Post Office Time Deposit Scheme: మీ డబ్బును డబుల్ చేసే స్కీమ్ ఇది.. ఒక్కసారి డిపాజిట్ చేస్తే చాలు.. పెరుగుతూనే ఉంటుంది..

పోస్ట్ ఆఫీసుల్లో అనేక పథకాలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో అధిక రాబడినిచ్చే పలు పెట్టుబడి పథకాలు కూడా ఉన్నాయి. స్మాల్ సేవింగ్స్ స్కీమ్, ఫిక్స్ డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు వంటివి ఉన్నాయి. అందులో పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ స్కీమ్(టీడీ అకౌంట్) ఒకటి. దీనిలో మీకు అధిక వడ్డీ లభిస్తుంది. దేశంలోని ప్రముఖ రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది.

Post Office Time Deposit Scheme: మీ డబ్బును డబుల్ చేసే స్కీమ్ ఇది.. ఒక్కసారి డిపాజిట్ చేస్తే చాలు.. పెరుగుతూనే ఉంటుంది..
Cash
Follow us

|

Updated on: Oct 30, 2023 | 10:48 AM

పోస్టు ఆఫీసు పథకాలంటే భద్రతకు భరోసాకు పెట్టింది పేరు. ప్రజలు ఎక్కువగా దానిని విశ్వసిస్తారు. అందుకు కారణం ప్రభుత్వ మద్దతు ఉండటమే. పోస్ట్ ఆఫీసుల్లో అనేక పథకాలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో అధిక రాబడినిచ్చే పలు పెట్టుబడి పథకాలు కూడా ఉన్నాయి. స్మాల్ సేవింగ్స్ స్కీమ్, ఫిక్స్ డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు వంటివి ఉన్నాయి. అందులో పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ స్కీమ్(టీడీ అకౌంట్) ఒకటి. దీనిలో మీకు అధిక వడ్డీ లభిస్తుంది. దేశంలోని ప్రముఖ రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇందులో మీరు ఒక ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల కాల వ్యవధుల్లో పెట్టుబడి పెట్టొచ్చు.

వడ్డీ ఎంత వస్తుందంటే..

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకం(టీడీ అకౌంట్)లో మంచి వడ్డీ రేటు లభిస్తుంది. గరిష్టంగా 5 సంవత్సరాల డిపాజిట్లపై 7.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. మీరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీరు 1-3 సంవత్సరాల కాల వ్యవధిపై టీడీ చేస్తే, మీకు 6.90 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. అదే డిపాజిట్ 5 సంవత్సరాలటెన్యూర్ పెట్టుకుంటే వడ్డీ 7.5 శాతం చొప్పున అందుతుంది.

డబ్బు రెట్టింపు కావాలంటే..

మీరు టైమ్ డిపాజిట్ స్కీమ్ (టీడీ అకౌంట్)లో డబ్బును ఐదేళ్ల కాలపరిమితితో పెట్టుబడి పెట్టినట్లయితే, మీకు 7.5 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేటుతో మీ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు. ఆ విధంగా రెట్టింపు కావడానికి దాదాపు 9 సంవత్సరాల 6 నెలలు అంటే 114 నెలల సమయం పడుతుంది.

ఇవి కూడా చదవండి

డిపాజిట్: 5 లక్షలు వడ్డీ: 7.5 శాతం మెచ్యూరిటీ కాలం: 5 సంవత్సరాలు మెచ్యూరిటీపై మొత్తం: రూ. 7,24,974 వడ్డీ ప్రయోజనం: రూ. 2,24,974

టీడీ అకౌంట్ అర్హతలు..

టైమ్ డిపాజిట్ స్కీమ్ (టీడీ అకౌంట్)లో భారతీయ సిటిజెన్ ఎవరైనా ఖాతాను తెరవవచ్చు. 18ఏళ్ల పైనున్న వారు ఖాతాలు తెరవచ్చు. అదే పదేళ్ల లోపు పిల్లల పేరు మీద వారి తల్లిదండ్రులు ఖాతాను ఓపెన్ చేయొచ్చు. అదే విధంగా ఎవరైనా ముగ్గురు వ్యక్తులు కలిసి ఉమ్మడి ఖాతాను కూడా తెరవవచ్చు.

పన్ను ప్రయోజనాలు..

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని అందిస్తుంది. ఖాతాను తెరిచేటప్పుడు నామినేషన్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. అయితే, ముందస్తు ఉపసంహరణ చేయాలనుకుంటే మాత్రం పెనాల్టీ విధిస్తారు. మీకు ఎటువంటి రిస్క్ లేకుండా పూర్తి భద్రతతో పాటు అధిక రాబడి కావాలంటే ఈ పోస్ట్ ఆఫీస్  టైం డిపాజిట్ స్కీమ్ చాలా ఉత్తమ ఎంపిక అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?
ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా
స్పిరిట్ కోసం రంగంలోకి బడా బడా స్టార్లు.! వంగా పెద్ద ప్లానే..
స్పిరిట్ కోసం రంగంలోకి బడా బడా స్టార్లు.! వంగా పెద్ద ప్లానే..
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్
లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్
విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..
విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..
అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో
అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో
సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత
సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత
ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!
ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!
పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్
పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్