Gold Price Today: బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెద్దగా మార్పులు కనిపించలేదు. ద్రవ్యోల్భణంతో పాటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ వడ్డీరేట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల కారణంగా స్వల్ప ఊరట కలిగింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడులపై కాస్త హెచ్చుతగ్గులు కనిపించాయి. దీని ప్రభావం బంగారు ధరలపై పడింది. వెరసి బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. దీంతో...
ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు ఓ రేంజ్‌లో పెరుగుతూ పోయిన గోల్డ్ ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఆదివారం తులం బంగారంపై ఒకే రోజు రూ. 400 తగ్గగా సోమవారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది.
దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెద్దగా మార్పులు కనిపించలేదు. ద్రవ్యోల్భణంతో పాటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ వడ్డీరేట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల కారణంగా స్వల్ప ఊరట కలిగింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడులపై కాస్త హెచ్చుతగ్గులు కనిపించాయి. దీని ప్రభావం బంగారు ధరలపై పడింది. వెరసి బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. దీంతో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,300గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,510 వద్ద కొనసాగుతోంది. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,450గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,660 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,300కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,510గా ఉంది.
* చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,900కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,160 వద్ద కొనసాగుతోంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,300, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,510 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,300, 24 క్యారెట్ల బంగారం రూ. 62,510 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,300కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,510 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 57,300కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,510 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,300గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,510 వద్దకొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వెండి ధరలు కూడా బంగారం దారిలోనే పయణిస్తున్నాయి. ఆదివారం దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు సైతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీతో పాటు, ముంబయి, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 77,700గా ఉంది. ఇక చెన్నై, హైదరాబాద్, కేరళతో పాటు విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 79,700 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..