AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచి ఉద్యోగం వదిలుకుని.. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ లో 40 ర్యాంక్‌ సాధించిన అపరాజిత సక్సెస్ స్టోరీ..

IAS Success Story:ఎంతో మంది యువతీ యువకులు చిన్నతనం నుంచి IAS ఆఫీసర్ అవ్వాలని కలలు కంటారు. అయితే ఆ కలను నెరవేర్చుకోవడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షలలో..

మంచి ఉద్యోగం వదిలుకుని.. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ లో 40 ర్యాంక్‌ సాధించిన అపరాజిత సక్సెస్ స్టోరీ..
Ias Officer Aparajita Sharma
Surya Kala
| Edited By: Janardhan Veluru|

Updated on: Jan 19, 2022 | 2:15 PM

Share

IAS Success Story:ఎంతో మంది యువతీ యువకులు చిన్నతనం నుంచే IAS ఆఫీసర్ అవ్వాలని కలలు కంటారు. అయితే ఆ కలను నెరవేర్చుకోవడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి. అందుకోసం ఎన్నో రోజులు కృషి, పట్టుదలతో చదువుకోవాల్సి ఉంటుంది. ఐఏఎస్ అధికారి అంటే ఏమిటో కూడా తెలియని ఓ అమ్మాయి ఎంతో శ్రమించి ఐఎస్ఎస్ అధికారిణి అయ్యింది. ఈ రోజు ఐఏఎస్ అధికారిణి అప్రజితా శర్మ కథ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం..

బనారస్ కు చెందిన అపరాజిత శర్మకు ఐఏఎస్ అధికారి అంటే ఎవరో తెలియదు. ఆ పరీక్షలో ఎలా ఉత్తీర్ణత సాధించాలో కూడా తెలియదు. అయితే చిన్నప్పటి నుండి IAS అధికారి కావాలనే కోరిక ఉంది. ఇక మనవరాలు ఏదో ఒకరోజు అధికారిణి అవుతుందని ఆమె తాత అందరికీ చెప్పారు.. చిన్నప్పుడు ఆఫీసర్ అంటే ఎవరో తెలియదు.. కానీ వయసు వచ్చే కొద్దీ ఐఏఎస్ చదవాలని గట్టిగా సంకల్పించుకున్నారు. ఐఏఎస్ ను కెరీర్‌గా ఎంచుకున్నారు. అపరాజిత 2017 సంవత్సరంలో ఆల్ ఇండియా లో 40 ర్యాంక్‌తో ఉత్తీర్ణత సివిల్స్ సాధించారు. దీంతో ఆమె చిన్ననాటి కల నెరవేర్చుకున్నారు.

బనారస్ లో పాఠశాల విద్యను అభ్యసించిన అపరాజిత ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం రాంచీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు. అపరాజిత తండ్రి IRS అధికారిగా పదవీ విరమణ పొందారు. తల్లి ప్రొఫెసర్.

చదువు పూర్తయ్యాక అపరాజితకు ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆమె డిపార్ట్‌మెంట్‌లోఅపరాజిత ఒక్కతే అమ్మాయి. అయితే కంపెనీలో జరిగిన కొన్ని సంఘటనలు అపరాజితకు స్ఫూర్తినిచ్చాయి. దీంతో అపరాజిత సివిల్ సర్వీసెస్ పరీక్షను రాయాలని నిర్ణయించుకున్నారు. ఒకసారి ప్రయత్నించాలని.. గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలని నిర్ణయించుకున్నారు. పరీక్షలకు సిద్ధం కావడానికి సీనియర్స్ ను అడిగి ప్రణాళిక బద్దంగా చదువుకోవడం మొదలు పెట్టారు. సిలబస్‌ను పరిశీలించి ఆసక్తికి అనుగుణంగా పుస్తకాలను సేకరించి తాను అనుకున్నది చివరికి సాధించారు. అందుకనే సివిల్స్ చదువుకునేవారికి కూడా సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళితే.. సక్సెస్ మీ సొంతం అని చెబుతు న్నారు.

అపరాజిత ఐఏఎస్ ప్రిలిమ్స్ కు ప్రిపేట్ అయ్యే సమయంలో బేసిక్స్ తో పాటు… వార్తాపత్రికలపై దృష్టి సారించారు. ప్రిపరేషన్ సమయంలో మూడు వార్తాపత్రికలు చదివారు.

ఐఏఎస్ కు సిద్దమవుతున్న వారికి ఒకటే చెబుతున్నారు అపరాజిత. ఇంటర్వ్యూ సమయంలో అబద్ధం చెప్పకూడదు. అక్కడ కూర్చున్న వారు మీ కంటే తెలివైన వారు, వారు మీ అబద్ధాన్ని సెకన్లలో పట్టుకుంటారు. మీకు సమాధానం తెలియకపోతే క్షమించండిని అని నిజాయతీగా చెప్పాలని సూచిసున్నారు. అంతేకాదు ఇంటర్వ్యు సమయంలో మీ మనసులో ఉంది చెప్పడం మంచిది. ఎందుకంటే అక్కడ జరిగేది మీ నిజయతీకి పరీక్ష.. మీ జ్ఞానానికి తెలివి తేటలకు కాదు అంటున్నారు ఐఎఎస్ అపరాజిత.

Also Read: ఆరోగ్యంగా , సంతోషంగా ఉండడనికి ఈ వాస్తు చిట్కాలను పాటించండి.. అద్భుత ఫలితాలు మీ సొంతం.. (photo gallery)