, ఫ్రైడ్ రైస్ లు, న్యూడిల్స్, పులావ్ లు ఇలా ఒక్కటేంటీ.. పెద్ద లిస్టే ఉంటుంది. కోడి గుడ్డుతో ఏం చేసినా రుచిగానే ఉంటాయి. వంటలు రాని వారు సైతం కోడి గుడ్డుతో వంటలను ఈజీగా చేసేయచ్చు. కోడిగుడ్డుతో చేసే వంటల్లో ఎగ్ ఉల్లి కారం కూడా ఒకటి. చాలా తక్కువ సమయంలో మలాసా దట్టించి చేసే ఈ వంటం సూపర్ అని చెప్పొచ్చు. నోటికి కాస్త రుచిగా ఏమైనా తినాలి అనుకున్నప్పుడు ఉల్లి కారం – కోడిగుడ్డు వేపుడు ట్రై చేయండి. దీన్ని చపాతీ, పులావ్, అన్నంలోకి దేనితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ ఉల్లి కారం – కోడి గుడ్డు వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లి కారం – కోడి గుడ్డు వేపుడికి కావాల్సిన పదార్థాలు:
ఉడకబెట్టిన గుడ్లు, ఉల్లి పాయలు, పచ్చి మిర్చి, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొత్తి మీర, కరివేపాకు, నూనె, జీలకర్ర, ధనియాల పొడి, వెల్లుల్లి రెబ్బలు.
ఉల్లి కారం – కోడి గుడ్డు వేపుడు తయారీ విధానం:
ముందుగా మిక్సీ జార్ లోకి ఉల్లి పాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత కడాయి తీసుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీల కర్ర పొడి, కరివేపాకు వేయాలి. ఇవి చిటపటలాడాక.. ముందు మిక్సీ పట్టుకున్న ఉల్లి పాయ పేస్టే వేసి వేయించు కోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకూ వేయించాక.. ధనియాల పొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా కూడా వేశాక.. చిన్న మంట మీద మరి కొద్ది సేపు ఉడికించు కోవాలి.
ఇలా చిన్న మంటపై మసాలా ఉడుకుతుండగా.. ఉడకబెట్టిన కోడి గుడ్లను మధ్యలోకి ముక్కలుగా కోసి వేసుకోవాలి. వీటిని అంతా కలిసేలా కలుపుకుని మరో రెండు, మూడు నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తి మీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఉల్లి కారం – కోడి గుడ్డు వేపు సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఏవైనా స్పెషల్ డేస్ లో లేదా వీకెండ్స్ లో ఇలా చేసుకుంటే చాలా బావుంటుంది.