AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఈనెల 23, 24 తేదీల్లో పీపుల్స్‌ ప్లాజాలో ‘మ్యాన్‌కైండ్స్‌ పెట్‌స్టార్‌ వెట్‌ కార్నివాల్‌’ ఈవెంట్‌ నిర్వహణ

కుక్కలు, పిల్లులు, వివిధ జాతుల పక్షులను అల్లారుముద్దుగా సొంత పిల్లల్లా పెంచుకుంటూ ఉంటారు. పెంపుడు జంతువుల ఔత్సాహికులు, కుటుంబాల కోసం తెలంగాణలోని హైదరాబాద్‌లో ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్‌ జరగబోతోంది. ఈ నెల 23, 24 తేదీల్లో నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా దీనికి వేదిక కానుంది. తెలంగాణ కనైన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 'మ్యాన్‌కైండ్స్ పెట్‌ స్టార్ పెట్ కార్నివాల్' పేరుతో ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం జరిగే రెండు రోజుల పాటు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు..

Hyderabad: ఈనెల 23, 24 తేదీల్లో పీపుల్స్‌ ప్లాజాలో 'మ్యాన్‌కైండ్స్‌ పెట్‌స్టార్‌ వెట్‌ కార్నివాల్‌' ఈవెంట్‌ నిర్వహణ
Mankind's Pet Star Pet Carnival
Noor Mohammed Shaik
| Edited By: Srilakshmi C|

Updated on: Dec 19, 2023 | 8:00 AM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 19: కుక్కలు, పిల్లులు, వివిధ జాతుల పక్షులను అల్లారుముద్దుగా సొంత పిల్లల్లా పెంచుకుంటూ ఉంటారు. పెంపుడు జంతువుల ఔత్సాహికులు, కుటుంబాల కోసం తెలంగాణలోని హైదరాబాద్‌లో ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్‌ జరగబోతోంది. ఈ నెల 23, 24 తేదీల్లో నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా దీనికి వేదిక కానుంది. తెలంగాణ కనైన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘మ్యాన్‌కైండ్స్ పెట్‌ స్టార్ పెట్ కార్నివాల్’ పేరుతో ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం జరిగే రెండు రోజుల పాటు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు మీ పెంపుడు జంతువులను ఇక్కడికి తీసుకొచ్చి ఈవెంట్‌లో పాల్గొనాలని నిర్వాహకులు చెబుతున్నారు. ఈవెంట్‌ గురించి హైదరాబాద్‌ బేగంపేట్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వాహకులు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ కనైన్‌ అసోసియేషన్‌ సభ్యులు వివరాలను వెల్లడించారు.

ఈ పెంపుడు జంతువుల కార్నివాల్‌లో ప్రత్యేకంగా జంతువుల కోసం కొన్ని గేమ్స్‌ ఏర్పాటు చేశామని, యజమానులకు కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని చెప్పారు. వివిధ రకాల పెంపుడు జంతువులకు కేటగిరీల వారీగా పోటీలు పెడతామని అన్నారు. అంతేకాకుండా జంతువులను ఎలా పెంచాలన్నదానిపై కొన్ని కోర్సులు కూడా ఉంటాయని, జంతువుల సంరక్షణపై నిపుణులు సూచనలు అందించనున్నారు. అలాగే వివిధ రకాల జంతువులను కూడా ప్రదర్శనకు ఉంచనున్నారు. ఇందులో వివిధ జాతులకు చెందిన కుక్కలు, పిల్లులు, చేపలు, గుర్రాలు, విభిన్న జాతుల ఎద్దులు, దున్నపోతులతో పాటు ఇతర దేశాల రకరకాల జంతువులను కూడా ప్రదర్శనకు ఉంచుతామన్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఒంటెల డ్యాన్స్‌ ఏర్పాటు చేశారు. ఇంకా జంతువులకు నిర్వహించనున్న కాస్ట్యూమ్ పోటీలు, ఆయా జంతువుల మేధా శక్తితో పాటు చురుకుదనం,  విధేయత ప్రదర్శనలు, పెట్ అడాప్షన్ డ్రైవ్, దేశవిదేశాల పెట్ ఉత్పత్తులతో స్టాల్స్‌ అందుబాటులో ఉండనున్నాయి.

ఇళ్లలో పెంపుడు జంతువుల ఆరోగ్యం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సెషన్స్‌ కూడా జరపనున్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో నిర్వహించే ఈ పెట్ కార్నివాల్ కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా బాధ్యతాయుతమైన పెంపుడు జంతువుల సంరక్షణపై అవగాహనను పెంపొందిస్తుందని తెలంగాణ పెంపుడు జంతువుల అసోసియేషన్‌ సభ్యులు అంటున్నారు. ప్రతి ఒక్క పెట్‌ లవర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు. మరోవైపు ఈ కార్యక్రమం కోసం పెంపుడు జంతువుల యజమానులు కూడా కోటి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు తమకు అవగాహనతో పాటు తమ జంతువులకు ఉల్లాసంగా ఉంటాయని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.