Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RK Roja: వారి చర్చలు జబర్దస్త్‌ను మించిన కామెడీ.. మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు - Watch Video

RK Roja: వారి చర్చలు జబర్దస్త్‌ను మించిన కామెడీ.. మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు – Watch Video

Janardhan Veluru

|

Updated on: Dec 18, 2023 | 6:18 PM

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ ఇంకా సీట్ల సర్దుబాటు చర్చల్లోనే ఉన్నారని ఏపీ మంత్రి రోజా అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో తయారీకే వాళ్లకు సమయం లేదన్నారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలో తెలియక వారు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అలాంటి వాళ్లు వైసీపీ సీట్లకు సంబంధించి తమ మీడియాలో కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ మధ్య చర్చలు జబర్దస్త్‌ను మించిన కామెడీలా ఉందన్నారు. 

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ ఇంకా సీట్ల సర్దుబాటు చర్చల్లోనే ఉన్నారని ఏపీ మంత్రి రోజా అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో తయారీకే వాళ్లకు సమయం లేదన్నారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలో తెలియక వారు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అలాంటి వాళ్లు వైసీపీ సీట్లకు సంబంధించి తమ మీడియాలో కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ మధ్య చర్చలు జబర్దస్త్‌ను మించిన కామెడీలా ఉందన్నారు.  ప్రజలకు మంచి చేసే వారు ఎన్నికల్లో గెలవడం ఖాయమన్నారు. ప్రజల మన్ననలు ఉన్న వారికి సీట్లు అవంతట అవే వస్తాయని వ్యాఖ్యానించారు. ఒకటికి రెండుసార్లు చర్చించిన తర్వాతే సీఎం జగన్ సీట్ల సర్దుబాటు చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమని మంత్రి రోజా అన్నారు. ఏపీలో అభివృద్ధిని చూసి ఓర్వలేక కడుపు మంటతో వైసీపీ పాలనపై కొన్ని మీడియా వర్గాలు విషం చిప్పుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.