వల విసిరితే చేప చిక్కాల్సిందే.. సాంకేతిక పరిజ్ఞానంతో ఫిష్ ట్రాప్ చేస్తున్న మత్స్యకారులు..

ఎకో సౌండ్ సిస్టం, ఫిష్ ఫైండర్, జిపిఎస్ వంటి లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన పరికరాలు అందించేందుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తుంది. ఈ సిస్టం ద్వారా సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు నిరాశతో వెనుతిరిగే పరిస్థితి ఉండదని, ఖచ్చితంగా మత్స్య సంపదతో ఆనందంగా ఇంటికి చేరుకుంటాడని చెప్తున్నారు అధికారులు. వాటి కదలికలను కెమెరాల ద్వారా గమనించిన మత్స్యకారుడు వాటి పై వల విసిరి ఒడిసి పట్టుకుంటారు. ఇలా టెక్నాలజీ మత్స్యకారులకు సిరులు కురిపిస్తుంది.

వల విసిరితే చేప చిక్కాల్సిందే.. సాంకేతిక పరిజ్ఞానంతో ఫిష్ ట్రాప్ చేస్తున్న మత్స్యకారులు..
Fishermen, trapping fish, newer technology,Vizianagaram, Fish trapping techniques, Fish trapping techniques, Best fish trapping techniques, types of fish traps, how to make a fish trap for big fish, large fish trap, fish trap diagram, uses of fish trap
Follow us
G Koteswara Rao

| Edited By: Jyothi Gadda

Updated on: Dec 19, 2023 | 7:37 PM

విజయనగరం, డిసెంబర్; చేపల వేటే జీవనాధారంగా బ్రతుకుబండి లాగుతున్న మత్స్యకారులకు ఇప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వరంగా మారింది. మత్స్యకారులు నిత్యం సముద్రంలోకి వెళ్లి పెద్ద పెద్ద వలల సహాయంతో సముద్ర లోతుల్లోకి వెళ్లి మరీ వేట సాగిస్తుంటారు. ప్రాణాలు సైతం పణంగా పెట్టి సముద్రంలో సుదూర ప్రాంతాలకు వెళ్లి వేట సాగించినా చేపలు వలలకు చిక్కక నిరాశగా వెనుదిరుగుతుంటారు మత్స్యకారులు. రోజురోజుకు సముద్రంలో మత్స్య సంపద తగ్గుతుండటంతో మత్స్యకారులకు చేపల వేట కూడా కష్టతరంగా మారుతుంది. మత్స్యకారులు ఎదుర్కొంటున్న అలాంటి క్లిష్ట పరిస్థితుల నుండి బయట పడేందుకు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ టెక్నాలజీలో కెమెరాలు, జిపిఎస్, ఎకో సౌండ్ సిస్టం, ఫిష్ ఫైండర్ విధానాన్ని వినియోగిస్తున్నారు. ఈ టెక్నాలజీ సహాయంతో సముద్రపు గర్భంలో ఉన్న మత్స్య సంపదను ఒడిసి పట్టడం మత్స్యకారులకు సులభంగా మారుతుంది. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో మొత్తం 574 ఇంజన్ బోటులు, 254 సంప్రదాయ బోట్లు వేటకు వెళ్తుంటాయి. ఈ బోట్లను వినియోగించి సుమారు 3,900 మంది మత్స్యకారులు వేటను సాగిస్తుంటారు. అంతేకాకుండా వీరి పై పరోక్షంగా 16 వేల మంది ఆధారపడి జీవనం సాగిస్తుంటారు.

చేపలను ట్రాప్ చేసే టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?..

మత్స్యకారులు తమ ఇంజిన్ బోట్లకు జిపిఎస్, ఎకో సౌండ్ సిస్టం, ఫిష్ ఫైండర్ విధానాన్ని ఉపయోగించి చేపల వేట సాగించేలా సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ముందుగా బోటు కింద వైపు కెమెరాలు అమర్చి, దానిని బోటులో ఉన్న మరో కెమెరాతో అనుసంధానం చేసి దానికి ఒక స్క్రీన్ ని అమరుస్తారు. ఆ తరువాత ఆ కెమెరాలకు టెక్నాలజీని వినియోగించి బోటుతో సముద్రంలోకి వెళ్తారు. అలా పూర్తిస్థాయి టెక్నాలజీతో బోటు సముద్రంలోకి ఎంటర్ కాగానే ఎకో సౌండ్ సిస్టం మరియు ఫిష్ ఫైండర్ ని ఆన్ చేస్తారు. ఈ ఫిష్ ఫైండర్ సముద్రం లోతున ఉన్న చేపల కదలికలతో పాటు ఇతర వివరాలను గుర్తించి కెమెరా ద్వారా బోటులో ఉన్న స్క్రీన్ కు అందిస్తుంది. ఆ స్క్రీన్ ను మత్స్యకారులు గమనిస్తూ వేట సాగిస్తారు. ఆ విధంగా బోటు ముందుకు వెళ్తుంటే ఎకో సౌండ్ సిస్టమ్ ద్వారా శబ్ద తరంగాలు విడుదలవుతుంటాయి. ఆ శబ్ద తరంగాలు విన్న ముందుకు వెళ్తున్న చేపల గుంపు వెంటనే వెనక్కి వస్తాయి. వాటి కదలికలను కెమెరాల ద్వారా గమనించిన మత్స్యకారుడు వాటి పై వల విసిరి ఒడిసి పట్టుకుంటారు. ఇలా టెక్నాలజీ మత్స్యకారులకు సిరులు కురిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వ చేయూత..

ఎకో సౌండ్ సిస్టం, ఫిష్ ఫైండర్, జిపిఎస్ వంటి లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన పరికరాలు అందించేందుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తుంది. ఇప్పటికే విశాఖ, కాకినాడ జిల్లాల్లో టెండర్లు పూర్తి చేసి మత్స్యకారులకు పరికరాలు అందజేయగా త్వరలో విజయనగరం జిల్లాలో కూడా టెండర్లు పిలిచి పరికరాలు అందజేయనున్నారు. ఈ సిస్టం ద్వారా సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు నిరాశతో వెనుతిరిగే పరిస్థితి ఉండదని, ఖచ్చితంగా మత్స్య సంపదతో ఆనందంగా ఇంటికి చేరుకుంటాడని చెప్తున్నారు అధికారులు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..