Success Story: వేల రూపాయలు జీతానిచ్చే కొలువును వదిలేసి ప్రిపేరయ్యాడు.. టాప్ ప్లేస్‌లో నిలిచాడు..
సాంకేతిక విషయాలకు ఉపయోగపడేలా ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు ఎక్కువయ్యారు. కంపెనీలు కూడా ఉద్యోగుల కోసం డైరెక్ట్ కాలేజీలకు వచ్చే విద్యార్థులకు ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అవకాశం కూడా ఆ విద్యార్థులకు ఉండదు. ఈ నేపథ్యంలో కొంత మంది మాత్రం వేల రూపాయల జీతానిచ్చే ఉద్యోగాలను సైతం వదిలేసి ప్రభుత్వ కొలువును సాధిస్తున్నారు.
ప్రభుత్వ కొలువు ఇది ప్రతి యువకుడి కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు హాజరవుతూ ఉంటారు. భారతదేశంలో గత ఇరవై ఏళ్ల నుంచి పెరుగుతున్న టెక్నాలజీ మేరకు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సాంకేతిక విషయాలకు ఉపయోగపడేలా ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు ఎక్కువయ్యారు. కంపెనీలు కూడా ఉద్యోగుల కోసం డైరెక్ట్ కాలేజీలకు వచ్చే విద్యార్థులకు ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అవకాశం కూడా ఆ విద్యార్థులకు ఉండదు. ఈ నేపథ్యంలో కొంత మంది మాత్రం వేల రూపాయల జీతానిచ్చే ఉద్యోగాలను సైతం వదిలేసి ప్రభుత్వ కొలువును సాధిస్తున్నారు. ఇదే కోవలోకి అనుదీప్ దురిశెట్టి వస్తాడు. అనుదీప్ తన లక్ష్య సాధనకు ఎలా కష్టపడడ్డాడో? ఓ సారి తెలుసుకుందాం.
అనుదీప్ దురిశెట్టి 2017లో యూపీఎస్సీ చరిత్రలో అత్యధిక మార్కులు సాధించి చరిత్ర సృష్టించారు. బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత దురిశెట్టి గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. అయితే దేశానికి సేవ చేయాలని భావించి యూపీఎస్సీని ఎంచుకున్నారు. అతని మొదటి ప్రయత్నం 2012లో ప్రారంభించాడు. అతను 2013లో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, అతని ర్యాంకింగ్ అతనికి ఐఆర్‌ఎస్‌లో స్థానం సంపాదించడానికి సరిపోతుంది. దీంతో అనుదీప్ తన ప్రయత్నాలను కొనసాగించాడు. 2014, 2015లో తన ప్రయత్నాలను కొనసాగించాడు. కానీ అనుకున్న మార్కును అందుకోలేకపోయాడు. 2017లో అతను యూపీఎస్సీ పరీక్షలో మొదటి ర్యాంక్‌తో అగ్రస్థానంలో నిలవడమే కాకుండా యూపీఎస్సీ చరిత్రలో అత్యధిక మార్కులు సాధించాడు. అతను 2025లో 1126 మార్కులు సాధించాడు.
అయితే అతను లక్ష్యసాధనకు ఎలాంటి కోచింగ్ తీసుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. అనుదీప్ ఫీట్ సాధించడంలో కుటుంబ సపోర్ట్ ముఖ్య పాత్ర పోషించింది. అతను యూపీఎస్సీను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అతని కుటుంబానికి సంబంధించిన ఆర్థిక, భావోద్వేగ మద్దతు దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలో అతని స్ఫూర్తిదాయకమైన పనితీరుకు కీలకంగా మారింది.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.