Elephant: ఆందోళన కలిగిస్తోన్న ఏనుగుల మరణాలు.. ఏకంగా 100కిపైగా మృత్యువాత..

ఇక ఇలా వందల సంఖ్యలో ఏనుగులు మరణించడానికి వాతావరణంలో మార్పులు, ఎల్‌నినో ప్రభావంగా చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా వాతావరణ మార్పులకు సంబంధించి అధికారులు చేస్తున్న హెచ్చరికలకు ఈ ఏనుగుల మరణాలు నిదర్శనాలని నిపుణులు చెబుతున్నారు. హ్వాంగే నేషనల్‌ పార్క్‌తో సహా దక్షిణాఫిక్రాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గడం, వేడి పెరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని ఏనుగులు మృత్యువాత...

Elephant: ఆందోళన కలిగిస్తోన్న ఏనుగుల మరణాలు.. ఏకంగా 100కిపైగా మృత్యువాత..
Elephant
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 20, 2023 | 7:48 AM

జింబాబ్వేలో ఏనుగుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వారాల వ్యవధిలోనే 100 సంఖ్యలో ఏనుగులు మృత్యువాత పడ్డాయి. జింబాబ్వేలోని అతిపెద్ద జాతీయ పార్క్‌ అయిన హ్వాంగ్‌ నేషనల్‌ పార్కులో గత కొన్ని వారాల వ్యవధిలోనే కనీసం వంద ఏనుగులు మృత్యువాతపడ్డాయి.

ఇక ఇలా వందల సంఖ్యలో ఏనుగులు మరణించడానికి వాతావరణంలో మార్పులు, ఎల్‌నినో ప్రభావంగా చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా వాతావరణ మార్పులకు సంబంధించి అధికారులు చేస్తున్న హెచ్చరికలకు ఈ ఏనుగుల మరణాలు నిదర్శనాలని నిపుణులు చెబుతున్నారు. హ్వాంగే నేషనల్‌ పార్క్‌తో సహా దక్షిణాఫిక్రాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గడం, వేడి పెరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని ఏనుగులు మృత్యువాత పడే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎల్‌నినో కారణంగా పరిస్థితులు మరింత దిగజారాయని జింబావ్వే నేషనల్‌ పార్క్‌ అండ్‌ వైల్డ్‌ లైఫ్‌ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రతినిధి టినాషే ఫరావో తెలిపారు.

మారుతోన్న ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా వన్యప్రాణులు అంతరించే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఈ పార్కులో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం ఇదేతొలిసారి కాదు, గతంలో 2019లోనూ తీవ్రమైన కరువు సంభవించింది. ఆ సమయంలో పార్కులో ఏకంగా 200కు పైగా ఏనుగులు మృత్యువాత పడ్డాయి. మళ్లీ ఇప్పుడు అవే పరిస్థితులు వస్తాయోమనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఇక పార్కులో మృత్యువాత పడ్డ ఏనుగులకు సంబంధించిన ఫొటోలు ట్విట్టర్‌లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. అంత భారీ ఖాయముండే ఏనుగులు పిట్టల్లా రాలిపోతుండడం అందరినీ కలచివేస్తోంది. ఇదిలా ఉంటే హ్వాంగే నేషనల్ పార్కులో 4500 ఏనుగులతో పాటు 100 కంటే ఎక్కువ ఇతర క్షీరద జాతులు, 400కిపైగా పక్షి జాతులు ఉన్నాయి. ఇక ఏనుగులను రక్షించాల్సిన అవసరం ఎంతైన ఉందంటున్న అధికారులు.. ఏనుగులను కాపాడడం కేవలం ఏనుగుల కోసమే కాదని, ఏనుగుల పేడలోని విత్తనాల ద్వారా వృక్ష సంపదన పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..