Success Story: మార్కులు ప్రతిభకు, విజయానికి కొలమానం కాదు.. 10వ తరగతి మార్క్స్ షీట్ ను షేర్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్

ప్రస్తుతం మన విద్యావ్యవస్థ మొత్తం మార్కుల వెంట పరిగెడుతోంది. మార్కుల ఆధారంగానే ప్రతిభను నిర్ణయిస్తున్నారు. ఒక IAS అధికారి తన మార్క్‌షీట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. పరీక్షల్లో మార్కులు విజయానికి కొలమానం కాదని చూపించారు.

Success Story: మార్కులు ప్రతిభకు, విజయానికి కొలమానం కాదు.. 10వ తరగతి మార్క్స్ షీట్ ను షేర్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్
Ias Shahid Choudhary
Follow us
Surya Kala

|

Updated on: Jul 22, 2022 | 2:39 PM

Success Story: మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒకసారి ఇలా అన్నాడు.. ఇంటెలెక్ట్ ప్లస్ క్యారెక్టర్.. ఇదే నిజమైన విద్య లక్ష్యం. అయితే.. ఆయన చదువు కోసం చెప్పిన విధానం.. నేటి విద్యావిధానానికి సరిపోతుందా అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగులుతుంది. ప్రస్తుతం మన విద్యావ్యవస్థ మొత్తం మార్కుల వెంట పరిగెడుతోంది. మార్కుల ఆధారంగానే ప్రతిభను నిర్ణయిస్తున్నారు. నిజానికి స్కూల్ నుంచి కాలేజ్ వరకు ఎవరైనా ఏ సబ్జెక్టులో ఎంత నాలెడ్జ్ ఉందో మార్కుల గురించి ప్రస్తావిస్తారు. 90 శాతం కంటే తక్కువ సంఖ్యలు సగటుగా పరిగణించబడుతున్నాయి.

అయితే ఇటీవల ఒక IAS అధికారి తన మార్క్‌షీట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. పరీక్షల్లో మార్కులు విజయానికి కొలమానం కాదని చూపించారు. ఐఏఎస్ అధికారి షాహిద్ చౌదరి తన 10వ తరగతి మార్కుషీట్‌ను పంచుకున్నారు. మార్క్‌షీట్ చూసిన తర్వాత..  సోషల్ మీడియాలో నెటిజన్లు ఆఫీసర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మార్కులు విజయానికి కొలమానం కాదు. ఈ విషయాన్ని రుజువు చేసినందుకు మీరు గొప్ప అంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. షాహిద్ 1997లో జమ్మూ- కాశ్మీర్ నుంచి స్టేట్ బోర్డ్‌లో 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణుడయ్యాడు.

ఇవి కూడా చదవండి

మార్క్స్ షీట్:

ఐఏఎస్ అధికారి షాహిద్‌కి ఎన్ని మార్కులు వచ్చాయంటే  ట్విట్టర్‌లో మార్క్‌షీట్‌ను సోషల్ మీడియాలో షాహిద్ చౌదరి షేర్ చేసి.. ‘విద్యార్థుల డిమాండ్‌పై.. ఇదిగో నా 10వ తరగతి మార్క్‌షీట్, ఇది 1997లోది. అంటూ తెలిపారు. అంతేకాదు షాహిద్ 10వ తరగతిలో 500 మార్కులకు 339 మార్కులు తెచ్చుకున్నట్లు ఆ మర్క్స్ షీట్ ద్వారా తెలుస్తోంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, హిందీ/ఉర్దూ, సైన్స్, సోషల్ స్టడీస్‌లో సాధించిన మార్కులను చూడవచ్చు. ఇప్పటివరకు ఈ ట్వీట్‌కి 4500 కంటే ఎక్కువ లైక్‌లు,  244 రీట్వీట్లు వచ్చాయి. అతని మార్క్‌షీట్‌ని చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మార్క్ షీట్ చూసిన నెటిజన్లు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారంటే:  షాబాజ్ మీర్జా అనే ట్విటర్ యూజర్, ‘సర్.. మిగతావన్నీ బాగానే ఉన్నాయి. కానీ గణితం, సాంఘిక శాస్త్రంలో మీరు ప్రతిభ గొప్పదంటూ కామెంట్ చేశారు.. ఈ కామెంట్ కు షాహిద్ బదులిస్తూ.. అవును మధ్యలో స్నేహితులు చాలా సహాయపడ్డారని పేర్కొన్నారు. యూపీఎస్సీలో సోషియాలజీ తీసుకోవడం ద్వారా సోషల్ స్టడీస్ రివెంజ్ పూర్తయిందన్నారు. మరో ట్విటర్‌ యూజర్‌ విజయానికి మార్కులు ముఖ్యం కాదని రుజువైంది. కృషి,  అంకితభావం మాత్రమే ముఖ్యమని పేర్కొన్నారు. అదే సమయంలో మార్కులు మీ భవిష్యత్తును నిర్ణయించలేవని మీరు నిరూపించారు సార్ రియల్లీ గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..