Train Ticket: ఇలా చేస్తే ఎంత వెయిటింగ్ లిస్ట్ ఉన్నా.. మీ రైల్వే టికెట్ పక్కాగా కన్ఫర్మ్ అవుతుంది.. వివరాలు ఇవి..

మీరు అత్యవసరంగా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. ట్రైన్ టికెట్ కోసం చూస్తే చాన్ తాడంత వెయింటింగ్ లిస్ట్ ఉంది. అటువంటి సందర్భంలో మీరు ఏం చేస్తారు. చాలా మంది తాత్కాల్ టికెట్ కోసం ప్రయత్నిస్తారు. అయితే ఇంకో ఆప్షన్ ఉందన్న విషయం చాలా మందికి తెలీదు. అదే హై ఆఫీషియల్ కోటా(హెచ్ఓ కోటా). దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Train Ticket: ఇలా చేస్తే ఎంత వెయిటింగ్ లిస్ట్ ఉన్నా.. మీ రైల్వే టికెట్ పక్కాగా కన్ఫర్మ్ అవుతుంది.. వివరాలు ఇవి..
టిక్కెట్ విక్రయాల సంఖ్య ఆధారంగా ఈ స్టేషన్లలో టిక్కెట్ కౌంటర్లు, ప్లాట్‌ఫారమ్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల వంటి కొన్ని సౌకర్యాలను రైల్వే శాఖ ఏర్పాటు చేస్తుంది.
Follow us

|

Updated on: Oct 31, 2023 | 5:00 PM

స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వరుస సెలవులు వస్తే.. ఆసమయంలో మీరు రైలు టికెట్లు పొందడం చాలా కష్టం. ఆ సమయంలో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నా వాటిల్లోనూ సీట్లు చాలా వేగంగా ఫిల్అయిపోతాయి. అందుకే రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి. అయితే మీరు అత్యవసరంగా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. ట్రైన్ టికెట్ కోసం చూస్తే చాన్ తాడంత వెయింటింగ్ లిస్ట్ ఉంది. అటువంటి సందర్భంలో మీరు ఏం చేస్తారు. చాలా మంది తాత్కాల్ టికెట్ కోసం ప్రయత్నిస్తారు. అయితే ఇంకో ఆప్షన్ ఉందన్న విషయం చాలా మందికి తెలీదు. అదే హై ఆఫీషియల్ కోటా(హెచ్ఓ కోటా). అదేంటి హెచ్ఓ కోటా అంటే రైల్వే ఉన్నత అధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులకు కదా ఇచ్చేది. సామాన్య ప్రయాణికులు కూడా దీనిని వినియోగించుకోవచ్చా? దీనికి సమాధానం అవుననే చెబుతున్నారు రైల్వే అధికారులు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ హెచ్ఓ కోటాను సామాన్య ప్రయాణికులు కూడా వాడుకోవచ్చని వివరిస్తున్నారు. అదెలాగో తెలుసుకుందాం..

హెచ్ఓ కోటా అంటే..

రైల్వే ఉన్నత అధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు ఇతర ప్రముఖులకు హెచ్ఓ కోటా/ఎమర్జెన్సీ కోటా కింద బెర్త్‌లు మంజూరు చేస్తారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో రైల్వే అభీష్టానుసారం మాత్రమే ఉంటుంది. కొన్ని నిబంధనల మేరకు ఈ టెక్కెట్ మీకు అందిస్తారు. నిర్దిష్ట కోటాలో ఉన్నవారికి సీట్లు పొందడంలో ప్రాధాన్యం ఇస్తారు. ఈ కోటాలకు యాక్సెస్ ఉన్న రైళ్లలోని వివిధ తరగతుల్లో సీనియర్ సిటిజన్లు కూడా ఉన్నారు. అయితే సాధారణ కోటాలో బుక్ అయినా లేదా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్‌లకు హెచ్ఓకోటా వర్తిస్తుంది రైలులో కొన్ని సీట్లు హెచ్ఓ కోటా కింద రిజర్వ్ అయ్యి ఉంటాయి. కాబట్టి మీరు దాని కోసం దరఖాస్తు చేస్తే, టికెట్ చాలా త్వరగా కన్ఫర్మ్ అవుతుంది.

దరఖాస్తు ఇలా..

ఈ కోటాకు అర్హత పొందాలంటే ప్రయాణికుల ప్రయాణం తప్పనిసరి. ఒక ముఖ్యమైన కారణం ఉండాలి. దీనికి మద్దతుగా వారు తప్పనిసరిగా డాక్యుమెంటేషన్‌ను అందించాలి. బయలుదేరే తేదీకి ఒక రోజు ముందు, సాధారణ ప్రయాణికులు తప్పనిసరిగా అత్యవసర కోటా (ఈక్యూ) ఫారమ్‌ను చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్‌కు సమర్పించి, అత్యవసర పరిస్థితికి సంబంధించిన అన్ని సపోర్టింగ్ డాక్యుమెంటేషన్‌తో పాటు హెచ్ఓ కోటా కోసం దరఖాస్తు చేయాలి. గెజిటెడ్ అధికారి కూడా ఈ దరఖాస్తుపై సంతకం చేయాలి. దరఖాస్తు రసీదు తర్వాత, డివిజనల్/జోనల్ కార్యాలయం దాని సమాచారాన్ని అందుకుంటుంది. ఆమోదం పొందిన తర్వాత టికెట్ నిర్ధారణ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్