Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ నుంచి మరో భారీ సేల్‌.. దీపావళికి ఊహకందని డిస్కౌంట్స్‌.

దసరా కానుకగా ఫ్లిప్‌కార్ట్ నిర్వహించిన సేల్‌లో భాగంగా ఒక రోజే ఏకంగా 1.4 బిలియన్ల మంది యూజర్లు ఫ్లిప్‌కార్ట్ సైట్‌ను సందర్శించారు. అక్టోబర్‌ 26 నాటికి ఏకంగా 1 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ దీవాలి సేల్‌ పేరుతో మరో సేల్‌ నిర్వహిస్తోంది. నవంబర్‌ 2వ తేదీన మొదలుకానున్న ఈ సేల్‌ నవంబర్‌ 11 వరకు కొనసాగనుంది. 10 రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు...

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ నుంచి మరో భారీ సేల్‌.. దీపావళికి ఊహకందని డిస్కౌంట్స్‌.
Flipkart Big Diwali Sale
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 30, 2023 | 7:34 AM

Flipkart Big Diwali Sale: ఈ కామర్స్ సంస్థలు పండుగ సీజన్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ సేల్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది.

దసరా కానుకగా ఫ్లిప్‌కార్ట్ నిర్వహించిన సేల్‌లో భాగంగా ఒక రోజే ఏకంగా 1.4 బిలియన్ల మంది యూజర్లు ఫ్లిప్‌కార్ట్ సైట్‌ను సందర్శించారు. అక్టోబర్‌ 26 నాటికి ఏకంగా 1 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ దీవాలి సేల్‌ పేరుతో మరో సేల్‌ నిర్వహిస్తోంది. నవంబర్‌ 2వ తేదీన మొదలుకానున్న ఈ సేల్‌ నవంబర్‌ 11 వరకు కొనసాగనుంది. 10 రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు.

ఈ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనున్నారు. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. యూపీఐ ద్వారా పేమెంట్ చేసినా డిస్కౌంట్‌ అందించనున్నారు. పేటీఎం యూపీఐ, వ్యాలెట్‌ లావాదేవీలపై కూడా తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇక ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ఆప్షన్‌ ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేసే అకాశం కల్పించారు. దీనిపై నో కాస్ట్‌ ఈఎమ్‌ఐ సైతం అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్.

ఇక ఆఫర్ల విషయానికొస్తే.. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లపై ఏకంగా 45 శాతం వరకు డిస్కౌంట్‌ అందించనున్నారు. స్మార్ట్‌ ఫోన్స్‌పై 45 శాతం డిస్కౌంట్స్‌ అందిస్తుండగా, స్మార్ట్ వాచ్‌లపై ఏకంగా ర80 శాతం వరకు డిస్కౌంట్‌ అందించనున్నారు. ల్యాప్‌టాప్‌లపై 50 శాతం వరకు డిస్కౌంట్‌ అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. కోటక్‌ బ్యాంక్‌పై కూడా 10 శాతం డిస్కౌంట్‌ అందించనున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..