Hyderabad Biryani: హైదరాబాద్ బిర్యానంటే ఆ మాత్రం ఉంటది మరి.. 2023 ఏడాదిలో..
బిర్యానీ అంటే భోజన ప్రియులకు ఎంత ఇష్టమో తాజాగా విడుదలైన ఓ నివేదిక చెబతోంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తాజాగా విడుదల చేసిన ఇయర్ ఎండ్ రౌండ్ రిపోర్ట్‌లో అత్యధికంగా బుక్ ఆర్డర్స్‌లో బిర్యానీనే అగ్ర స్థానంలో నిలిచింది. బిర్యానీ ఆర్డర్లు టాప్‌లో నిలవడం వరుసగా ఇదో ఎనిమిదోసారి కావడం విశేషం. ఈ నివేదికలో తేలిన వివరాల ప్రకారం.. 2023లో దేశంలో ప్రతీ సెకనుకు ఏకంగా 2.5 బిర్యానీ ఆర్డర్లు వచ్చిన స్విగ్గీ తెలిపింది...
హైదరాబాద్‌ను బిర్యానీని వేరు చేసి చూడలేం. హైదరాబాద్‌లో ఉంటున్న వారైనా, హైదరాబాద్‌ను చూడడానికి వచ్చిన వారైనా హైదరాబాద్ బిర్యానీని పట్టుపట్టకుండా ఉండలేరు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోని అగ్ర దేశాల్లో సైతం హైదరాబాద్ బిర్యానీ పేరుతోనే అమ్మకాలు చేపడుతారంటేనే బిర్యానీకి ఉన్న పాపులారిటీ ఎలాంటిదో చెప్పొచ్చు.
బిర్యానీ అంటే భోజన ప్రియులకు ఎంత ఇష్టమో తాజాగా విడుదలైన ఓ నివేదిక చెబతోంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తాజాగా విడుదల చేసిన ఇయర్ ఎండ్ రౌండ్ రిపోర్ట్‌లో అత్యధికంగా బుక్ ఆర్డర్స్‌లో బిర్యానీనే అగ్ర స్థానంలో నిలిచింది. బిర్యానీ ఆర్డర్లు టాప్‌లో నిలవడం వరుసగా ఇదో ఎనిమిదోసారి కావడం విశేషం. ఈ నివేదికలో తేలిన వివరాల ప్రకారం.. 2023లో దేశంలో ప్రతీ సెకనుకు ఏకంగా 2.5 బిర్యానీ ఆర్డర్లు వచ్చిన స్విగ్గీ తెలిపింది.
హైదరాబాద్‌తో పాటు చెన్నై, ఢిల్లీ నగరాల్లోనూ చికెన్ బిర్యానీకి ఆర్డర్లు ఎక్కువగా వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. బిర్యానీల కోసం రూ.10 వేలకు మించి ఆర్డర్లు చేసిన కస్టమర్లు ఈ మూడు నగరాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఇక హైదరాబాదీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్విగ్గీలో వచ్చిన ప్రతీ 6 ఆర్డర్స్‌లో ఒకటి హైదరాబాద్ నుంచే రావడం విశేషం.
ఇక హైదరాబాదీలు అయితే.. బిర్యానీ ఆర్డర్లలో తమ సత్తా చూపించారు. స్విగ్గీలో వచ్చిన ప్రతి 6 ఆర్డర్లలో ఒకటి హైదరాబాద్ నుంచే రావటం గమనార్హం. ఇక ఓ వ్యక్తి అయితే.. ఏడాది మొత్తంలో ఏకంగా 1633 బిర్యానీలు ఆర్డర్ చేశాడు. ఈ లెక్కన రోజుకు ఆ వ్యక్తి సరాసరిగా 4 బిర్యానీలను ఆర్డర్ చేశాడన్నమాట. ఇక ముంబయికి చెందిన ఓ వ్యక్తి ఈ ఏడాదిలో ఏకంగా రూ. 42.3 లక్షల విలువైన ఆర్డర్స్ చేసినట్టుగా స్విగ్గీ తెలిపింది. హౌ ఇండియా స్విగ్గీడ్-2023 పేరిట ఈ నివేదికను స్విగ్గీ విడుదల చేసింది.
ఇదిలా ఉంటే.. వీటితో పాటు ఈ ఏడాది గులాబ్ జామూన్‌ల ఆర్డర్లు కూడా ఎక్కువగా వచ్చినట్టు స్విగ్గీ తెలిపింది. 7.7 మిలియన్ల ఆర్డర్లతో అంతకు ముందు ఉన్న రసగుల్లా ఆర్డర్లను గులాబ్ జామూన్ క్రాస్ చేసింది. నవరాత్రి సమయంలో మసాలా దోశను ఎక్కువ మంది ఆర్డర్ చేసినట్లు నివేదికలో వెల్లడైంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..