Train Ticket: రైల్వే ప్రయాణికులకు పేటీఎమ్ బంపరాఫర్.. ఇలా చేస్తే సీట్ పక్కా..
యూపీఐ పేమెంట్స్‌లో సరికొత్త ఒరవడి సృష్టించిన పేటీఎమ్ తాజాగా తమ కస్టమర్ల కోసం కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 'గ్యారంటీడ్ సీట్ అసిస్టెన్స్' అనే సేవలను తీసుకొచ్చింది. దీంతో యూజర్లు రైలు టికెట్‌ను బుక్ చేసుకునేప్పుడు కచ్చితంగా సీటును పొందొచ్చు. ప్రయాణికులకు కచ్చితంగా సీటు లభించేలా మల్టిపుల్ ట్రైన్ ఆప్షన్స్‌ను అందిస్తుంది...
రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. దూర ప్రయాణికులకు చాలా మంది రైళ్లకు మొగ్గుచూపుతారు. అయితే రైలు ప్రయాణంలో ఎదురయ్యే ప్రధాన సమస్య టికెట్ కన్ఫర్మేషన్ కాకపోవడం. చివరి క్షణాల్లో టికెట్ బుక్ చేసుకున్నా సీటు కన్ఫామ్ అవుతుందన్న నమ్మకం ఉండదని తెలిసిందే. అయితే ఇలాంటి వారి కోసమే పేటీఎమ్ పరిష్కారం తీసుకొచ్చింది.
యూపీఐ పేమెంట్స్‌లో సరికొత్త ఒరవడి సృష్టించిన పేటీఎమ్ తాజాగా తమ కస్టమర్ల కోసం కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ‘గ్యారంటీడ్ సీట్ అసిస్టెన్స్’ అనే సేవలను తీసుకొచ్చింది. దీంతో యూజర్లు రైలు టికెట్‌ను బుక్ చేసుకునేప్పుడు కచ్చితంగా సీటును పొందొచ్చు. ప్రయాణికులకు కచ్చితంగా సీటు లభించేలా మల్టిపుల్ ట్రైన్ ఆప్షన్స్‌ను అందిస్తుంది. ముఖ్యంగా రద్దీ ఎక్కువ ఉన్న సమయాల్లో ప్రయాణికులకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
సాధారణంగా పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రయాణికులకు టికెట్ లభించకపోవడం లేదా లాంగ్ వెయిట్‌లిస్ట్ ఉంటుంది. పేటీఎమ్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ సహాయంతో ఆ సమస్యకు చెక్ పెట్టొచచు. ఈ ఫీచర్ సహాయంతో సమీపంలోని అనేక బోర్డింగ్ స్టేషన్‌ల నుంచి ప్రత్యామ్నాయ రైలు బుకింగ్ ఆప్షన్స్‌ను అందిస్తుంది. దీని ద్వారా ప్రయాణికులు కన్ఫర్మ్ టికెట్‌ను పొందే అవకాశం పెరుగుతుంది.
ఇంతకీ ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే..
* ఇందుకోసం ముందుగా పేటీఎమ్ యాప్‌లోకి వెళ్లి ట్రైన్ టికెట్‌లోకి వెళ్లాలి.
* తర్వాత మీ గమ్యస్థానానికి సంబంధించిన రైళ్లను సెర్చ్ చేయాలి. దీంతో ప్రయాణికులు రైలు టికెట్ బుకింగ్ కోసం ‘అల్టర్‌నేటివ్ స్టేషన్’ ఆప్షన్స్ చూపిస్తాయి.
* ఎంచుకున్న రైల్ టికెట్ వెయిట్ లిస్ట్‌లో ఉంటేనే ఆప్షన్ కనిపిస్తుంది. సమీపంలో ప్రత్యామ్నాయ స్టేషన్స్‌ల నుంచి అందుబాటులో ఉన్న టికెట్స్ చూపిస్తాయి.
* అనంతరం మీ గమ్యస్థానం వైపు మీరు కోరుకున్న బోర్డింగ్ స్టేషన్ నుంచి మీ టిక్కెట్‌లను బుక్ చేసుకుంటే సరిపోతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..