AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వీడెక్కడి దొంగండీ బాబు.. ఈ వైరల్‌ వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు..

సాధారణంగా ఇల్లు, దేవాలయాల్లో దొంగ తనాలు చేసే దొంగలనో , రోడ్లపై దారి దోపిడీ చేసే దొంగలను చూసి ఉంటారు. కానీ కర్నూలు జిల్లాలో మాత్రం ఓ కేటుగాడు చేసిన దొంగతనాన్ని చూస్తే షాక్ అవుతారు. సహజంగా దొంగలు డబ్బులు, బంగారు నగలను ఎత్తుకెళ్తుంటారు. కానీ ఈ దొంగ గారు మాత్రం 15 లీటర్ల వంట నూనె క్యాను ను దొంగలించాడు. దొంగతనానికి సంబంధించిన వీడియో సీ.సీ కెమెరాలో రికార్డు...

Viral Video: వీడెక్కడి దొంగండీ బాబు.. ఈ వైరల్‌ వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు..
Viral Video
J Y Nagi Reddy
| Edited By: Narender Vaitla|

Updated on: Dec 18, 2023 | 1:58 PM

Share

‘దొంగకు చెప్పే నయం’ అనే ఒక సామెత ఉంటుంది. అంటే దొంగకు చివరికి చెప్పు దొరికినా సంతోషంగా భావిస్తాడు అని అర్థం. తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఈ సామెతకు అచ్చంగా సరిపోయేలా ఉంది. ఇంతకీ ఆ దొంగ ఏం దొంగలించాడు.? అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

సాధారణంగా ఇల్లు, దేవాలయాల్లో దొంగ తనాలు చేసే దొంగలనో , రోడ్లపై దారి దోపిడీ చేసే దొంగలను చూసి ఉంటారు. కానీ కర్నూలు జిల్లాలో మాత్రం ఓ కేటుగాడు చేసిన దొంగతనాన్ని చూస్తే షాక్ అవుతారు. సహజంగా దొంగలు డబ్బులు, బంగారు నగలను ఎత్తుకెళ్తుంటారు. కానీ ఈ దొంగ గారు మాత్రం 15 లీటర్ల వంట నూనె క్యాను ను దొంగలించాడు. దొంగతనానికి సంబంధించిన వీడియో సీ.సీ కెమెరాలో రికార్డు అవ్వడంతో ఆ వీడియో చూసిన అందరూ వీడు ఎక్కడ దొంగ రా బాబు అంటూ ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దొంగలు రెచ్చిపోతున్నారు. మురువని గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి తన 15 లీటర్ల సన్ ఫ్లావర్ మంచి నూనె డబ్బా తీసుకోని బైక్ పై వెళ్తున్నాడు. ఇదే సమయంలో పట్టణంలోని గాంధీ సర్కిల్లో కూరగాయలు కోనేందుకి జన సంచారం ఉన్న ప్రదేశంలో ప్రధాన రహదారి పై తన బైక్‌ను ఆపి కూరగాయలను కొంటున్నాడు. ఇదే సమయంలో వెనకాల నుంచి ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి కృష్ణమూర్తి బైక్‌ పక్కన తన బైక్‌ను ఆపాడు.

ఆ తర్వాత ఎవరు చూడడం లేదని నిర్ణయించుకొని.. 15 లీటర్ల నూనె డబ్బాను ఎత్తుకొని వెళ్ళిపోయాడు. కృష్ణమూర్తి బైక్ స్టార్ట్ చేసే సమయంలో నూనె డబ్బు కనపడకపోయే సరికి ఒక్కసారిగా అవాక్కయ్యాడు . వెంటనే చుట్టుపక్కల గమనించగా అక్కడే ఉన్న సీసీ ఫొటోజీ లో దొంగతనం తతంగం మొత్తం రికార్డు అయ్యింది. అయితే బాధితుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇలా జనసంచారం ఎక్కువ ఉన్న ప్రదేశంలోనే దొంగతనం జరిగితే ఇంకా ఎవరు లేని ప్రదేశాల్లో ఎలా ఉంటుంది అని, పోలీసులు ఇకనైనా గట్టిగ గస్తీ నిర్వహిస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పుకొచ్చాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..