Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి బంపరాఫర్.. భారీగా తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
Gold and Silver Latest Prices: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పెరుగుతు, తగ్గుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం (నవంబర్ 1) బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 500 తగ్గగా, 24 క్యారెట్ల తులం గోల్డ్‌పై రూ. 550 మేర తగ్గింది.

Gold and Silver Latest Prices: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పెరుగుతు, తగ్గుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం (నవంబర్ 1) బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 500 తగ్గగా, 24 క్యారెట్ల తులం గోల్డ్‌పై రూ. 550 మేర తగ్గింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 56,700 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,850 పలుకుతోంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండిపై సుమారు రూ. 300 మేర తగ్గింది. మరి బుధవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం రండి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
* హైదరాబాద్‌లోనూ బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. ఇక్కడ మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,850వద్ద కొనసాగుతోంది.
* ఇక విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,700 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,850 పలుకుతోంది.
* ఖమ్మం, గుంటూరు, నిజామాబాద్ ఇలా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇదే ధరలకు బంగారం లభిస్తోంది.
ఇతర నగరాల్లో
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,850గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 62,000 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,700కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,850వద్ద కొనసాగుతోంది.
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,150కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,350గా ఉంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 56,700కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,850 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,700 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,850గా ఉంది. కేరళలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. బుధవారం కిలో వెండిపై రూ. 300 మేర తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ. 75,300కి చేరింది. ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. చెన్నైలో కిలో వెండి రూ. 78,200కాగా ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 75,300 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో మంగళవారం కిలో వెండి ధర రూ. 78,200 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..