Royal Enfield Himalayan 452: డుగ్గు, డుగ్గు బండి కొత్త లుక్ చూశారా.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
ప్రస్తుతం రాయల్ ఎన్ ఫీల్డ్ కూడా ట్రెండ్ కు అనుగుణంగా కొత్త మోడల్ బైక్ లను ఆవిష్కరిస్తోంది. అత్యాధునిక హంగులు జోడిస్తోంది. నూతన సాంకేతికను అందిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ నుంచి కొత్త బైక్ రానుంది. నవంబర్ లో దాని లాంచ్ ఉండే అవకాశం ఉంది. ఆ బైక్ పేరు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 452.
రాయల్ ఎన్‌ఫీల్డ్.. కుర్రకారు కలల బైక్. దాని బీటింగ్, సౌండ్ కే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. డుగ్గు, డుగ్గు మని అది వెళ్తూ ఉంటే ఈ ఠీవీ వేరే అని ఫీల్ అయ్యే వారు ఉంటారు. ప్రస్తుతం కంపెనీ కూడా ట్రెండ్ కు అనుగుణంగా కొత్త మోడల్ బైక్ లను ఆవిష్కరిస్తోంది. అత్యాధునిక హంగులు జోడిస్తోంది. నూతన సాంకేతికను అందిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ నుంచి కొత్త బైక్ రానుంది. నవంబర్లో దాని లాంచ్ ఉండే అవకాశం ఉంది. ఆ బైక్ పేరు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 452. అయితే దీని ఆవిష్కరణకు ముందే ఆ చెన్నైకి చెందిన కంపెనీ కొత్త హిమాలయన్ బైక్ కు సంబంధించిన చిత్రాలను కొన్నింటిని అధికారికంగా విడుదల చేసింది. సోషల్ మీడియా వేదికగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 452 సరికొత్త ఫొటోలను షేర్ చేసింది. ఇది తెల్ల రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ కొత్త హిమాలయన్ బైక్ నవంబర్ ఏడో తేదీన మార్కెట్లో గ్రాండ్ గా లాంచ్ కానుంది.
కొత్త బైక్ లో ఏం మారుతుంది..
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 452లో ప్రత్యేకంగా, కొత్తగా గుర్తించిన అంశాలు ఏమిటంటే దాని ఇంజిన్ సామర్థ్యం. కొత్త బైక్ లో 451.65సీసీ సింగిల్ సిలెండర్ ఇంజిన్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తో ఉంటుంది. దీని పవర్ అవుట్ పుట్ 8000ఆర్పీఎం వద్ద 40బీహెచ్పీ, 40ఎన్ఎం టార్క్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనిలో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది.
దీనిలో సరికొత్త వృత్తాకార డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ని తీసుకొచ్చారు. ఇది మ్యాపింగ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. అడ్వాన్స్ డ్ నావిగేషన్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. అంతేకాక దీనిలో డ్యూయల్ చానల్ ఏబీఎస్ సిస్టమ్, ఆఫ్ రోడ్ మోడ్ ఉంటుందని చెబుతున్నారు. ఈ ఆఫ్ రోడ్ మోడ్ సాయంతో వెనకాల చక్రానికి ఏబీఎస్ డియాక్టివేట్ చేసే వీలుంటుంది. రాయల్ ఎన్ ఫీల్డ్ ఈ కొత్త బైక్ లో మొత్తం ఎల్ఈడీ లైటింగ్ ను తీసుకొస్తోంది. హజార్డ్ లైట్స్, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్, అదనపు సౌకర్యంతో పాటు సేఫ్టీ కోసం దీనిని ఏర్పాటు చేశారు. అంతేకాక ఈ బైక్ టైర్లు ట్యూబ్ లెస్ గా వస్తాయని చెబుతున్నారు.
ముందు వెనుక సస్పెన్షన్ కోసం అప్ సైడ్ డౌన్ ఫోర్కులు, మోనో షాక్ అబ్జర్బర్ అమర్చారు. బ్రేకింగ్ సిస్టమ్ గురించి చూస్తే ముందు, వెనుక డిస్క్ బ్రేకులు ఉంటాయి. దీనికి అదనంగా మార్చుకునే డ్యూయల్ చానల్ ఏబీఎస్ సిస్టమ్ కూడా దీనిలో ఉంటుందని తెలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..