- Telugu News Photo Gallery Spiritual photos Health Vastu Tips in telugu Follow these Vastu Tips for good health
Health Vastu Tips: ఆరోగ్యంగా , సంతోషంగా ఉండడనికి ఈ వాస్తు చిట్కాలను పాటించండి.. అద్భుత ఫలితాలు మీ సొంతం..
Health Vastu Tips: ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే సంతోషం, శాంతి, కుటుంబ పురోగతికి ఆటంకాలు ఏర్పడతాయి. అంతేకాదు ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కనుక ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటానికి ఈ వాస్తు చిట్కాలను ప్రయత్నించండి.
Updated on: Jan 19, 2022 | 12:59 PM

క్రమం తప్పకుండా యోగా , ధ్యానం చేయండి. అయితే ఇలా యోగా లేదా ధ్యానం చేయడానికి ఈశాన్య దిశను ఎంచుకోండి. ఇలా చేయడం వలన మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇది మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది.

ఈశాన్య దిక్కున పూజ చేయడం వలన అత్యుత్తమ ఫలితాలు అందుకుంటారు. ఈశాన్య దిశలో పూజలు చేయడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, అంతర్గత ప్రశాంతత లభిస్తుంది. ఎవరినా జపం చేస్తే.. ఈశాన్య దిశకు అభిముఖంగా చేయండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

ఇంట్లో లేత రంగులు వాడటం ఆరోగ్యానికి మంచిది. ఫర్నీచర్, కర్టెన్లు, బెడ్‌షీట్లు, కుషన్లు మొదలైన వాటికి లేత రంగులను ఎంచుకోవాలి. ఇంట్లో ముదురు రంగులను ఉపయోగించడం వలన మనసు ప్రశాంతత కోల్పోతుంది.

వాయువ్య దిశలో ఇంటి యజమాని లేదా మొత్తం కుటుంబం ఉన్న ఫోటో ని పెట్టండి. ఇలా చేయడం వలన కుటుంబ సభ్యుల మధ్య మంచి రిలేషన్ ఉంటుంది.

మెడిసిన్ ను ఎప్పుడు ఉత్తర లేదా ఈశాన్య దిశలో పెట్టుకోవాలి. ఎవరైనా ఇంట్లో చికిత్స పొందుతున్నట్లయితే.. అతని ఉపయోగించే ఔషధాన్ని ఉత్తర లేదా ఈశాన్య దిశలో మాత్రమే ఉంచాలి. ఈ దిశలో ఉంచడం వలన త్వరగా కోలుకుంటారు. ఈ వాస్తు చిట్కాలు నమ్మకాలతో ముడిపడి ఉంటాయి. శాస్త్రీయ ఆధారంగా నిర్ణయించినవి కావు





























