Kia Sonet 2023: కియా సోనెట్ సెన్సేషన్.. అత్యధిక భద్రతా ఫీచర్లతో రీలాంచ్.. ప్రీ బుకింగ్స్ ఓపెన్..
కొత్త కియా సోనెట్ ధరలు ఇంకా వెల్లడి కాలేదు. త్వరలో వీటిని ప్రకటించే అవకాశం ఉంది. అయితే వీటి ప్రీ బుకింగ్స్ డిసెంబర్ 20 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. ఈ సోనెట్ కారు మూడు ట్రిమ్ లలో అందుబాటులో ఉంది. అవి కియా సోనెట్ ఎక్స్-లైన్, జిటి-లైన్, టెక్-లైన్. ఈ సంవత్సరం సోనెట్‌కి అతిపెద్ద అప్‌గ్రేడ్ ఏమిటంటే.. తెలుసుకుందాం రండి..
కియా బ్రాండ్ మన దేశంలో సుస్థిర స్థానం దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్లకు బాగా డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో కియా కంపెనీ ఓ కొత్త కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త సంవత్సరంలోకి కొన్ని రోజుల్లో అడుగు పెడుతున్న క్రమంలో తన నెక్ట్స్ జెనరేషన్ సోనెట్ కాంపాక్ట్ ఎస్ యూవీని లాంచ్ చేసింది కియా కంపెనీ. ఈ కారు ముందు, వెనుక రీడిజైన్ చేశారు. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, స్లీక్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ వెనుకవైపు టైల్ ల్యాంప్ కనెక్ట్ చేసి ఇచ్చారు. అలాగే ఈ కారు కొత్త రంగుల్లో అందుబాటులోకి తెచ్చారు. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ ను డిసెంబర్ 20 నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ కియా సోనెట్ కారులో అప్ గ్రేడ్ అయిన అంశాల గురించి ఇప్పుడు చూద్దాం..
ఇంటీరియర్ ఇలా..
క్యాబిన్ పూర్తి స్థాయిలో అప్‌గ్రేడ్ అయ్యింది. 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే ఇందులో ఉంది. ఇది కొత్త సెల్టోస్ నుంచి వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను పోలి ఉండే గ్రాఫిక్‌లను కలిగి ఉంది. ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ అలాగే ఉంటుంది. ఎస్ యూవీ వెంటిలేటెడ్ సీట్లు, వాయిస్ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 7-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్, 70కి పైగా కనెక్ట్ చేయబడిన ఫీచర్లు, 360-డిగ్రీ కెమెరా, మరిన్నింటిని కూడా అందిస్తుంది. క్యాబిన్ ఇప్పుడు బ్రౌన్ ఇన్‌సర్ట్‌లతో బ్లాక్ అవుట్ థీమ్‌ను పొందుతుంది.
ఇంజిన్ సామర్థ్యాలు..
2023 సోనెట్ ఇంజిన్ ఎంపికలు అలాగే కొనసాగించారు. అవి 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపిక కూడా కొనసాగుతోంది. ఇంజిన్ ఎంపిక కోసం కియాకు 25 శాతం డిమాండ్ ఉంది, వాహన తయారీదారు ఈసారి డీజిల్‌లో మాన్యువల్ గేర్‌బాక్స్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. మాన్యువల్, ఐఎంటీ ఆటో, 6-స్పీడ్ ఆటోమేటిక్, 5-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డీసీటీతో సహా బహుళ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పు చేయలేదు. ఇటీవలి ఫ్రాస్ట్ అండ్ సుల్లివన్ అధ్యయనం ప్రకారం కియా సోనెట్ కారును బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉత్పత్తిగా పేర్కొంది. అంతేకాక సోనెట్ పునఃవిక్రయం విలువ కూడా సెగ్మెంట్ స్టాండర్డ్ కంటే 3 శాతం ఎక్కువగా ఉంది.
బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే..
కొత్త కియా సోనెట్ ధరలు ఇంకా వెల్లడి కాలేదు. త్వరలో వీటిని ప్రకటించే అవకాశం ఉంది. అయితే వీటి ప్రీ బుకింగ్స్ డిసెంబర్ 20 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. ఈ సోనెట్ కారు మూడు ట్రిమ్ లలో అందుబాటులో ఉంది. అవి కియా సోనెట్ ఎక్స్-లైన్, జిటి-లైన్, టెక్-లైన్. ఈ సంవత్సరం సోనెట్‌కి అతిపెద్ద అప్‌గ్రేడ్ ఏమిటంటే లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్‌తో సహా 10 అడాస్ భద్రతా ఫీచర్లు. ఈ కారులో మొత్తం 25 యాక్టివ్ అండ్ పాసివ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా కలిగి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..