Business idea: బిజినెస్‌ ప్లానింగ్‌లో ఉన్నారా.? ఈ వ్యాపారంతో భారీగా లాభాలు.

ఈ మధ్య కాలంలో స్కూళ్లు, కాలేజీల సంఖ్య భారీగా పెరుగుతోంది. చిన్న చిన్న పట్టణాల్లో కూడా కార్పొరేట్‌ స్థాయి స్కూళ్లు వెలుస్తున్నాయి. దీంతో సహజంగానే స్కూళ్లపై ఆధారపడ్డ సంస్థలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి వాటిలో స్టేషనరీ ఒకటి. స్కూళ్లు, కాలేజీలకు సమీపంలో ఉన్న స్టేషనరీలకు మంచి గిరాకీ ఉంటుంది. నోట్‌ బుక్స్‌, పెన్నిల్స్‌, పెన్స్‌తో వంటి విద్యార్థులకు అవసరమయ్యే వస్తువులకు గిరాకీ పెరుగుతోంది...

Business idea: బిజినెస్‌ ప్లానింగ్‌లో ఉన్నారా.? ఈ వ్యాపారంతో భారీగా లాభాలు.
Business Idea
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 30, 2023 | 11:25 AM

ప్రస్తుతం సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఎన్ని రోజులు ఉద్యోగం చేస్తామని చాలా మంది భావిస్తున్నారు. దీంతో సొంత వ్యాపారానికి మొగ్గు చూపుతున్నారు. చిన్నదైనా, పెద్దదైనా తమ సొంత కాళ్లపై నిలబడాలని భావిస్తున్నారు. ఇందుకోసం రకరకాల వ్యాపారాల కోసం అన్వేషిస్తున్నారు. ఇక తక్కువ పెట్టుబడితో, మంచి లాభాలు ఆర్జించే వ్యాపారాల్లో స్టేషనరి బిజినెస్‌ ఒకటి.

ఈ మధ్య కాలంలో స్కూళ్లు, కాలేజీల సంఖ్య భారీగా పెరుగుతోంది. చిన్న చిన్న పట్టణాల్లో కూడా కార్పొరేట్‌ స్థాయి స్కూళ్లు వెలుస్తున్నాయి. దీంతో సహజంగానే స్కూళ్లపై ఆధారపడ్డ సంస్థలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి వాటిలో స్టేషనరీ ఒకటి. స్కూళ్లు, కాలేజీలకు సమీపంలో ఉన్న స్టేషనరీలకు మంచి గిరాకీ ఉంటుంది. నోట్‌ బుక్స్‌, పెన్నిల్స్‌, పెన్స్‌తో వంటి విద్యార్థులకు అవసరమయ్యే వస్తువులకు గిరాకీ పెరుగుతోంది. దీంతో స్టేషనరీలకు మంచి డిమాండ్ పెరుగుతోంది.

వీటితో పాటు విద్యార్థుల ఐడీ కార్డులు, లామినేషన్లను కూడా ఈ స్టేషనరీలో విక్రయించవచ్చు. ఇలాంటి వస్తువులను స్టేషనరీలో అమ్మడం ద్వారా మంచి లాభాలను ఆర్జించవచ్చు. పట్టణాలకు సమీపంలో ఉన్న స్కూళ్లు, కాలేజీల వద్ద ఇలాంటి స్టేషనరీలను ఏర్పాటు చేసుకోవాలి. కేవలం స్టేషనరీ వస్తువులు మాత్రమే కాకుండా, వీటికి అదనంగా టీషర్ట్స్‌, క్యాప్స్‌, హ్యాండ్ బ్యాండ్‌ వంటి విద్యార్థులు ఇష్టపడే వస్తువులను సైతం కొనుగోలు చేయొచ్చు.

ఇక విద్యా సంస్థలకు సమీపంలో ఏర్పాటు చేసిన స్టేషనరీలు ఆయా విద్యా సంస్థలతో టైఅప్ కావొచ్చు. నోట్‌ బుక్స్ మొదలు పలు ప్రొడక్ట్స్‌ను బల్క్‌గా అమ్మొచ్చు. వీటిపై భారీగా లాభం ఆర్జించవచ్చు. ముఖ్యంగా పీవీసీ ఐడా కార్డులపై లాభం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ముందు.. షాప్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ కింద నమోదు చేసుకోవాలి. స్టేషనరీ ప్రారంభించాలంటే రూ. 50 నుంచి రూ. 60 వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. స్కూళ్లు, కాలేజీల దగ్గర్లో స్టేషనరీలు ఏర్పాటు చేసుకుంటే మంచి లాభాలు ఆర్జించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..