Gold Price Today: తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులంపై ఎంతంటే..
మంగళవారం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదుల కనిపించింది. 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 పెరిగి రూ. 62,620కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 పెరిగి, రూ. 57,400 వద్ద కొనసాగుతోంది. మరి ఈ రోజు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
బంగారం ధర తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగింది. గడిచిన రెండు రోజులుగా కాస్త ఊరటనిచ్చిన గోల్డ్ రేట్స్ మంగళవారం మరోసారి షాకిచ్చాయి. మంగళవారం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదుల కనిపించింది. 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 పెరిగి రూ. 62,620కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 పెరిగి, రూ. 57,400 వద్ద కొనసాగుతోంది. మరి ఈ రోజు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,550కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,770గా ఉంది.
* చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,850గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 63,110 వద్ద కొనసాగుతోంది.
* ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,400గా ఉండగా, 24 క్యారెట్ల గోల్ఢ్ ధర రూ. 62,620 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,400గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,620గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
* హైదరాబాద్‌లో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,400కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,620 వద్ద కొనసాగుతోంది.
* ఇక విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,620 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వెండి ధరలు కూడా బంగారం బాటలోనే ప్రయణిస్తున్నాయి. మంగళవారం దేశవ్యాప్తంగా వెండి ధరలో పెరుగుదల కనిపించింది. కిలో వెండిపై ఒకే రోజు రూ. 300 పెరిగింది. దీంతో చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో అత్యధికంగా కిలో వెండి రూ. 80,000 కి చేరుకుంది. ఇక ముంబయితో పాటు ఢిల్లీ, కోల్‌కతా, పుణె, జైపూర్ వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 78,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..