Andhra Pradesh: అనారోగ్యంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన దళిత బాలిక.. కాలితో తొక్కి పరీక్షించిన నర్సు!!
కాలు నొప్పితో దళిత కుటుంబానికి చెందిన చిన్నారిని కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడున్న నర్సు చిన్నారిని చేతితో కాకుండా కాలితో తొక్కి పరీక్షించింది. ఈ దృశ్యాన్ని చూసిన బాలిక తాత ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ షాకింగ్ ఘటన డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వెలుగు చూసింది. బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనకు చెందిన నేలపాటి భాస్కరరావు అనే వ్యక్తి తన పదేళ్ల మనవరాలు..
కోనసీమ, డిసెంబర్ 18: కాలు నొప్పితో దళిత కుటుంబానికి చెందిన చిన్నారిని కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడున్న నర్సు చిన్నారిని చేతితో కాకుండా కాలితో తొక్కి పరీక్షించింది. ఈ దృశ్యాన్ని చూసిన బాలిక తాత ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ షాకింగ్ ఘటన డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వెలుగు చూసింది. బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనకు చెందిన నేలపాటి భాస్కరరావు అనే వ్యక్తి తన పదేళ్ల మనవరాలు గుత్తాల శ్రీదేవిని ఆదివారం (డిసెంబర్ 17) ఉదయం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. గత కొంతకాలంగా కాలు నొప్పితో బాధపడుతున్న చిన్నారిని అక్కడ విధుల్లో ఉన్న నర్సు మణికుమారి పరీక్షించింది.
అయితే ఆమె చేతితో కాకుండా చిన్నారి కాలును తన కాలితో తొక్కి చికిత్స ఏమీ చేయకుండానే అమలాపురం ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించింది. నర్సు తీరుకు భాస్కరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చేవారిని చిన్నచూపు చూడొద్ద, బాధ్యతగా మసలు కోవాలని హెచ్చరించారు. అధికారులకు ఫిర్యాదు చేస్తానని బాస్కరరావు చెప్పడంతో నర్సు మణికుమారి క్షమాపణ చెప్పింది. ఈ ఘటనపై అదే ఆసుపత్రిలోని డాక్టర్ లిఖితను అడగగా.. సదరు నర్సు డిప్యుటేషన్‌పై ఆసుపత్రిలో పనిచేస్తోందని అన్నారు. ఇకపై ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకుంటామని అనడంతో చిన్నారి తాత భాస్కరరావు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తిరుపతి శ్రీవేంకటేశ్వర జూలో సింహం మృతి
తిరుపతి శ్రీవేంకటేశ్వర జూలో ఆదివారం (డిసెంబర్ 17) ఓ మగ సింహం (7) మృతి చెందింది. మృతి చెందిన సింహంను జూ నిర్వహాకులు అనురాగ్ అనే పేరుతో పిలుస్తారు. జూ పార్కులో పునరావాసం పొందుతున్న సింహాలకు జన్మించిన సింహం ఇది. అనురాగ్ సింహం పుట్టినప్పటి నుంచి జూలోనే ఉంది. పుట్టుకతో జన్యుపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతోన్న అనురాగ్ సింహంను జన్మించిన నాటి నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే ఉంది. వయసుకు తగ్గ బరువు లేకపోవడం, ఎత్తు పెరగకపోవడం, కుడి కంటి చూపు కోల్పోవడం వంటి పలు అనారోగ్య సమస్యల వల్ల అనురాగ్ సింహం బాధపడుతన్నట్లు జూ క్యూరేటర్ సెల్వం తెలిపారు. అందువల్లనే దాన్ని జూలో ప్రదర్శనకు ఉంచలేదని పేర్కొన్నారు. మృతి చెందిన సింహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. దాని అంతర్గత అవయవాల్లోనూ ట్యూమర్లు కనిపించాయని వైద్యులు తెలిపారు. మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయని, అందువల్లనే సింహం మృతి చెందినట్లు తెలిపారు. కాగా సహజంగా సింహాలు 15 నుంచి 20 ఏళ్ల వరకు జీవిస్తాయని, అనారోగ్యం కారణంగా అనురాగ్ సింహం మృతి చెందిందని వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.