Telangana: తెలంగాణ ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలం.. ఆరోగ్య శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు..

ప్రభుత్వ ఆసుపత్రులలో ఇంటెన్సివ్ చేస్తున్న హౌస్ సర్జన్లు దాదాపు 2500 మంది, పీజీలో స్పెషాలిటీ చేస్తున్నటువంటి 4000 మంది జూనియర్ డాక్టర్స్ , మరొక 2000మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ 1500 మంది సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులు ఇలా దాదాపుగా వివిధ డిపార్ట్ మెంట్లలో 8వేల మంది వరకు వైద్య విద్యార్థులకు సరైన  స్టైఫండ్ అందడం లేదని ఈ కారణం చేత ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని వైద్య విద్యార్థులు సమ్మె బట్ట పట్టారు.

Telangana: తెలంగాణ ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలం.. ఆరోగ్య శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు..
Junior Doctors Met Health Minister
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Jyothi Gadda

Updated on: Dec 19, 2023 | 3:37 PM

హైదరాబాద్, డిసెంబర్19; తెలంగాణ రాష్ట్రంలో సమ్మెబాట పట్టిన జూనియర్ డాక్టర్ల ను చర్చలకు ఆహ్వానించారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సమస్యల పైన వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  స్టైఫండ్ ను రెగ్యులర్ గా వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరిన జూనియర్ డాక్టర్ల వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రతి నెల 15 వ తేదీ వరకు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ చర్చల్లో మరో కీలక విషయం పై స్పందించారు మంత్రి దామోదర రాజనర్సింహ. పూర్తి వివరాల్లోకి వెళితే..

తమ సమస్యల పరిష్కారానికి నేటి నుండి విధులకు హాజరు కావడం లేదని సమ్మె నోటీసు ఇచ్చారు జూనియర్ డాక్టర్లు. వైద్యులకు రావలసిన  స్టైఫండ్ మూడు నెలలుగా రావడం లేదని, దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని సమ్మెకు పిలుపునిచ్చారు జూనియర్ డాక్టర్లు. గత రెండు మూడు నెలల నుంచి తమకు రావాల్సిన స్థాయిఫాన్డ్స్ సరిగా అందడం లేదని స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు వైద్యులు. దీనికి సంబంధించిన నోటీస్ డిఎంవికి అందించి మంగళవారం నుండి విధులకు హాజరు కావడం లేదని నోటీస్ ఇచ్చారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 8వేల మంది జూనియర్ డాక్టర్స్ సీనియర్ ప్రెసిడెంట్ డాక్టర్స్ సర్జన్స్ ఇలా వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వైద్యులు రేపటినుండి విధులు బహిష్కరించాలని సమ్మెకు పిలుపు నిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఇంటెన్సివ్ చేస్తున్న హౌస్ సర్జన్లు దాదాపు 2500 మంది, పీజీలో స్పెషాలిటీ చేస్తున్నటువంటి 4000 మంది జూనియర్ డాక్టర్స్ , మరొక 2000మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ 1500 మంది సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులు ఇలా దాదాపుగా వివిధ డిపార్ట్ మెంట్లలో 8వేల మంది వరకు వైద్య విద్యార్థులకు సరైన  స్టైఫండ్ అందడం లేదని ఈ కారణం చేత ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని వైద్య విద్యార్థులు సమ్మె బట్ట పట్టారు. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులాగా తమకు స్టఫ్ అండ్ రెగ్యులర్ గా అందే  విధంగా రెగ్యులరైజ్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.

అయితే, సమ్మె అంశం పై వైద్య అధికారులు సోమవారం సాయంత్రం జూడాల తో మాట్లాడి మంగళవారం ఉదయం మంత్రి తో సమావేశానికి అవకాశం కల్పించారు. ఈ సమావేశం లో జూడాల ప్రధాన సమస్య అయిన  స్టైఫండ్ ను ప్రతి నెల 15వ తేదీ వరకు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు మంత్రి. దీంతో పాటు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి పెండింగ్ అంశం పై కూడా రెస్పాండ్ అయ్యారు మంత్రి. హెరిటేజ్ బిల్డింగ్ నీ కదిలించ కుండా వచ్చే రెండు నెలలో ఉస్మానియా ఆసుపత్రి కొత్త బిల్డింగ్ కి శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి. దీనిపై కేవలం వైద్య విద్యార్థులు మాత్రమే కాదు.. యావత్ తెలంగాణ ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాల నిర్మాణం పనులను వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని,  అతి తక్కువ సమయంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చూడాలని కోరుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!