AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment: పెట్టిన పెట్టుబడికి కొద్ది రోజుల్లోనే డబుల్‌ ఆదాయం.. పోస్టాఫీస్‌ ఆకర్షణీయమైన స్కీమ్‌..

ఈ క్రమంలోనే పోస్టాఫీస్‌ తీసుకొచ్చిన బెస్ట్‌ స్కీమ్స్‌లో కిసాన్‌ వికాస్‌ పథకం ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా సెక్యూరిటీతో పాటు, మంచి రిటర్న్స్‌ పొందొచ్చు. ఈ పథకంప ప్రభుత్వం 7.5 శాతం వడ్డీని అందిస్తుంది. రూ. 1000తో ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. ఇక ఈ స్కీమ్‌లో పెట్టబడికి గరిష్ట పరిమితి అంటూ ఏమి లేదు. జాయింట్‌ ఖాతా కూడా ఓపెన్‌ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు...

Investment: పెట్టిన పెట్టుబడికి కొద్ది రోజుల్లోనే డబుల్‌ ఆదాయం.. పోస్టాఫీస్‌ ఆకర్షణీయమైన స్కీమ్‌..
Post Office Saving Scheme
Narender Vaitla
|

Updated on: Dec 17, 2023 | 8:20 PM

Share

సంపాదించే దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయాలని ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తుంటారు. ఆదాయాలకు అనుగుణంగా ఎంతో కొంత సేవింగ్ చేస్తుంటారు. ఇటీవలి కాలంలో ప్రజల్లో అవగాహన పెరుగుతోన్న నేపథ్యంలో రకరకాల పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన పోస్టాఫీస్‌ ఎన్నో రకాల సేవింగ్ స్కిమ్స్‌ను అందుబాటుటులోకి తీసుకొస్తోంది.

ఈ క్రమంలోనే పోస్టాఫీస్‌ తీసుకొచ్చిన బెస్ట్‌ స్కీమ్స్‌లో కిసాన్‌ వికాస్‌ పథకం ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా సెక్యూరిటీతో పాటు, మంచి రిటర్న్స్‌ పొందొచ్చు. ఈ పథకంప ప్రభుత్వం 7.5 శాతం వడ్డీని అందిస్తుంది. రూ. 1000తో ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. ఇక ఈ స్కీమ్‌లో పెట్టబడికి గరిష్ట పరిమితి అంటూ ఏమి లేదు. జాయింట్‌ ఖాతా కూడా ఓపెన్‌ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. 10 ఏళ్లు పైబడిన ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు.

ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు 9 ఏళ్ల 7 నెలలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే మొత్తం 115 నెలలపాటు డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ పీరియడ్‌ తర్వాత రూ. 10 లక్షలు పొందొచ్చు. నిజానికి తొలుత 120 నెలలుగా ఉండేది అయితే ప్రభుత్వం తాజాగా దీనిని 115 నెలలకు కుదించింది.

ఇక కిసాస్‌ పత్ర యోజన ఖాతాను స్థానికంగా ఉన్న పోస్టాఫీస్‌లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇందుకోసం అప్లికేషన్‌ ఫాన్‌ను నింపాల్సి ఉంటుంది. అనంతరం మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని చెక్‌, నగదు లేదా డిమాండ్‌ డ్రాఫ్ట్‌ రూపంలో చెల్లించవచ్చు. ఈ పొదుపు పథకంలో వడ్డీ రేటును ప్రతీ మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం సమీక్షిస్తుంది, అవసరాన్ని బట్టి మార్పులు చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!