YS Jagan: పేద విద్యార్థులకు అండగా ‘విదేశీ విద్యా దీవెన పథకం’.. రూ. 42 కోట్లను విడుదల చేసిన సీఎం జగన్..

పేద విద్యార్థుల తలరాత మార్చేందుకు నడుం బిగించామంటోంది ఏపీ సర్కార్‌. పేద విద్యార్థులకు కూడా విదేశాల్లోని టాప్‌ యూనివర్సిటీల్లో చదువుకునేందుకు జగన్‌ సర్కార్‌ ఆర్థిక సాయం అందిస్తోంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే వారికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు సీఎం వైస్‌ జగన్‌. మరోవైపు సివిల్ సర్వీస్‌కు ప్రిపేరయ్యే విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం కూడా అందిస్తున్నారు.

YS Jagan: పేద విద్యార్థులకు అండగా ‘విదేశీ విద్యా దీవెన పథకం’.. రూ. 42 కోట్లను విడుదల చేసిన సీఎం జగన్..
Ys Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 20, 2023 | 6:01 PM

పేద విద్యార్థులు…విదేశాల్లో ఎంతటి ఉన్నత విద్య అయినా చదువుకోండి….ఆ చదువులకు తాము చదివింపులు చెల్లిస్తామంటోంది జగన్‌ సర్కార్‌. మీ విదేశీ విద్య అనే కలకు నిధుల రెక్కలు తొడుగుతామని భరోసా ఇస్తోంది. డబ్బున్న వాళ్లే కాదు…పేదింటి పిల్లలు కూడా విదేశాల్లో ఉన్నత విద్యను చదివేందుకు అవకాశం కల్పిస్తోంది. విదేశీ విద్యా దీవెన పథకం.. పేద విద్యార్థుల తలరాతను మారుస్తుందన్నారు ఏపీ సీఎం జగన్‌. విదేశాల్లోని టాప్‌ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పేద విద్యార్థులకు సైతం కల్పిస్తున్నామన్నారు ఆయన. మరోవైపు సివిల్‌ సర్వీసెస్‌కు ప్రిపేరయ్యే విద్యార్థులకు కూడా ఆర్థిక తోడ్పాటును అందించారు ముఖ్యమంత్రి. తాజాగా జగనన్న విదేశీ విద్యాదీవెన, జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహక పథకాల కింద దాదాపు 42 కోట్ల రూపాయల నిధులను సీఎం వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు.

పేద విద్యార్థుల తలరాత మార్చేందుకు నడుం బిగించామంటోంది ఏపీ సర్కార్‌. పేద విద్యార్థులకు కూడా విదేశాల్లోని టాప్‌ యూనివర్సిటీల్లో చదువుకునేందుకు జగన్‌ సర్కార్‌ ఆర్థిక సాయం అందిస్తోంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే వారికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు సీఎం వైస్‌ జగన్‌. మరోవైపు సివిల్ సర్వీస్‌కు ప్రిపేరయ్యే విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం కూడా అందిస్తున్నారు. దీనిలో భాగంగా జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ. 41.59 కోట్లను.. సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమచేశారు. వీరిలో సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన 95 మందికి లబ్ధి చేకూరనుంది. అదే విధంగా 95 మందిలో తిరిగి మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది లబ్ధి పొందనున్నారు.

రూ. 108 కోట్ల సాయం..

సివిల్ సర్వీస్ పరీక్షలో ప్రిలిమినరీ పాసైన విద్యార్థులకు లక్ష రూపాయల ప్రోత్సాహకం.. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైతే అదనంగా మరో రూ. 50 వేల ప్రోత్సాహకం అందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల అభ్యర్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన శిక్షణతో పాటు వారు సొంతంగా ప్రిపేర్ అయ్యేందుకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నారు. ఇక జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద విదేశాల్లోని అత్యున్నత యూనివర్సిటీల్లో చదివే పేద విద్యార్థులకు సాయం అందిస్తున్నారు. ఇప్పటిదాకా 408మంది విద్యార్థులకు 108 కోట్ల రూపాయలు విదేశీ విద్యా దీవెన పథకం కింద అందించామన్నారు సీఎం జగన్‌. ఈ పథకం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందన్నారు ముఖ్యమంత్రి.

చదువుకునేందుకు పేద విద్యార్ధులు ఇబ్బంది పడకూడదన్నారు సీఎం జగన్‌. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దన్నారు. విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్ధుల కల నెరవేర్చడమే తమ లక్ష్యమన్నారు సీఎం. ప్రభుత్వ సాయంతో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు…భవిష్యత్తులో ఏపీకి తిరిగి ఏదో ఒకటి చేసి రుణం తీర్చుకోవాలని జగన్‌ ఆకాంక్షించారు. బైట్‌: వైఎస్‌ జగన్‌, ఏపీ సీఎం

పేద విద్యార్థుల, విదేశీ విద్య కలకు నిధుల రెక్కలు తొడుగుతోంది జగన్‌ సర్కార్‌. దాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఏపీకి తిరిగి సాయం చేయండంటోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..