Nizamabad Serial Murder Case: నిజామాబాద్ సీరియల్ కిల్లర్ కేసులో మరో ట్విస్ట్.. ఏడో హత్య కూడానా?
నిజామాబాద్ సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఆస్తి కోసం పక్కా ప్లాన్ ప్రకారం ఆరుగురిని హతమార్చిన ప్రధాన నిందితుడు ప్రశాంత్ (20) పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ సిగ్నల్ ఆధారంగా నిందితున్ని కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గత నెల 28 నుంచి డిసెంబర్ 13వరకు ప్రసాద్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని ఒక్కో చోటికి తీసుకెళ్ళి హత్య చేసిన నర హంతకుడిని నేడు మీడియా ఎదుట ప్రవేశ పెట్టనున్నారు. నిజామాబాద్ కామారెడ్డి అటవీ ప్రాంతంలో..
నిజామాబాద్, డిసెంబర్ 19: నిజామాబాద్ సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఆస్తి కోసం పక్కా ప్లాన్ ప్రకారం ఆరుగురిని హతమార్చిన ప్రధాన నిందితుడు ప్రశాంత్ (20) పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ సిగ్నల్ ఆధారంగా నిందితున్ని కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గత నెల 28 నుంచి డిసెంబర్ 13వరకు ప్రసాద్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని ఒక్కో చోటికి తీసుకెళ్ళి హత్య చేసిన నర హంతకుడిని నేడు మీడియా ఎదుట ప్రవేశ పెట్టనున్నారు. నిజామాబాద్ కామారెడ్డి అటవీ ప్రాంతంలో ప్రసాద్ హత్య చేశాడు. ప్రసాద్ భార్య రమణిని బాసర గోదావరిలో తోసి హతమార్చాడు. కవల పిల్లలను బాల్కొండ సమీపంలోని సొన్ బ్రిడ్జి వద్ద నర హంతకుడు హతమార్చాడు. ప్రసాద్ చెల్లెలు స్వప్న మెదక్ జిల్లా చేగుంట వడియరం సమీపంలో కల్వర్టు వద్ద హత్య, చిన్న చెల్లెలు స్రవంతిని కామారెడ్డి జిల్లా సదా శివ నగర్ మండలం భూం పల్లి వద్ద హత్య చేసి, నిందితుడు శవాన్ని తగుల బెట్టాడు. ఈ వరుస హత్యల నేపథ్యంలో డిసెంబర్ 13న పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యాయి. ప్రసాద్ తల్లి సుశీల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆమెను కూడా నిందితుడు హత మార్చాడా? లేదా ఎక్కడైనా బందించాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
మాచారెడ్డిలో నివాసం ఉంటున్న మృతుడు ప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రసాద్‌కి ప్రశాంత్ అనే స్నేహితుడు ఉన్నాడు. ప్రసాద్ ఇంటిపై కన్నేసిన ప్రశాంత్ లోన్ అవసరం ఉందని చెప్పి ఇంటిని తన పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఎంతకూ లోన్ రాకపోవడంతో అనుమానం వచ్చిన ప్రసాద్ ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. దీంతో ప్రశాంత్ ఎలాగైనా ప్రసాద్‌ను హతమార్చాలని ప్లాన్ చేశాడు. తొలుత పని మీద ప్రసాద్‌ను బయటకు తీసుకెళ్లి హతమార్చాడు. ఆ మరుసటి రోజు ప్రసాద్ ఇంటికెళ్లి పోలీసులు ప్రసాద్‌ను అరెస్ట్ చేశారని నమ్మించి ఆయన భార్యను బయటకు తీసుకెళ్లి బాసర నదిలో తోసేశాడు. ఆ తర్వాత వరుసగా ప్రసాద్ పెద్ద చెల్లి, ఇద్దరు పిల్లలు, చిన్న చెల్లిని చంపేశాడు. ఈ వరుస హత్యల్లో ప్రశాంత్‌కు ముగ్గురు వ్యక్తులు సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుల అదుపులో ఉన్న ప్రశాంత్‌ను పోలీసులు విచారిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.