Success Story: ఆ స్టార్ నటుడి కొడుకు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్.. ఈయన జర్నీ మామూలుగా లేదుగా..
ఓ ప్రముఖ ఆర్టిస్ట్ కొడుకు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించాడు. సినిమా రంగాన్ని తన కెరీర్ గా ఎంచుకోలేదు. తన టార్గెట్ వేరే పెట్టుకున్నాడు. ఏకంగా దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలో క్వాలిఫై అయ్యాడు. సినిమా యాక్టర్ కొడుకు ఇప్పుడు కలెక్టర్ అయ్యాడు. ఇంతకీ ఎవరతను చెప్పలేదు కదా.. తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.. ఈయన సక్సెస్ జర్నీ ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం.

సినిమా అంటే అదో రంగుల ప్రపంచం. ఆ రంగంలో ఉన్న వారు దానిలోనే కొనసాగడానికి ఇష్టపడతారు. తమ పిల్లలను కూడా అదే రంగంలో కొనసాగేందుకు ప్రోత్సహిస్తారు. కాస్తో కూస్తో స్టార్ డమ్ వచ్చిందంటే ఇక వారి తరతరాలు ఆ ఫీల్డ్ లో కొనసాగడానికి మొగ్గుచూపుతారు. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. అన్ని రాష్ట్రాలు, దేశాల్లోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. అయితే తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ ఆర్టిస్ట్ కొడుకు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించాడు. సినిమా రంగాన్ని తన కెరీర్ గా ఎంచుకోలేదు. తన టార్గెట్ వేరే పెట్టుకున్నాడు. ఏకంగా దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలో క్వాలిఫై అయ్యాడు. సినిమా యాక్టర్ కొడుకు ఇప్పుడు కలెక్టర్ అయ్యాడు. ఇంతకీ ఎవరతను చెప్పలేదు కదా.. ప్రముఖ తమిళ కమీడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చిన్న జయంత్ గుర్తున్నారు కదా.. ఆయన కొడుకు శృతన్‌జయ నారాయణన్. ఈయన పంథా వేరు, ఆలోచనలు వేరు. కష్టపడే తత్వం వేరు.. సాధించిన విజయం వేరు.. ఐఏఎస్ నారాయణన్ సక్సెస్ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందాం రండి..
చిన్ని జయంత్ వారసుడిగా..
శృతన్‌జయ తండ్రి చిన్ని జయంత్ తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో తన నటనతో చెరగని ముద్ర వేశారు. కమీడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సాధారణ ఆయన కొడుకంటే సినిమా ఫీల్డ్ లోనే హీరోగానో లేక మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే స్థిరపడతాడని అందరూ అంచనా వేస్తారు. చిన్ని వారసుడిగా వచ్చిన శృతన్‌జయ మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. పాఠశాల, కళాశాల రోజుల్లో నాటకాలు ప్రదర్శించినప్పటికీ, ఆయన చేరాలనుకు గమ్యం వేరు. చదువుల్లో టాపర్ గా ఉండటంతో ఆయన తల్లిదండ్రులు చదువులవపైపు ప్రోత్సహించారు. ఆ దిశగా ఆయన చేసిన ప్రయత్నం విజయవంతం అయ్యింది.
ఆల్ ఇండియా 75వ ర్యాంక్..
నారాయణన్ తన డిగ్రీని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గుండి, మాస్టర్స్ డిగ్రీని అశోకా యూనివర్సిటీ నుంచి పొందారు. అనంతరం ఓ స్టార్టప్ కంపెనీలో అధిక వేతనానికి ఉద్యోగంలో చేరాడు. నైట్ షిఫ్ట్స్ మాత్రమే ఉద్యోగం చేస్తూ ఉదయం సమయాల్లో యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధం అయ్యేవారు. రాత్రంతా పనిచేసినా.. ఉదయం వేళ కనీసం ఐదు గంటలు ఆయన యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాడు. పరీక్షలు దగ్గరకు వచ్చిన సమయంలో రోజుకు 10 గంటలు ప్రిపరేషన్ కు కేటాయించి, చివరికి 2015లో విజయం సాధించారు. ఏకంగా ఆల్ ఇండియా స్థాయిలో 75వ ర్యాంకు సాధించడం అంటే ఆయన కష్టం అందులో ఎంతుందో అర్థం అవుతుంది.
ఆయన ఇష్ట పూర్వకంగానే..
నారాయణన్ ప్రస్తుతం తమిళనాడులోని త్రిపూర్ జిల్లాలో సబ్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. తన తండ్రి సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించినా.. ఆ గ్లామర్ ఫీల్డ్ నకు ఆసక్తిని కనబరచకుండా.. తన శక్తి సామర్థ్యాలపై నమ్మకాన్ని పెట్టుకొని అనుకున్నది సాధించిన నారాయణన్ ప్రస్తుతం యువతరానికి స్ఫూర్తి. సినిమా రంగంలోకి వెళ్లకుండా సివిల్ సర్వీసెస్‌లో వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకోవడం ఆయన అసాధారణ సంకల్పానికి, తిరుగులేని నిబద్ధతకు నిదర్శనం. స్టార్ కిడ్ నుంచి ఐఏఎస్ఆ ఫీసర్ అయ్యే వరకు అతని స్ఫూర్తిదాయకమైన ప్రయాణం, కృషి, అభిరుచి, సాధిస్తాననే నమ్మకం ఆయనను విజయతీరాలకు చేర్చింది. ఇది అందరికీ ఆదర్శనీయం.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి..