Telangana Prajavani: ప్రజావాణి కార్యక్రమానికి భారీగా తరలివస్తున్న జనం.. వాటిపైనే ఎక్కువగా వినతులు

Telangana Prajavani: ప్రజావాణి కార్యక్రమానికి భారీగా తరలివస్తున్న జనం.. వాటిపైనే ఎక్కువగా వినతులు

Janardhan Veluru

|

Updated on: Dec 19, 2023 | 3:51 PM

తెలంగాణ కొత్త ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రజావాణి. ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనేక జిల్లాల నుంచి ప్రజా భవన్‌కు వచ్చిన జనం.. తమ సమస్యలపై ప్రభుత్వానికి వినతులు సమర్పించారు.

తెలంగాణ కొత్త ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రజావాణి. ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనేక జిల్లాల నుంచి ప్రజా భవన్‌కు వచ్చిన జనం.. తమ సమస్యలపై ప్రభుత్వానికి వినతులు సమర్పించారు. ప్రజావాణిలో తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చిన వారితో ప్రజాభవన్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఈ రోజు జరిగిన కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు.

ఎక్కువ సమస్యలు వీటి గురించే..

ప్రజావాణిలో ధరణి సమస్యలు, పెన్షన్, డబుల్ బెడ్ రూం సమస్యలపైనే ప్రజల నుంచి ఎక్కువగా విజ్ఞప్తులు వస్తున్నాయి. గత ప్రభుత్వం తమ ఇబ్బందులను పట్టించుకోలేదని.. ఈ ప్రభుత్వమైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాము అర్హులమైనా పెన్షన్, డబుల్ బెడ్ రూం ఇవ్వడం లేదని ప్రజలు మొరబెట్టుకుంటున్నారు.

మంగళవారం (డిసెరు 19) ప్రజావాణిలో మొత్తం 5 వేలకు పైగా ప్రజల నుంచి వినతులు వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే ప్రభుత్వం పాలసీపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని.. వాటి ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. త్వరలోనే కీలక అంశాలపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. అప్పటివరకు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ప్రజలు వేచి ఉండాలని కోరారు.